కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇలా చెయ్యండి.

Corona Virus : తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ లేదని చెబుతున్నా ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదే. కాబట్టి ఏం చెయ్యాలో తెలుసుకుందాం.

news18-telugu
Updated: March 2, 2020, 3:13 PM IST
కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇలా చెయ్యండి.
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Corona Virus : మన దేశంలో... కేరళలో ఏడుగురికి కరొనా వైరస్ సోకి ఉండొచ్చన్న అనుమానంతో... వారిపై పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే... హైదరాబాద్‌లో నలుగురికి ఈ వ్యాధి సోకి ఉండొచ్చన్న అనుమానంతో టెస్టులు చేస్తున్నారు. మన దేశంలో ప్రస్తుతానికి ఈ వ్యాధి ఎవరికీ సోకలేదని చెబుతున్నా.... ఇది వైరస్ కాబట్టి... గాలి ద్వారా ఒకరి నుంచీ మరొకరికి సోకుతుంది కాబట్టి... కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిదే. అవేంటో చకచకా తెలుసుకుందాం.

వ్యాధి లక్షణాలు : ఈ వ్యాధి సోకిన వారికి ముక్కు కారుతూనే ఉంటుంది. గొంతు మంటగా ఉంటుంది. తలనొప్పి, జ్వరం, దగ్గు ఉంటాయి. ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే... వెంటనే డాక్టర్‌ను కలవాలి.

వైరస్ ఎలా వ్యాపిస్తుంది : ప్రస్తుతం ఇది మనుషుల నుంచీ మనుషులకు వ్యాపిస్తోంది. వ్యాధి వచ్చిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా... పక్కన ఉన్నవారికి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే... రోగిని టచ్ చేసినా, షేక్ హ్యాండ్ తీసుకున్నా వచ్చే ప్రమాదం ఉంది. రోగి ముట్టుకున్న వస్తువుల్ని ముట్టుకున్నా... అక్కడ ఉండే వైరస్... బాడీపైకి వచ్చి... క్రమంగా అవి నోట్లోంచీ ఊపిరి తిత్తుల్లోకి వెళ్తాయి. అంతే వైరస్ వచ్చినట్లే. ఇవి ఎంత వేగంగా వస్తాయంటే... చేతులు శుభ్రం చేసుకునేలోపే వచ్చేస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ప్రస్తుతానికి ఈ వైరస్‌కి మందు (వ్యాక్సిన్) లేదు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవాలి. ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని మీ చేతులతో టచ్ చేయవద్దు. రోగులకు దగ్గరగా ఉండొద్దు. అలాగని వారిని అంటరాని వారిలా చూడకూడదు. అయినా ఆ ఛాన్స్ డాక్టర్లు మీకు ఇవ్వరు. ఈ వైరస్ ఎవరికైనా వచ్చినట్లు తెలిస్తే... డాక్టర్లు ఆ వ్యక్తిని ప్రత్యేక గదిలో ఉంచేస్తారు.

ఎవరికైనా దగ్గు, జ్వరం లాంటివి వస్తే... వాళ్లు జనంలో తిరగకుండా ఇంట్లోనే ఉంటూ... ఎక్కువ నీళ్లు తాగాలి. ఒకట్రెండు రోజుల్లో అవి తగ్గకపోతే... ఎవర్నీ టచ్ చెయ్యకుండా వెంటనే డాక్టర్‌ను కలవడం బెస్ట్ ఆప్షన్.
Published by: Krishna Kumar N
First published: March 2, 2020, 3:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading