Home /News /life-style /

WHAT IS GOOD CHOLESTEROL FOODS WITH GOOD CHOLESTEROL AND HOW TO RAISE GOOD CHOLESTEROL NATURALLY BA GH

Good Cholesterol Foods: గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? లెవల్ ఎంత ఉండాలి? మంచి కొలెస్ట్రాల్ లభించే ఫుడ్స్ లిస్ట్ ఇదే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతి వ్యక్తి కొలెస్ట్రాల్ రక్త పరీక్ష చేయించుకోవాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది. గుండె సమస్యలు లేదా అధిక బరువు, ఊబకాయం వచ్చే ప్రమాదం ఉన్నవారు అయితే.. వైద్యుల సహాయంతో తరచుగా కొలెస్ట్రాల్‌ టెస్ట్ చేయించుకోవాలి. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను మిల్లీగ్రాములు/డెసిలిటర్ (mg/dL)లో కొలుస్తారు.  

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Visakhapatnam | Guntur
కొలెస్ట్రాల్ అనే ఆలోచన మన మెదడులోకి రాగానే, ప్రతి ఒక్కరూ ఇది శరీరానికి హాని చేస్తుందని భావిస్తారు. అయితే శరీర జీవక్రియలకు కొలెస్ట్రాల్ అవసరమవుతుంది. ఇలా శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్‌ను గుడ్ కొలెస్ట్రాల్ లేదా హై డెన్సిటీ లిపోప్రొటీన్ (HDL) అంటారు. తక్కువ సాంద్రత ఉండే లో-డెన్సిటీ లిపోప్రొటీన్ (LDL) మాత్రం.. శరీరంలో ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. హెచ్‌డీఎల్ అనేది శరీరంలోని కొలెస్ట్రాల్‌కు వాక్యూమ్ క్లీనర్ లాంటిది. ఇది రక్తంలో ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంటే.. ధమనులలో పేరుకునే అదనపు కొలెస్ట్రాల్, ఫలకాలను తొలగిస్తుంది. దాన్ని కాలేయానికి పంపుతుంది. కాలేయం ఈ అదనపు కొలెస్ట్రాల్‌ను శరీరం నుంచి బయటకు పంపుతుంది. అంతిమంగా ఇది గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

HDL ఎంత మొత్తంలో ఉండే శరీరానికి మంచిది? 

ప్రతి వ్యక్తి కొలెస్ట్రాల్ రక్త పరీక్ష చేయించుకోవాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది. గుండె సమస్యలు లేదా అధిక బరువు, ఊబకాయం వచ్చే ప్రమాదం ఉన్నవారు అయితే.. వైద్యుల సహాయంతో తరచుగా కొలెస్ట్రాల్‌ టెస్ట్ చేయించుకోవాలి. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను మిల్లీగ్రాములు/డెసిలిటర్ (mg/dL)లో కొలుస్తారు.  

Types of Heart Attacks: హార్ట్ ఎటాక్స్ ఎన్ని రకాలు? దేని లక్షణాలు ఏంటి? ఎలా గుర్తించాలి? రాకుండా ఏం చేయాలి



గుడ్ లెవల్ అంటే ఎంత ఉండాలి?

పురుషుల్లో HDL కొలెస్ట్రాల్ 40 mg/dL లేదా అంతకంటే ఎక్కువ.. మహిళల్లో 50 mg/dL లేదా అంతకంటే ఎక్కువ, పిల్లల్లో 45 mg/dL లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఈ లెవల్‌ను మంచి స్థాయిగా చెబుతారు.

హై లెవల్ అంటే ఎంత?

పురుషుల్లో HDL కొలెస్ట్రాల్  60 mg/dL లేదా అంతకంటే ఎక్కువ.. మహిళల్లో 60 mg/dL లేదా అంతకంటే ఎక్కువ.. పిల్లల్లో 200 mg/dL లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే దీన్ని హై లెవల్ అంటారు.



లో లెవల్ కొలెస్ట్రాల్ అంటే ఎంత?

పురుషుల్లో HDL కొలెస్ట్రాల్ 40 mg/dL కంటే తక్కువ, మహిళల్లో 50 mg/dL కంటే తక్కువగా ఉంటే.. దీన్ని లో- లెవల్ అంటారు.

మన శరీరంలోని కాలేయం ఈ గుడ్ కొలెస్ట్రాల్‌ను తయారు చేస్తుంది. దీంతోపాటు కొన్ని రకాల ఆహారాల నుంచి కూడా ఇది శరీరానికి అందుతుంది. సరైన ఆహార పదార్థాలు LDL స్థాయిలను తగ్గించగలవు. ఇది మీ HDL, LDL నిష్పత్తిని మెరుగుపరుస్తుంది. ఇలాంటి ఆహారాలు ఏవో చూద్దాం. 

Type 2 Diabetes Symptoms : టైప్ 2 డయాబెటిస్ లక్షణాలేంటి..? వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలి?



తృణధాన్యాలు (Whole grains)

తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి LDL కొలెస్ట్రాల్‌ను, శరీరంలోని మొత్తం కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించగలవు. తృణ ధాన్యాలకు HDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే శక్తి ఉంటుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ కరిగే (soluble) ఫైబర్ LDLను తగ్గిస్తుంది. రోజుకు కనీసం రెండు రకాల తృణధాన్యాలను ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.  

కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు

చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించి, గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. సాల్మన్, మాకేరెల్, ఆల్బాకోర్ ట్యూనా, సార్డినెస్, ట్రౌట్ వంటి చేపలను తరచుగా తీసుకుంటే శరీరానికి అవసరమయ్యే మంచికొవ్వు అందుతుంది.

Blood Pressure Range : పెద్దవాళ్లలో సాధారణ రక్తపోటు అంటే ఏంటి? వారిలో నార్మల్ బీపీ స్థాయిలు ఎలా ఉంటాయి?



 అవిసెలు

అవిసె గింజలతో పాటు వీటి నుంచి తీసిన నూనెలో కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్‌కు వనరులు. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే లక్షణం వీటికి ఉంటుంది. అవిసెలను శరీరం సులభంగా జీర్ణం చేసుకొని.. శక్తిని, పోషకాలను గ్రహిస్తుంది. 

నట్స్ (Nuts)

బాదం పప్పు, పిస్తా, వేరుశెనగలు, ఇతర రకాల గింజలు అన్నీ గుండెకు మేలు చేసే ఆహారాలు. వీటి నుంచి గుడ్ కొలెస్ట్రాల్ శరీరానికి అందుతుంది. ఈ గింజల్లో ఫైబర్‌ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్లాంట్ స్టెరాల్స్ అనే పదార్థానికి ఇవి నిలయం. ప్లాంట్ స్టెరాల్స్ శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను అదుపులో ఉంచుతుంది. ఫలితంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ అవసరమైన మొత్తంలో శరీరానికి అందుతుంది. అయితే వీటి నుంచి క్యాలరీలు కూడా ఎక్కువగా లభిస్తాయి. అందుకే డైట్ విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. 

How long should nuts be soaked,nuts be soaked before eating, నట్స్ ని తినేముందు ఎంతసేపు నానబెట్టాలి,నట్స్ ని నానబెట్టడం,నట్స్,నట్స్ నానబెట్టడం, Nuts soaked before eating to get more benfits,Nuts,గింజలు
ప్రతీకాత్మక చిత్రం


చియా సీడ్స్

ప్లాంట్ బేస్డ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ఇతర ఆరోగ్యకరమైన పోషకాలకు చియా సీడ్స్ నిలయం. ఆహారంలో చియా సీడ్స్ జోడించడం వల్ల LDL స్థాయిలు, రక్తపోటు తగ్గుతుంది.   

అవొకాడో

అవొకాడోలో ఫోలేట్, మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి HDL స్థాయిలను బ్యాలెన్స్ చేస్తాయి. ఈ మంచి కొవ్వులు స్ట్రోక్, గుండెపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవొకాడోలో ఫైబర్‌ కూడా ఉంటుంది. ఇది సహజంగా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. ఈ పండును సలాడ్‌, సూప్‌, శాండ్‌విచ్‌.. ఇలా అన్నింట్లో కలిపి తీసుకోవచ్చు. 

సోయా

మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సోయాతో చేసిన పదార్థాలు ఒక మంచి మార్గం. సాధారణంగా మాంసాహారం వినియోగం తగ్గించినప్పుడు, LDL స్థాయిలు చాలా వరకు తగ్గుతాయి, ఇదే సమయంలో HDL స్థాయిలు పెరుగుతాయి.  

ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గితే, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అయితే యాపిల్స్, బెర్రీస్ ఇతర పండ్లలో ఎక్కువగా ఉండే ఫైబర్, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించగలదు. యాపిల్, అరటి పండు, పనన, అవొకాడో, బెర్సీస్‌ వంటి పండ్లను రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

ఆలివ్ నూనె (Olive oil)

ఆలివ్ నూనె గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇది శరీరంలో LDL కొలెస్ట్రాల్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. తక్కువ స్థాయిలో వంట చేసేటప్పుడు ఇతర నూనెలకు బదులుగా ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం మంచిది. మితమైన, మీడియం ఉష్ణోగ్రతల వద్ద చేసే వంటల్లోనే దీన్ని వాడాలి. ఎక్స్‌ట్రా వర్జిన్ ఆయిల్‌ను సలాడ్స్, సాస్‌ల తయారీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ నూనెను మితంగానే ఉపయోగించాలి.  

ప్రతీకాత్మక చిత్రం


బీన్స్, కాయ ధాన్యాలు 

బీన్స్ (Beans), పప్పు ధాన్యాలు (legumes).. కరిగే ఫైబర్‌కు (soluble fiber) మంచి వనరులు. బీన్స్, బఠానీలు, కిడ్నీ బీన్స్‌తో పాటు అన్ని రకాల కాయధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో వంటలు చేయడానికి సమయం లేకపోతే కొన్ని పదార్థాల్లో సైడ్ డిష్‌గా కూడా తీసుకోవచ్చు. 
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Cholesterol, Health Tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు