• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • WHAT IS MINOXIDIL HOW TO USE IT WHAT ARE THE BENEFITS OF IT WHICH SIDE EFFECTS COME FROM IT FULL DETAILS NK

Minoxidil: హెయిర్ లాస్‌కి సెలెబ్రిటీల పరిష్కారం... దీన్ని వాడితే జుట్టు పెరుగుతుందా?

Minoxidil: హెయిర్ లాస్‌కి సెలెబ్రిటీల పరిష్కారం... దీన్ని వాడితే జుట్టు పెరుగుతుందా?

హెయిర్ లాస్‌కి సెలెబ్రిటీల పరిష్కారం... దీన్ని వాడితే జుట్టు పెరుగుతుందా?

Hairfall: మినాక్సిడిల్ ఎలా పని చేస్తుంది? దాని వల్ల ఎంత ప్రయోజనం కలుగుతుంది? దాని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్‌లను తెలుసుకుందాం.

  • Share this:
    Minoxidil: మారిన వాతావరణ పరిస్థితులు, తీసుకుంటున్న ఆహారం లేదంటే వంశపారంపర్య కారణాల వల్ల కొంతమందిలో జుట్టురాలడం జరుగుతోంది. చిన్న వయసులోనే బట్టతల రావడం లేదా జుట్టు పల్చబడటం ఈ మధ్య తరచూ వింటున్నాం. అయితే దీనికి సాధారణంగా డాక్టర్లు మినాక్సిడిల్‌ను వాడమని సలహా ఇస్తుంటారు. అసలు మినాక్సిడిల్ ఎలా పని చేస్తుంది? దాని వల్ల ఎంత ప్రయోజనం కలుగుతుంది? దాని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్‌లను తెలుసుకుందాం. చాలామంది సెలబ్రెటీలు జుట్టురాలే సమస్యను ఎదుర్కొన్నా... డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి మినాక్సిడిల్ లేదా దాని కాంబినేషన్‌లని వాడి, మంచి ఫలితాలు పొందారు.

    మినాక్సిడిల్ ఏం చేస్తుంది?
    మినాక్సిడిల్ అనేది మనకు మార్కెట్లో లోషన్, జెల్, ఫోం రూపంలో లభిస్తుంది. అయితే డాక్టర్లు ఎక్కువగా లోషన్‌ను వాడమని సిఫార్సు చేస్తుంటారు. మినాక్సిడిల్‌ను తల మీద ఎక్కడైతే తక్కువ వెంట్రుకలు ఉంటాయో లేదా ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ అప్లై చేయాలి. లోషన్ అయితే చుక్కలుగా వాడి, ఒక నిమిషం పాటు లైట్‌గా మసాజ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని డాక్టర్లు చెబుతారు. మినాక్సిడిల్ వల్ల వెంట్రుకలు లేదా జుట్టుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. రక్త నాళాలను వెడల్పు చేయడంలో మినాక్సిడిల్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే జుట్టుకు రక్త ప్రసరణ పెరగడంతో జుట్టుకు లభించే పోషకాలు పెరుగుతాయి.

    మినాక్సిడిల్‌ను ఎలా వాడాలి?
    మినాక్సిడిల్‌ను డాక్టర్ల సిఫార్సుతో వాడటం మంచిది. మీ సమస్య తీవ్రతను బట్టి మినాక్సిడిల్ ఎంత మోతాదు వాడాలనేది డాక్టర్లు స్పష్టంగా చెప్పగలరు. సాధారణంగా ఉదయం తలస్నానం చేశాక 1 మి.లీల మినాక్సిడిల్‌ను తల మీద వేసి, ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మెల్లిగా మసాజ్ చేయాలి. ఇదే విధంగా సాయంత్రం పూట కూడా చేయాలి. అయితే రోజుకు రెండు మి.లీల కన్నా ఎక్కువ వాడ కూడదని డక్టర్లు హెచ్చరిస్తుంటారు.

    ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే?
    డాక్టర్ల సూచనతో మినాక్సిడిల్‌ను వాడటం మొదలు పెట్టిన వెంటనే ఫలితాలు రావు. అందుకు 4 నుంచి 6 నెలల దాకా పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇవి మొదట చిన్న చిన్న నూగు వెంట్రుకలతో ప్రారంభమై రెండు నుంచీ మూడు సెం.మీల పొడవు పెరిగే అవకాశం ఉంది.

    మొదటిసారి వాడుతున్నారా?
    మినాక్సిడిల్‌ను మొదటిసారి వాడుతున్నప్పుడు కొన్ని సాధారణ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొందరికి మాడు మీద కురుపులు రావడం, ఎర్రగా కనిపించడం, కొందరిలో మాడు భాగం కాస్త నొప్పిగా అనిపించడం సహజంగా జరుగుతుంది. అలాగే మినాక్సిడిల్‌ను వాడటం ప్రారంభించిన మొదటి వారంలో కాస్త ఎక్కువ జుట్టు రాలుతుందని, దానిని చూసి భయపడనక్కర్లేదని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు.


    మినాక్సిడిల్ పై ఉన్న పెద్ద అపోహ:
    మినాక్సిడిల్‌ను వాడటం వల్ల సెక్స్ సామర్థ్యం తగ్గుతుందని కొంతమంది అపోహ పడుతుంటారు. కానీ సెక్స్ సామర్థ్యం మీద మినాక్సిడిల్ ప్రభావం చూపుతున్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని డాక్లర్లు చెబుతున్నారు. అంతే కాదు, మినాక్సిడిల్ స్టెరాయిడ్ అని కూడా కొందరు భావిస్తారు. అందులోనూ నిజం లేదని నిపుణులు నిరూపించారు.

    ఇలా అయితే వెంటనే ఆపెయ్యండి:
    · మినాక్సిడిల్ వాడుతుంటే తలభాగం లేదా ముఖం మీద అవాంఛిత రోమాలు వస్తే, దాని వాడకాన్ని ఆపి, వెంటనే డెర్మటాలజిస్టును సంప్రదించాలి.
    · గుండె దడ వస్తున్నట్లు అనిపిస్తే వెంటనే మినాక్సిడిల్ వాడకాన్ని ఆపాలని, అలాగే వెంటనే ఫిజీషియన్‌ను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
    · తల లేదా ముఖం చుట్టూ వాపు కనిపిస్తే వెంటనే మినాక్సిడిల్‌ను వాడటం ఆపి, డాక్టర్‌ని సంప్రదించాలి

    ఇది కూడా చదవండి: Vastusashtra: అప్పులు పోయి... డబ్బు సంపాదించాలా... ఇంట్లో ఈ మార్పులు చెయ్యండి

    జాగ్రత్తలు:
    · మినాక్సిడిల్‌ను వాడిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
    · తల మీద మినాక్సిడిల్ అప్లై చేసేటప్పుడు ముఖం మీద పడితే వెంటనే తుడిచెయ్యాలి.
    · మినాక్సిడిల్ అప్లై చేసిన రెండు గంటల వరకు తలస్నానం చేయకపోవడం మంచిది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు