హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Measles: భయపెడుతున్న మీజిల్స్.. పిల్లల్లో వేగంగా వ్యాప్తి.. దీని లక్షణాలేంటి? నివారణ మార్గాలేంటి..?

Measles: భయపెడుతున్న మీజిల్స్.. పిల్లల్లో వేగంగా వ్యాప్తి.. దీని లక్షణాలేంటి? నివారణ మార్గాలేంటి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Measles: వైరస్‌ బారిపడిన 10 నుండి 12 రోజుల తర్వాత అధిక జ్వరం ప్రారంభమవుతుంది. జ్వరం నాలుగు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుంది. పిల్లల్లో జలుబు, ముక్కు కారడం, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, కళ్ల మంటలు, కళ్లు ఎర్రబడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దేశంలో మీజిల్స్  (Measles) వ్యాధి తీవ్ర కలకలం రేపుతోంది. కేరళ (Kerala), మహరాష్ట్ర(Maharashtra)లో కేసులు పెరుగుతున్నాయి. క్రమంగా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే ఈ తట్టు వ్యాధి.. ఇప్పటికే పలువురిని బలి తీసుకుంది. మీజిల్స్ (తట్టు) తట్టు ఒక అంటువ్యాధి. రూబియోలా అని కూడా పిలుస్తారు. ఇది పారామైక్సోవైరస్ అనే వైరస్ ద్వారా సంక్రమించే తీవ్రమైన అంటువ్యాధి. ఈ వైరస్ శ్వాసకోశానికి సోకుతుంది. ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తుంది. దీనికి టీకా అందుబాటులో ఉన్నప్పటికీ.. చాలా మంది పిల్లలు వేసుకోకపోవం వల్ల.. ఈ వ్యాధికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు.

గతంలో రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి మీజిల్స్ వ్యాధి విజృంభించేది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 26 లక్షల మంది మరణించేవారు. 1963లో మీజిల్స్ వ్యాక్సీన్‌ను కనుగొన్న తరువాత పరిస్థితి మారింది. ఈ వ్యాధి క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఐనప్పటికీ 2018లో 1,40,000 మందికి పైగా మరణించారు. 2021లో 1,28,000 మంది మీజిల్స్ కారణంగా మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకార.. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లోనే ఈ వ్యాధి అధికంగా కనిపిస్తోంది. వైరస్ కారణంగా ముంబైలో ఇప్పటికే ఏడుగురు చిన్నారులు కన్నుమూశారు.

చలికాలంలో ప్రసవం జరిగితే ఈ 6 పదార్థాలు తప్పక తీసుకోవాలి..

లక్షణాలు..

వైరస్‌ బారిపడిన 10 నుండి 12 రోజుల తర్వాత అధిక జ్వరం ప్రారంభమవుతుంది. జ్వరం నాలుగు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుంది. పిల్లల్లో జలుబు, ముక్కు కారడం, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, కళ్ల మంటలు, కళ్లు ఎర్రబడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రారంభ దశలో నోటి లోపల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. ముఖం, మెడపై ఎర్రటి పొక్కులు కనిపిస్తాయి. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా .. ఆ తుంపరల నుంచి వైరస్ గాలిలో కలుస్తుంది. వాటి ద్వారా ఆరోగ్యకరమైన వ్యక్తికి కూడా మీజిల్స్ సంక్రమించే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు సాధారణంగా రెండో వారంలో బయటపడతాయి. వారిని నేరుగా కలిసినా ఇన్‌ఫెక్షన్ సోకుతుంది.

Winter Health Tips: ముల్లంగి చలికాలంలో ఆరోగ్యానికి వరం

ఎవరికి ముప్పు.?

మీజిల్స్ టీకాలు వేయని పిల్లలకు తట్టు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు కూడా దీని ముప్పు ఉంటుంది. పోషకాహారల లోపం, విటమిన్-A లోపం ఉన్న పిల్లలు, HIV/AIDS, రోగనిరోధక శక్తి తక్కువ ఉండే వారిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. వ్యాధి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఆస్పత్రికి వెళ్లి డాక్టర్‌ని సంప్రదించాలి. లేదంటే అంధత్వం, ఎన్సెఫాలిటిస్ , తీవ్రమైన డయేరియా, డీహైడ్రేషన్, చెవి ఇన్ఫెక్షన్, న్యుమోనియా వంటి తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది. అందువల్ల మీ పిల్లలకు మీజిల్స్, రూబిల్లా వ్యాక్సీన్లు వేయించకుంటే.. వెంటనే వేయించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

చికిత్స, నివారణ

WHO ప్రకారం.. ఈ వ్యాధికి ప్రత్యేక యాంటీవైరల్ చికిత్స లేదు. సరైన పోషకాహారంతో పాటు రీహైడ్రేషన్ ద్రావణాన్ని ఉపయోగించడం ద్వారా రోగులలో సమస్యలను తగ్గించవచ్చు. కంటి , చెవి ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి రోగులకు యాంటీబయాటిక్స్ ఇస్తారు. మీజిల్స్‌తో బాధపడుతున్న పిల్లలకు కంటి దెబ్బతినకుండా.. అంధత్వాన్ని నివారించడానికి విటమిన్-A సప్లిమెంట్లను ఇవ్వాలి. ఈ వ్యాధి బారినపడకుండా ఉండేందుకు.. వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. సబ్బుతో చేతులు కడుక్కోవాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు సంబంధించిన టూత్ బ్రష్‌లు, రుమాలు, పాత్రలను వాడవద్దు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

First published:

Tags: Health, Health Tips, Lifestyle, Measle

ఉత్తమ కథలు