Home /News /life-style /

WHAT IS HEART DISEASE AND TYPES OF HEART DISEASE SYMPTOMS CAUSES GH SRD

Types of Heart Diseases : గుండె జబ్బుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? వాటి లక్షణాలు, వ్యాధికి కారణాలు ఏంటి?

Heart Disease

Heart Disease

Types of Heart Diseases : గుండె జబ్బు అనేది గుండె నిర్మాణం లేదా పనితీరును ప్రభావితం చేసే అనారోగ్య పరిస్థితి. వైద్యపరంగా గుండె జబ్బుల్లో అనేక రకాలు ఉన్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
గుండె జబ్బు అనేది గుండె నిర్మాణం లేదా పనితీరును ప్రభావితం చేసే అనారోగ్య పరిస్థితి. వైద్యపరంగా గుండె జబ్బుల్లో అనేక రకాలు ఉన్నాయి. గుండె నిర్మాణం లేదా పనితీరును వ్యాధి ఎలా ప్రభావితం చేస్తుందనే దాని ఆధారంగా వీటిని వర్గీకరించవచ్చు. గుండె జబ్బులను ప్రధానంగా 6 రకాలుగా వర్గీకరించవచ్చు. అవేంటంటే..

- కరోనరీ ఆర్టరీ డిసీజ్ (Coronary Artery Disease)

- గుండె లయ సమస్యలు (Arrhythmias)

- పుట్టుకతో వచ్చే గుండె లోపాలు (Congenital Heart Defects)

- హార్ట్ వాల్వ్ వ్యాధి (Heart Valve Disease)

- గుండె కండరాల వ్యాధి (Disease of the heart muscle)

- హార్ట్ ఇన్ఫెక్షన్ (Heart infection)

ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా అనేక రకాల గుండె జబ్బులను నివారించవచ్చు లేదా చికిత్స చేయవచ్చు. మీకు ఏ రకమైన గుండె జబ్బు ఉంది అనే దానిపై గుండె జబ్బు లక్షణాలు ఆధారపడి ఉంటాయి.

* కరోనరీ ఆర్టరీ వ్యాధి
ధమనులలో కొవ్వు ఫలకాలు ఏర్పడటం లేదా అథెరోస్క్లెరోసిస్ (ath-ur-o-skluh-ROE-sis) కారణంగా వ్యక్తుల రక్తనాళాలు, గుండెపై ప్రభావం పడుతుంది. ఈ కొవ్వు ఫలకాలు ఏర్పడితే రక్తనాళాల మార్గం ఇరుకుగా మారుతుంది. లేదా నాళాలు పూడుకుపోతాయి. ఇది గుండెపోటు, ఛాతీ నొప్పి (ఆంజినా) లేదా స్ట్రోక్‌కు దారితీయవచ్చు. కరోనరీ ఆర్టరీ వ్యాధి లక్షణాలు పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా ఉండవచ్చు. పురుషులకు ఛాతీ నొప్పి వచ్చే అవకాశం ఉంది. మహిళల్లో ఛాతీ అసౌకర్యంతో పాటు శ్వాస ఆడకపోవడం, వికారం, విపరీతమైన అలసట వంటి ఇతర లక్షణాలు ఉండవచ్చు.

- లక్షణాలు

ఛాతీ నొప్పి, ఒత్తిడి, అసౌకర్యం (ఆంజినా)

శ్వాస ఆడకపోవడం

కాళ్లు లేదా చేతుల్లో నొప్పి, తిమ్మిరి, బలహీనత లేదా చల్లదనం

మెడ, దవడ, గొంతు నొప్పులు, పొట్ట పైభాగంలో లేదా వెన్నులో నొప్పి

ఎవరికైనా గుండెపోటు, ఆంజినా, స్ట్రోక్ లేదా హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే వరకు వారికి కొరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కాకపోవచ్చు. లక్షణాలను గమనించడం, తరచుగా చెకప్ చేయించుకోవడం ద్వారా సమస్యను ముందుగానే గుర్తించవచ్చు.

- కొరోనరీ ఆర్టరీ వ్యాధికి కారణాలు
ధమనులలో కొవ్వు ఫలకాలు ఏర్పడటం (అథెరోస్క్లెరోసిస్) అనేది కరోనరీ ఆర్టరీ వ్యాధికి మూల కారణం. అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు, పోషకాలు లేని ఆహారం, వ్యాయామం లేదా శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, ధూమపానం వంటివి అథెరోస్క్లెరోసిస్‌కు దారితీస్తాయి.

* హార్ట్ అరిథ్మియా
ఈ వ్యాధి ఉన్నవారిలో గుండె కొట్టుకునే వేగం అసాధారణంగా హెచ్చుతగ్గులకు గురవుతుంది. వీరిలో గుండె చాలా త్వరగా, చాలా నెమ్మదిగా లేదా సక్రమంగా కొట్టుకోవచ్చు.

- హార్ట్ అరిథ్మియా లక్షణాలు

ఛాతీలో నొప్పి, అసౌకర్యం

హార్ట్ రేట్ పెరగడం (టాచీకార్డియా)

హార్ట్ రేట్ తగ్గడం (బ్రాడీకార్డియా)

శ్వాస ఆడకపోవడం

తలతిరగడం

మూర్ఛ (సింకోప్)

- హార్ట్ అరిథ్మియా కారణాలు

కరోనరీ ఆర్టరీ వ్యాధి, మధుమేహం, మెడిసిన్ వాడకం పెరగడం, ఆల్కహాల్ లేదా కెఫిన్ వినియోగం పెరగడం, పుట్టుకతో వచ్చే గుండె లోపాలు, అధిక రక్త పోటు, ధూమపానం, కొన్ని రకాల ఆహార పదార్ధాలు, ఒత్తిడి, వాల్యులర్ హార్ట్ డిసీజ్ వంటివి ఉన్నవారు హార్ట్ అరిథ్మియా బారిన పడవచ్చు.

విద్యుత్ షాక్, డ్రగ్స్ వినియోగం, వైద్యుల సలహా లేకుండా కొన్ని రకాల మందుల వాడకం, ఇతర కారణాలు లేకుండా ఆరోగ్యవంతమైన వ్యక్తుల్లో గుండె ఆరోగ్యం దెబ్బతిని హార్ట్ అరిథ్మియా వచ్చే అవకాశం లేదు. అయితే ఇతర గుండె వ్యాధుల కారణంగా గుండెలోని ఎలక్ట్రిక్ సిగ్నల్స్ పనితీరు తగ్గిపోయినప్పుడు కూడా అరిథ్మియా అభివృద్ధి చెందుతుంది.

* పుట్టుకతోనే వచ్చే గుండె జబ్బులు
కొంతమందికి పుట్టుకతోనే గుండె సమస్యలు వస్తాయి. సాధారణంగా పుట్టిన వెంటనే బాధితుల్లో ఈ సమస్యలను గుర్తిస్తారు.

- పిల్లల్లో గుండె వైఫల్యాలను కొన్ని లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చు. అవేంటంటే..

లేత బూడిద లేదా నీలం చర్మం రంగు (సైనోసిస్)

కాళ్లు, పొత్తికడుపు లేదా కళ్ల చుట్టూ ఉన్న ప్రాంతాల్లో వాపు

పిల్లలు ఏదైనా తినే సమయంలో ఊపిరి ఆడకపోవటం, బరువు పెరగకపోవడం

ఇది కూాడా చదవండి : భోజనం చేసిన తర్వాత ఈ ఒక్క చిన్న పని చేయండి.. సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం..

పుట్టుకతో వచ్చే గుండె సమస్యల తీవ్రత తక్కువగా ఉంటే, అవి యుక్త వయసుకు వచ్చే వరకు బయటపడకపోవచ్చు. సాధారణంగా ఇలాంటి లక్షణాలు వెంటనే ప్రాణాపాయం కలిగించవు. వ్యాయామం లేదా శారీరక శ్రమ చేసినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చిన్న పనులకే అలసిపోవడం, చేతులు, చీలమండలు లేదా పాదాలలో వాపు వంటివి తక్కువ తీవ్రతతో పుట్టుకతోనే వచ్చే గుండె వ్యాధుల లక్షణాలు.

- కారణాలు
సాధారణంగా బిడ్డ కడుపులో ఉన్నప్పుడే గుండె లోపాలు అభివృద్ధి చెందుతాయి. కొన్ని వైద్య పరిస్థితులు, మందులు, జన్యువులు గుండె లోపాలకు కారణం కావచ్చు.

* గుండె కండరాల్లో సమస్యల కారణంగా వచ్చే కార్డియోమయోపతి
కార్డియోమయోపతి ప్రారంభ దశలలో ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. చాలా సందర్భాల్లో పరిస్థితి మరింత దిగజారినప్పుడు మాత్రమే లక్షణాలు బయటపడతాయి.

- లక్షణాలు

విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

కాళ్లు, చీలమండలు, పాదాల వాపు

అలసట

గుండె కొట్టుకునే వేగంలో మార్పులు

తల తిరగడం, మూర్ఛపోవడం

- కార్డియోమయోపతి రావడానికి కారణాలు
గుండె కండరాలు గట్టిపడటం లేదా విస్తరించడం వల్ల కార్డియోమయోపతి రావచ్చు. దీంట్లో అనేక రకాలు ఉన్నాయి.

డైలేటెడ్ కార్డియోమయోపతి- ఇది అత్యంత సాధారణమైన కార్డియోమయోపతి. దీనికి కారణం తెలియదు. ఎడమ జఠరిక విస్తరించడం వల్ల ఈ సమస్య రావచ్చు. గుండెపోటు, అంటువ్యాధులు, టాక్సిన్స్, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే కొన్ని ఔషధాల ప్రభావం వల్ల గుండెకు రక్త ప్రసరణ తగ్గడం (ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్).. వంటి కారణాలు డైలేటెడ్ కార్డియోమయోపతికి కారణం కావచ్చు. తల్లిదండ్రులకు ఈ వ్యాధి ఉంటే పిల్లలకు కూడా సంక్రమించవచ్చు.

హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి- ఈ రకం సాధారణంగా వంశపారం పర్యంగా సంక్రమిస్తుంది. అధిక రక్తపోటు లేదా వృద్ధాప్యం కారణంగా కూడా కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది.

రిస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి- గుండె కండరాలు దృఢంగా, తక్కువ సాగేలా చేసే ఈ పరిస్థితి అరుదుగా వస్తుంది. ఇది ఎటువంటి కారణం లేకుండా సంభవించవచ్చు. లేదా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ లేదా అసాధారణ ప్రొటీన్ల (అమిలోయిడోసిస్) నిర్మాణం వంటి వ్యాధుల వల్ల కూడా రావచ్చు.

* హార్ట్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఎండోకార్డిటిస్
ఎండోకార్డిటిస్ అనేది గుండె గదులు, గుండె కవాటాల (ఎండోకార్డియం) లోపలి పొరను ప్రభావితం చేసే ఇన్ఫెక్షన్.

- హార్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలు

జ్వరం

శ్వాస ఆడకపోవడం

బలహీనత లేదా అలసట

కాళ్లు లేదా పొత్తికడుపులో వాపు

గుండె లయలో మార్పులు

పొడి లేదా నిరంతర దగ్గు

చర్మంపై దద్దుర్లు లేదా అసాధారణ మచ్చలు

- కారణాలు
గుండె కండరాలకు క్రిములు చేరినప్పుడు ఎండోకార్డిటిస్ వంటి ఇన్ఫెక్షన్ రావచ్చు. బాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు సమస్యకు కారణం కావచ్చు.

* వాల్వులర్ హార్ట్ డిసీజ్
గుండెకు నాలుగు కవాటాలు (valves) ఉంటాయి. ఇవి రక్త ప్రవాహంలో కీలక పాత్ర పోషిస్తాయి. కవాటాలు కుంచించుకుపోవడం (స్టెనోసిస్), లీకింగ్ (రెగ్యురిటేషన్ లేదా ఇన్సఫిసియెన్సీ) లేదా పనితీరులో లోపాల (ప్రోలాప్స్) వంటి సమస్యలతో గుండె కవాటాలు దెబ్బతింటాయి. ఈ సమస్యనే వాల్వులర్ హార్ట్ డిసీజ్ అంటారు.

- లక్షణాలు
ఏ వాల్వ్ సరిగ్గా పని చేయట్లేదు అనేదానిపై ఈ వ్యాధి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని సాధారణ లక్షణాలు..

అలసట

శ్వాస ఆడకపోవడం

గుండె కొట్టుకునే వేగంలో మార్పులు

పాదాలు, చీలమండల వాపు

ఛాతి నొప్పి

మూర్ఛ

- కారణాలు
గుండె కవాటాల వ్యాధులకు అనేక అంశాలు కారణమవుతాయి. కొందరు పుట్టుకతోనే వాల్యులార్ వ్యాధితో జన్మించి ఉండవచ్చు. రుమాటిక్ ఫీవర్, అంటువ్యాధులు (ఇన్ఫెక్షియస్ ఎండోకార్డిటిస్), కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ వంటివి ఈ సమస్యకు దారితీసే ప్రధాన కారణాలు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Health care, Health Tips, Heart, Heart Attack, Life Style

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు