Home /News /life-style /

WHAT IS MINI HEART ATTACK REASONS AND HOW TO PREVENT IT KNOW HERE BA GH

What is Mini Heart Attack: మినీ హార్ట్ ఎటాక్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గుండెపోటు, మినీ హార్ట్ ఎటాక్ రెండూ మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితులేనని వైద్యులు చెబుతున్నారు. ఎవరిలోనైనా గుండెపోటు లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మినీ హార్ట్ లక్షణాలు సాధారణ గుండెపోటు లక్షణాల మాదిరిగానే ఉంటాయి.

 • Trending Desk
 • Last Updated :
 • Andhra Pradesh | Telangana | Karnataka | Maharashtra
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నమోదవుతున్న మరణాల్లో ఎక్కువ శాతం గుండెపోటుకు సంబంధించినవే ఉంటున్నాయి. గుండెపోటును ముందుగానే గుర్తించగలిగితే, మరణాల శాతాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. అయితే చాలామంది బాధితులు ఈ సమస్యను ముందుగానే గుర్తించడంలో విఫలమవుతుంటారు. గుండెపోటు లక్షణాలను గుర్తించలేకపోవడం, సంకేతాలను విస్మరించడం వల్ల సమస్య తీవ్రమైన తర్వాతే చికిత్స తీసుకుంటారు. దీంతో ప్రమాద తీవ్రత పెరిగి మరణాలకు దారితీస్తుంది. అయితే ఈ హార్ట్ ఎటాక్‌లో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో మినీ హార్ట్ ఎటాక్ ఒకటి. దీని లక్షణాలు, కారణాలు, నివారణ పద్ధతులు ఏవో తెలుసుకుందాం. 

మినీ హార్ట్ ఎటాక్ అంటే ఏంటి?

మానవ శరీర అవయవాలకు గుండె రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. ఇందుకు గుండెకు ఆక్సిజన్ ఉండే రక్త సరఫరా సక్రమంగా జరగాలి. ఈ సరఫరా పాక్షికంగా లేదా పూర్తిగా ఆగిపోయినప్పుడు, గుండె కణాలు చనిపోయి గుండెపోటు రావచ్చు. దీన్ని వైద్యపరంగా మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ (Myocardial Infarction) అంటారు. గుండెకు రక్త సరఫరా తగ్గడానికి నాళాల లోపల కొవ్వు పేరుకుపోవడం ప్రధానం కారణం కావచ్చు. 

షుగర్ ఎటాక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డయాబెటిస్‌ నివారణ పద్ధతులు ఏవి?గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన ధమనులలో ఒకటి (కరోనరీ ధమనులు) పూడుకుపోతే.. ఆ ధమని నుంచి రక్తం అందే గుండె భాగం దెబ్బతిని గుండెపోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, లేదా MI) సంభవిస్తుంది. ధమని ఎంత ఎక్కువసేపు బ్లాక్ అయితే అంత తీవ్రంగా గుండెపోటు ఉంటుంది. నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే ధమనిలో పాక్షికంగా పూడిక ఏర్పడినప్పుడు, ఇతర నాళాల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు.. గుండె కండరాలలో చిన్న భాగాలు ప్రభావితం అవుతాయి. ఇది ఎక్కువ, శాశ్వత నష్టాన్ని కలిగించదు. దీన్ని మినీ హార్ట్ ఎటాక్ లేదా మైల్డ్ హార్ట్ ఎటాక్ అంటారు. వైద్యపరంగా దీన్ని నాన్-ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్‌క్షన్ (NSTEMI)గా వ్యవహరిస్తారు. 

Cancer Types: క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ ఎన్ని రకాలుగా వ్యాపిస్తుంది? ఈ సమస్య ఉన్నవారిలో చాలా తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో సాధారణంగా చాలామంది వీటిని విస్మరిస్తారు. అజీర్ణం లేదా కండరాల ఒత్తిడి కారణంగా ఇలా జరుగుతుందని భావిస్తారు. దీనికి ఎలాంటి చికిత్స తీసుకోరు. అయితే మినీ హార్ట్ ఎటాక్ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

What is cholesterol : కొలెస్ట్రాల్ అంటే ఏంటి? అసలు ఇది ఎందుకు పెరుగుతుంది? దీన్ని ఎలా తగ్గించాలి?


  

మినీ హార్ట్ ఎటాక్ లక్షణాలు ఎలా ఉంటాయి?

గుండెపోటు, మినీ హార్ట్ ఎటాక్ రెండూ మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితులేనని వైద్యులు చెబుతున్నారు. ఎవరిలోనైనా గుండెపోటు లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మినీ హార్ట్ లక్షణాలు సాధారణ గుండెపోటు లక్షణాల మాదిరిగానే ఉంటాయి. కానీ చాలా తక్కువ సమయం వరకు ఉంటాయి. అవేంటంటే.. 

 • ఛాతీలో నొప్పి, ఒత్తిడి లేదా అసౌకర్యం. ఈ అసౌకర్యం చాలా నిమిషాలు ఉండవచ్చు, లేదా వచ్చి పోవచ్చు.

 • చేతులు, వీపు, మెడ, గొంతు, దవడ లేదా కడుపుతో సహా  శరీరంలోని ఇతర ఎగువ భాగాలలో నొప్పి, జలదరింపు, అసౌకర్యం, కండరాలు పిండేసినట్లు బాధ కలగడం

 • ఎడమ చేతి నుంచి ఛాతీ వరకు తేలికపాటి నొప్పి

 • శ్వాస తీసుకోవడంలో సమస్యలు

 • వికారం (Nausea)

 • వాంతులు అవ్వడం

 • తేన్పులు (Belching, burping)

 • గుండెల్లో మంట

 • కారణం లేకుండా చెమటలు పట్టడం

 • చర్మం తేమగా మారడం, చలిగా అనిపించడం

 • గుండె కొట్టుకొనే వేగం పెరగడం, హార్ట్ బీట్‌లో భారీ మార్పులు

 • తలతిరగడం

 • మైకం, మూర్ఛ


వీటితో పాటు మహిళల్లో అదనంగా పొత్తికడుపు పైభాగంలో నొప్పి, విపరీతమైన అలసట లేదా వీక్‌నెస్ వంటివి మినీ హార్ట్ ఎటాక్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించాలి. మినీ హార్ట్ ఎటాక్‌ను నిర్ధారించడానికి, నష్టాన్ని అంచనా వేసి చికిత్స అందించడానికి వైద్యులు ECG, ECHO, ఇతర అధునాతన పరీక్షలు చేస్తారు. 

మినీ హార్ట్ ఎటాక్‌ రావడానికి కారణం ఏంటి? 

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమని మూసుకుపోయి, ఆ ధమని నుంచి రక్తం అందే గుండె భాగం దెబ్బతినడం వల్ల గుండెపోటు లేదా మినీ హార్ట్ ఎటాక్ వస్తుంది. ఇది సాధారణంగా కరోనరీ హార్ట్ డిసీజ్ లేదా కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనే పరిస్థితి కారణంగా సంభవిస్తుంది. కరోనరీ హార్ట్ డిసీజ్‌లో గుండె ధమనుల గోడలపై కొవ్వు నిల్వలు ఏర్పడతాయి. ఇవి గుండెకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ సరఫరాను అడ్డుకుంటాయి. ఫలితంగా గుండె కండరాలు, సున్నితమైన భాగాలకు రక్తం చేరడం ఆగిపోతుంది.

కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాద కారకాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..

 1. అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్)

 2. మధుమేహం

 3. పొగతాగడం

 4. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం 

 5. సరైన జీవనశైలి పాటించకపోవడం

 6. అధిక బరువు లేదా ఊబకాయం

 7. ఒత్తిడి


నివారణ పద్ధతులు

మినీ హార్ట్ ఎటాక్, మాసివ్ హార్ట్ ఎటాక్ వంటివి రాకుండా ఉండాలంటే, ముందు నుంచి కొన్ని అలవాట్లు, పద్ధతులు పాటించాలి. గుండెపోటు రావడానికి కారణం ధమనుల్లో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం. కొన్ని సాధారణ, ఆహార పరమైన మార్పులు ఈ ప్రమాదాన్ని కొంత వరకు తగ్గించగలవు. గుండెపోటు, మినీ హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడే నివారణ మార్గాలు కొన్ని ఉన్నాయి.

వ్యాయామం

రోజుకు 30 నిమిషాలు చొప్పున కనీసం వారానికి 5 సార్లు తక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామం చేయాలి. ఇది శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులను కరిగించే ఆరోగ్యకరమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు.

ట్రాన్స్ ఫ్యాట్స్, శాచురేటెడ్ ఫ్యాట్స్ వద్దు

జంక్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్‌ నుంచి ట్రాన్స్ ఫ్యాట్స్, శాచురేటెడ్ ఫ్యాట్స్ శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌గా మారి, రక్త నాళాల్లో ఫలకాలుగా ఏర్పడతాయి. ఇలాంటి ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఆకు కూరలు, పండ్లు తినాలి

తాజా ఆకుకూరలు, పండ్లలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి. సీజనల్ పండ్లను తరచుగా తినాలి.

స్మోకింగ్, ఆల్కహాల్ మానేయాలి

ఈ చెడు అలవాట్లతో రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం పెరుగుతుందని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. పొగ తాగడం, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రక్త నాళాలు సంకోచించి, రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. 

ఇతర అలవాట్లు

యోగా, మెడిటేషన్‌ వంటివి ఒత్తిడిని తగ్గించి, మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. పరోక్షంగా గుండెపై భారాన్ని తగ్గిస్తాయి.

ఇప్పటికే గుండె వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు మినీ హార్ట్ ఎటాక్‌ లక్షణాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ.. BP, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవడం, డయాబెటిస్ మేనేజ్‌మెంట్ వంటివి గుండెపోటును నివారించే కీలక విషయాలు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Health Tips, Heart Attack

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు