Home /News /life-style /

WHAT IS HEART ATTACK AND WHAT ARE THE SYMPTOMS OF HEART ATTACK GH BA

Heart Attack Symptoms: అసలు హార్ట్ ఎటాక్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఏంటి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

What is Heart Attack | గుండె కండరాలలోని కొన్ని భాగాలకు తగినంత రక్తం లభించనప్పుడు గుండెపోటు వస్తుంది. దీనికి సకాలంలో చికిత్స చేసి గుండెకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించాలి. ఆలస్యం అవుతున్నా కొద్దీ గుండె కండరాలకు ఎక్కువ నష్టం జరుగుతుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Visakhapatnam | Bangalore [Bangalore] | Chennai [Madras]
గుండెపోటును (Heart attack) వైద్య పరిభాషలో మయోకార్డియల్ ఇన్ఫార్‌క్షన్ (Myocardial Infarction- MI) అంటారు. ఇది ఒక సాధారణమైన నాన్-కమ్యూనికేబుల్, దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు. సమస్య క్రమంగా పెరుగుతూ గుండెకు రక్త సరఫరాను ప్రభావితం చేస్తుంది. మయోకార్డియల్ ఇన్ఫార్‌క్షన్‌ అనేది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో ఒకటి పూర్తిగా పూడుకుపోవడం వల్ల ఎదురయ్యే తీవ్రమైన మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితి. దీనివల్ల గుండెకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి, ఛాతీ నొప్పి రావడంతో పాటు మయోకార్డియల్ కణజాలం చనిపోతుంది. 

సింపుల్‌గా చెప్పాలంటే.. గుండె కండరాలలోని కొన్ని భాగాలకు తగినంత రక్తం లభించనప్పుడు గుండెపోటు వస్తుంది. దీనికి సకాలంలో చికిత్స చేసి గుండెకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించాలి. ఆలస్యం అవుతున్నా కొద్దీ గుండె కండరాలకు ఎక్కువ నష్టం జరుగుతుంది. గుండెపోటుకు ప్రధాన కారణం కొరోనరీ ఆర్టరీ వ్యాధి (CAD). గుండె కండరాలకు ఆక్సిజన్ ఉండే రక్తం వెళ్లే మార్గం ఒక్కసారిగా సంకోచించడం వల్ల గుండెపోటు రావచ్చు.

What is Diabetes: డయాబెటిస్ అంటే ఏంటి? ఎన్ని రకాలు? లక్షణాలు ఏంటి? అసలు ఎందుకొస్తుంది?



గుండెపోటు లక్షణాలు ఏవి?

గుండెపోటుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. వీటి ద్వారా హార్ట్ అటాక్ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించవచ్చు. ప్రధాన లక్షణాలు ఏవంటే..

ఛాతీ నొప్పి, అసౌకర్యం, శ్వాస సమస్యలు 

గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే ఏ కారణంతో హార్ట్ అటాక్ వచ్చినా, దీని ప్రాథమిక లక్షణం ఛాతీ నొప్పి. గుండెపోటు వచ్చేముందు ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు అసౌకర్యంగా ఉంటుంది. ఇదే సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు ఛాతీలో నొప్పి, అసౌకర్యం ఉంటుంది లేదా కాసేపు తగ్గి మళ్లీ పెరుగుతుంది. ఒత్తిడి, కండరాలు పిండేసినట్లు అనిపించడం, తెలియని నొప్పి వంటి అనుభూతిని కలిగిస్తుంది.

What is Blood Pressure: అందరూ బీపీ, బీపీ అంటారు.. అసలు బ్లడ్ ప్రెజర్ అంటే ఏంటి? ఎలా కొలుస్తారు?



వికారం, అజీర్తి, గుండెల్లో మంట, లేదా కడుపు నొప్పి

కొందరిలో గుండెపోటు సమయంలో ఈ లక్షణాలు ఉంటాయి. బాధితులు వాంతులు కూడా చేసుకోవచ్చు. పురుషుల కంటే స్త్రీలలో ఈ రకమైన లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. కొన్నిసార్లు తినే ఆహారం వల్ల కూడా కడుపునొప్పి రావచ్చు. అయితే దీనితో పాటు ఇతర లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. సాధ్యమైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలి. 

ఎడమ చెయ్యి, భుజం నొప్పి

గుండెపోటుకు మరో ప్రాథమిక లక్షణం శరీరంలోని ఎడమ వైపు భాగాల్లో నొప్పి రావడం. సాధారణంగా ఈ నొప్పి ఛాతీ నుంచి మొదలవుతుంది. క్రమంగా ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఎడమ చెయ్యి లేదా ఎడమ వైపు భుజం కండరాల్లో నొప్పి ఉన్నట్లు అనిపించడం గుండెపోటు లక్షణం కావచ్చు. 

Pregnancy early symptoms: గర్భధారణను సూచించే 6 ప్రారంభ లక్షణాలు ఇవే...!



తలతిరుగుతున్నట్లు లేదా తేలికగా ఉన్నట్లు అనిపించడం

గుండెపోటు వచ్చేముందు తల తేలికగా ఉన్నట్లు లేదా తల తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. తర్వాత కొన్ని క్షణాలు మూర్చపోవచ్చు. స్థిరంగా, బ్యాలెన్స్‌డ్‌గా ఉండలేకపోవడంతో పాటు ఛాతీలో అసౌకర్యం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గుండె పనితీరుపై ప్రభావం పడినప్పుడు ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

గొంతు లేదా దవడ నొప్పి

సాధారణంగా గొంతు లేదా దవడ నొప్పికి గుండె సమస్యలకు సంబంధం ఉండదు. కానీ మీ ఛాతీ మధ్యలో నొప్పి లేదా తెలియని ఒత్తిడి ఏర్పడి, అది మీ గొంతు లేదా దవడ వరకు వ్యాపిస్తే.. అది గుండెపోటుకు సంకేతం కావచ్చు. ఇలాంటప్పుడు సాధ్యమైనంత తర్వగా వైద్య సహాయం తీసుకోవాలి. 

World Lung Cancer Day: క్యాన్సర్ మరణాలకు ఇదే మెయిన్ రీజన్.. ఇదొక్కటి పాటిస్తే మీకు పునర్జన్మే..!



ఎక్కువగా అలసిపోవడం

రోజూ చేసే చిన్నపాటి పనులకే విపరీతంగా అలసిపోయినట్లు అనిపిస్తే.. అప్రమత్తం కావాల్సిందే. విపరీతమైన అలసట లేదా వివరించలేని బలహీనత అనేవి మహిళల్లో గుండె జబ్బులకు లక్షణం కావచ్చు. ఈ అనుభూతి కొన్నిసార్లు కొన్ని రోజుల పాటు కొనసాగవచ్చు.

చల్లని చెమటలు పట్టడం

స్పష్టమైన కారణం లేకుండా అకస్మాత్తుగా చల్లని చెమట పట్టడం అనేది గుండెపోటు లక్షణం కావచ్చు. ఇతర హార్ట్ అటాక్ లక్షణాలతో పాటు ఇలా చెమట కూడా పడుతుంతే.. వెంటనే వీరిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. 

విపరీతమైన దగ్గు

మామూలు పరిస్థితుల్లో దగ్గు గుండె జబ్బులకు లక్షణం కాదు. కానీ ఇప్పటికే గుండె జబ్బులు ఉన్న వారిలో దగ్గు వస్తూ, తెల్లని లేదా గులాబీ రంగులో ఉండే శ్లేష్మం కూడా వస్తుంటే అనుమానించాల్సిందే. ఇది గుండె వైఫల్యానికి సంకేతం కావచ్చు. గుండె పనితీరు దెబ్బతిని, ఊపిరితిత్తులలోకి రక్తం లీక్ అయినప్పుడు ఇలా జరగవచ్చు. అందుకే ఈ లక్షణం ఉన్నవారు వెంటనే వైద్యుల సలహాతో టెస్టులు చేయించుకోవాలి. 

Children junk food: పిల్లలు జంక్ ఫుడ్ తినకుండా ఎలా ఆపాలి!



కాళ్లు, పాదాలు ఉబ్బడం 

కాళ్లు, పాదాలతో పాటు చీలమండం ప్రాతం ఉబ్బినట్లు అనిపిస్తే.. మీ గుండె రక్తాన్ని సక్రమంగా పంప్ చేయట్లేదని అర్థం. ఇది గుండె వైఫల్యంతో పాటు హార్ట్ అటాక్‌కు కారణం కావచ్చు. గుండె తగినంత వేగంగా రక్తాన్ని శరీర భాగాలకు పంప్ చేయలేనప్పుడు, రక్తం సిరల్లోకి తిరిగి వచ్చి, అవి ఉబ్బుతాయి. గుండె పనితీరు దెబ్బతినడం వల్ల మూత్రపిండాలు శరీరం నుంచి అదనపు నీరు, సోడియంను తొలగించలేవు.  

గుండె కొట్టుకునే వేగంలో మార్పులు

ఎక్కువ భయాందోళనలకు గురైనప్పుడు లేదా ఉత్సాహంగా ఉన్నప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరగడం సాధారణ విషయం. కానీ ఏ కారణం లేకుండా మీ గుండె కేవలం కొన్ని సెకన్ల పాటు ఎక్కువ వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపించడం లేదా తరచుగా ఇలా జరగడం గుండెపోటు లక్షణం.  

Monkeypox : మంకీపాక్స్ లక్షణాలను హోమియోపతితో నయం చేయోచ్చు!



ఎవరిలోనైనా గుండెపోటు లక్షణాలు కనిపిస్తే, వెంటనే ఆంబులెన్స్‌కు కాల్ చేయండి. దగ్గర్లో హాస్పిటల్ ఉంటే వెంటనే ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ అందించండి. బాధితులకు ట్రీట్‌మెంట్ ఎంత వేగంగా అందిస్తే అంత మంచిది. దీనివల్ల గుండె కండరాలకు నష్టం వాటిల్లే ముప్పును తగ్గించవచ్చు. కొన్ని సందర్భాల్లో, గుండెపోటు వచ్చిన వారి గుండె మళ్లీ రక్తాన్ని పంపింగ్ చేయడానికి కార్డియో పల్మనరీ రెసస్కిటేషన్ (CPR) లేదా గుండెకు విద్యుత్ షాక్ (Defibrillation) అవసరమవుతుంది. హాస్పిటల్‌కు వెళ్లేంత వరకు ఆంబులెన్స్ సిబ్బంది CPR లేదా డీఫిబ్రిలేటర్‌ చేయగలరు. బాధితులకు ఎంత త్వరగా అత్యవసర చికిత్స ప్రారంభిస్తే, గుండెపోటు నుంచి బయటపడే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. అందువల్ల లక్షణాలను తేలిగ్గా తీసుకోకుండా ముందుగానే జాగ్రత్తపడి, టెస్టులు చేయించుకోవడం మంచిది.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Health Tips, Heart Attack

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు