Health Tips : ఆడవారిలో గుండెనొప్పికి కారణాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత కాలంలో గుండెసమస్యలు పెరిగిపోయాయి. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యలను ఎదుర్కోక తప్పట్లేదు. అందుకు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

  • Share this:
* మారుతున్న కాలంతో మహిళల లైప్‌స్టైల్ కూడా చేంజ్ అయింది. దీంతో దాదాపు ప్రతి మహిళ దాదాపు ఉద్యోగం చేయక తప్పట్లేదు. ఇలా ఇంటి పని, ఆఫీస్ పని పెరిగి ఆమెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇవన్నీ గుండెసమస్యలకు దారి తీస్తున్నాయి.
* ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదే వారికి షుగర్ ఉంటే.. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉత్పత్తి అయి రక్తనాళాలు గట్టి పడి కుచించుకుపోయి రక్తప్రసరణ తగ్గిపోతుంది. దీంతో.. గుండె నొప్పి రావడం జరుగుతుంది.
* అధికంగా బరువు పెరగడం కూడా గుండెసమస్యలు రావడానికి కారణం.. స్థూలకాయుల్లో కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాలు మూసుకుపోతాయి... దీంతో గుండెకి రక్తసరఫరా నిలిచి గుండెసమస్యలు వస్తాయి
* మెనోపాజ్ సమయంలో.. ఈస్ట్రోజన్ నిల్వలు తగ్గిపోతాయి. దీంతో.. రక్తప్రసరణలో అధికంగా మార్పులు వస్తాయి. గుండె మస్యలు వస్తాయి.
* విటమిన్ డి, విటమిన్ కె-2 లోపాలు కూడా గుండెనొప్పులు రావడానికి కారణం. కాబట్టి ఈ లోపాలను అధిగమించేందుకు ప్రయత్నించాలి
* హైపోథైరాయిడిజం వల్ల గుండె స్పందనలు తగ్గిపోవడమే కాకుండా జీవక్రియలన్నీ కుంటుపడతాయి. దీంతో గుండెపనితనం కూడా తగ్గిపోతుంది.
* కాబట్టి మహిళలూ ఇలాంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు.. వెంటనే తగిన చికిత్స తీసుకుని గుండెజబ్బులకు రాకుండా జాగ్రత్త పడాలి

ఈ వీడియో కూడా చూడండి..
Published by:Amala Ravula
First published: