Home /News /life-style /

WHAT IS A POLLUTION METER HOW DOES IT WORK AND WHICH ONE TO BUY KNOW MORE DETAILS HERE GH SK

Pollution Meter: మీ ఇంట్లో వాయు కాలుష్యం ఎంతుంది? వీటితో తెలుసుకోండి..జాగ్రత్తపడండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Pollution Meters: పొల్యూషన్​ మీటర్​తో మీ ఇంట్లోని వాయు కాలుష్యాన్ని అంచనా వేయవచ్చు. ఈ పరికరం మీ చుట్టుపక్కల గాలిలో ఉండే పార్టిక్యులేట్ మ్యాటర్ (PM), ఫార్మాల్డిహైడ్, టోటల్ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (TVOC) మొత్తాన్ని ట్రాక్ చేస్తుంది. ఈ గాడ్జెట్ ఘన, ద్రవ, వాయు రూపంలో గాలి కలుషితాలను లెక్కించగలదు.

ఇంకా చదవండి ...
ప్రస్తుతం దేశంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో వాయు కాలుష్యం (Air Pollution) ఒకటి. కోర్టులు, ప్రభుత్వాలు, సంఘాలు, రాజకీయ నాయకులు వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మాస్క్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్‌(Air Purifier)ను ఉపయోగించడం ద్వారా కొంతవరకు మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చని, కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ సేపు ఉండకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఎయిర్ ప్యూరిఫైయర్ సెట్టింగ్‌ను మార్చడానికి ఇంట్లో పొల్యూషన్​ లెవల్ (Pollution Level)​ ఎంత ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. పొల్యూషన్​ మీటర్​తో మీ ఇంట్లోని వాయు కాలుష్యాన్ని అంచనా వేయవచ్చు. ఈ పరికరం మీ చుట్టుపక్కల గాలిలో ఉండే పార్టిక్యులేట్ మ్యాటర్ (PM), ఫార్మాల్డిహైడ్, టోటల్ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (TVOC) మొత్తాన్ని ట్రాక్ చేస్తుంది. ఈ గాడ్జెట్ ఘన, ద్రవ, వాయు రూపంలో గాలి కలుషితాలను లెక్కించగలదు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని వాయు కాలుష్య మీటర్లను పరిశీలిద్దాం.

స్మైల్‌డ్రైవ్ పోర్టబుల్ ఎయిర్ క్వాలిటీ పొల్యూషన్ మీటర్

స్మైల్‌డ్రైవ్ పోర్టబుల్ ఎయిర్ క్వాలిటీ పొల్యూషన్ మీటర్ సహాయంతో లేజర్​ స్కాటరింగ్ డిటెక్షన్ ద్వారా మీ చుట్టూ ఉన్న గాలిలో PM1, PM2.5, PM10 HCHO, TVOC లెవల్స్​ను గుర్తించవచ్చు. ఈ పొల్యూషన్​ మీటర్​ 1200mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 32- బిట్ త్రీ-కోర్ ARM ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇది ఖచ్చితమైన రీడింగ్​ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

Iron Deficiency: ఈ ఫుడ్‌తో ఎప్పటికీ ఐరన్‌ డెఫిషీయన్సీ సమస్య ఉండదు!

టెమ్‌టాప్ LKC-1000E ఎయిర్ క్వాలిటీ మానిటర్

టెమ్​టాప్​ LKC-1000E ఎయిర్ క్వాలిటీ మానిటర్ సహాయంతో PM2.5, PM10, పార్టికల్, HCHO, AQI లెవల్స్​ను కొలవొచ్చు. ఈ పొల్యూషన్​ మీటర్​ TFT స్క్రీన్‌తో వస్తుంది. బ్యాటరీ ఇండికేటర్​ లైట్‌తో మీ బ్యాటరీ లెవల్​ను ఎప్పుడైనా చెక్​ చేసుకోవచ్చు.

హోనెలైఫ్ ఎయిర్ క్వాలిటీ మానిటర్ ఫార్మాల్డిహైడ్ డిటెక్టర్ పొల్యూషన్ మీటర్

హోనెలైఫ్ పొల్యూషన్ మీటర్ 12-బిట్ AD స్మార్ట్ చిప్‌తో వస్తుంది. ఇది రెండు బటన్లు, పెద్ద ఎల్​సీడీ స్క్రీన్‌ గల ఆపరేషన్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఈ పరికరాన్ని నిరంతర పొల్యూషన్​ మానిటరింగ్​ కోసం ఉపయోగించవచ్చు.

నెగార్ ఎయిర్ క్వాలిటీ మానిటర్ ఫార్మాల్డిహైడ్ డిటెక్టర్ పొల్యూషన్ మీటర్

నెగార్ ఎయిర్​ పొల్యూషన్​ మీటర్ ద్వారా సెన్సార్ ఫార్మాల్డిహైడ్ /TOVC గాఢతను గుర్తించవచ్చు. ఎయిర్​ పొల్యూషన్​ లెవల్​తో పాటు పొల్యూషన్​ కారకాలను కూడా గుర్తిస్తుంది. ఈ పరికరం ఉష్ణోగ్రత, మీ ఇంట్లో హానికరమైన వాయువును కూడా గుర్తించగలదు. పెద్ద ఎల్​సీడీ డిస్ప్లేతో వస్తుంది.

Lizards: బల్లులతో ప్రమాదం.. వాటిని ఇంట్లో నుంచి తరిమేయండి ఇలా..

డెక్​డీల్ ఎయిర్ క్వాలిటీ మానిటర్ ఫార్మాల్డిహైడ్ డిటెక్టర్ పొల్యూషన్ మీటర్

డెక్​డీల్​ ఎయిర్ క్వాలిటీ మానిటర్ ఫార్మాల్డిహైడ్ డిటెక్టర్ పొల్యూషన్ మీటర్ 12- బిట్ ఏడీ స్మార్ట్ చిప్‌తో వస్తుంది. ఈ పరికరాన్ని నిరంతర వాయు కాలుష్య పర్యవేక్షణ కోసం ఎక్కడైనా ఉంచవచ్చు. ఇది కేవలం రెండు బటన్లు, పెద్ద LCD స్క్రీన్‌తో వస్తుంది.

ఇంక్​బర్డ్​ ప్లస్​ ఎయిర్ క్వాలిటీ CO2 మానిటర్

ఇంక్బర్డ్ ప్లస్ ఎయిర్ క్వాలిటీ CO2 మానిటర్ కార్బన్ డయాక్సైడ్(CO2), వోలేటైల్ ఆర్గానిక్ కాంపౌండ్(TVOC), ఫార్మాల్డిహైడ్(HCHO), ఉష్ణోగ్రత, తేమ స్థాయిని గుర్తించగలదు. దీనిలోని డిస్‌ప్లేపై ఎప్పటికప్పుడు ఫలితాలను చూసుకోవచ్చు. ఇది 1200mAh లిథియం బ్యాటరీతో వస్తుంది. దీన్ని ఫుల్​ ఛార్జ్ చేయడానికి 2.5 గంటలు పడుతుంది.

Aoccy ఎయిర్ క్వాలిటీ మానిటర్ ఫార్మాల్డిహైడ్ డిటెక్టర్ పొల్యూషన్ మీటర్

Aoccy ఎయిర్ క్వాలిటీ మానిటర్ ఫార్మాల్డిహైడ్ డిటెక్టర్ పొల్యూషన్ మీటర్.. ఫార్మాల్డిహైడ్ /TOVC గాఢతను గుర్తిస్తుంది. ఇది పెద్ద ఎల్​సీడీ డిస్ప్లేతో వస్తుంది. ఈ పరికరం ఉష్ణోగ్రతను కూడా పర్యవేక్షించగలదు. ఇది మీ ఇంట్లో హానికరమైన వాయువును కూడా గుర్తించగలదు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Air Pollution, Pollution

తదుపరి వార్తలు