Diabetes : ఆహారంలో షుగర్ తగ్గిస్తే ఏమవుతుంది? షుగర్ తగ్గించేందుకు ఉన్న 5 మార్గాలు

ఈ రోజుల్లో ఎవరైనా కాస్త నలతగా ఉండి డాక్టర్ దగ్గరకు వెళ్తే... షుగర్ తగ్గించండి అంటున్నారు డాక్టర్లు. షుగర్‌ని విషంతో ఎందుకు పోల్చుతున్నారు?

news18-telugu
Updated: August 2, 2020, 7:02 PM IST
Diabetes : ఆహారంలో షుగర్ తగ్గిస్తే ఏమవుతుంది? షుగర్ తగ్గించేందుకు ఉన్న 5 మార్గాలు
Health : ఆహారంలో షుగర్ తగ్గిస్తే ఏమవుతుంది? షుగర్ తగ్గించేందుకు ఉన్న 5 మార్గాలు
  • Share this:
ఈ ప్రపంచంలో అదృష్టవంతులంటే డయాబెటిస్ లేనివారు అంటారు చాలా మంది. ఎందుకంటే... ఒక్కసారి అది వస్తే... జీవితాంతం ఉంటుంది. ప్రతి రోజూ ఏం తినాలన్నా జాగ్రత్త పడాల్సిందే. అలాగని డయాబెటిస్ ఉన్నంత మాత్రాన... భయపడాల్సిన పనిలేదు. దాన్ని కూడా కంట్రోల్ చేసేందుకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. అది అలా ఉంచితే... మన బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగినా, తగ్గినా ప్రమాదమే. కానీ... ఈ రోజుల్లో మనం తినే ఆహారం సరైనది కాకపోవడం వల్ల చాలా మందికి షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి. టీలు, కాఫీలు, స్వీట్లు, చాకొలెట్లు, ఐస్‌క్రీమ్‌లు, బిస్కెట్లు, కేకులు ఇలా తినే ఆహారంలో చాలా వరకూ షుగర్ మయం అవుతోంది. పండ్ల నుంచి వచ్చేది మంచి షుగర్. ఫ్యాక్టరీలో తయారై వచ్చేది ప్రమాదకరమైన షుగర్. అది బరువు పెంచుతుంది. బానపొట్ట వచ్చేలా చేస్తుంది. ఇలా ఎన్నో సమస్యలు.

ఆహారంలో షుగర్ తగ్గిస్తే :

ఎన్నో లాభాలుంటాయి. తలనొప్పి తగ్గుతుంది. బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. చిరాకులు, చికాకులూ తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. బరువు పెరగడం ఆగుతుంది. ఇలా చాలా ప్రయోజనాలు ఉంటాయి.

షుగర్ తగ్గించడం ఎలా:
- మనం తీసుకునే ఆహారంలో.. పిండి పదార్థం (స్టార్చ్)... బాడీలోకి వెళ్లి గ్లూకోజ్‌గా మారుతుంది. అదే షుగర్ అంటే. అందువల్ల మనం ఎంత ఆకలి వేస్తే అంతే తినాలి. అలాగే... తిన్న ఆహారం బాడీలో స్టాక్ అవ్వకుండా కష్టపడిపోవాలి. అంటే క్యాలరీలు కరిగించేసుకోవాలి.
- డైట్ ప్లాన్ వేసుకోండి. ఉదయం వేళ ఎక్కువ తినండి. చాలా పనులు చేసుకుంటారు కాబట్టి... ఆటోమేటిక్‌గా అంతా అరిగిపోయి... ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా చురుగ్గా ఉంటారు. మధ్యాహ్నం కాస్త తక్కువ తినండి. రాత్రికి ఇంకా తక్కువ తినండి. రాత్రి వేళ 8 గంటల లోపే తినేయడం మేలు. ఎందుకంటే లేటుగా తింటే... ఆ ఆహారం పొట్టలో తెల్లారే వరకూ అలాగే ఉంటుంది. అది ప్రమాదకరం. అంతే కాదు... రాత్రివేళ ఈజీగా అరిగేవి తినాలి. ఆయిల్ ఫుడ్ రాత్రివేళ తినకపోవడం మేలు.

- పండ్లు, ఆకుకూరలు, కూరగాయల్ని బాగా తినండి. ఇవి బరువును తగ్గిస్తాయి. షుగర్ లెవెల్స్‌ని క్రమబద్ధీకరించి... డయాబెటిస్ రాకుండా చేస్తాయి. ఆల్రెడీ ఉన్నవారికీ మేలు చేస్తాయి.- నీరు బాగా తాగండి. అంటే దాహం లేకపోయినా తాగమని కాదు. దాహం ఉంటే వాయిదా వేయకుండా తాగండి అని. మీరు పనిలో బిజీగా ఉంటే... పక్కనే ఓ రాగి (కాపర్) బాటిల్‌లో నీరు రెడీగా ఉంచుకోండి... పని చేస్తూనే ఓ గుక్కెడు అలా తాగేయండి. నీరు ఎన్నో రోగాలకు చెక్ పెట్టగలదు మరి. ఉదయాన్నే ఓ లీటర్... రోజంతా కలిపి 3 లీటర్లైనా తాగాలంటున్నారు.

- డాన్స్ చెయ్యండి. మీరు ఎక్కువ సేపు కూర్చునే పరిస్థితి ఉంటే... మీ బాడీలో చాలా చోట్ల కొవ్వు పేరుకుపోయి... శరీర నిర్మాణం దెబ్బతింటుంది. అలా జరగకుండా... అలసిపోండి. చెమట పట్టనివ్వండి. బాగా కదలండి. బాడీలో షేప్స్ అన్ని కదిలిపోయేలా డాన్స్ చెయ్యండి. కచ్చితంగా బెస్ట్ హెల్తీ పర్సన్ అయిపోతారు.
- మన నోటికి నచ్చేవి శరీరానికి కీడు చేసే ప్రమాదం ఉంటుంది. ఈ ఫ్రైలూ, బర్గర్లు, పిజ్జాల వంటివి పూర్తిగా వంటివి మానేయండి. వాటి కంటే మన బజ్జీలు, పకోడీలూ చాలా మేలు చేస్తాయి. అలాంటివి తినండి. గింజలు, బద్దలు, పప్పులు, వెన్న, నెయ్యి, డ్రైఫ్రూట్స్ వంటివి తినండి.

- టీ, కాఫీల ప్లేస్‌లో గ్రీన్ టీ తాగండి. గోరు వెచ్చటి నీటిలో ఓ టీస్పూన్ నిమ్మరసం, రెండు స్పూన్ల తేనె, ఒకట్రెండు పుదీనా ఆకులు వేసుకొని లెమన్ టీ తాగండి. మద్యం అలవాటు ఉంటే... స్కాచ్, వోడ్కా బదులు.. కొద్ది మొత్తంలో రెడ్ వైన్ (అదీ ఆరోగ్యానికి హానికరమే) తీసుకోమంటున్నారు స్పెషలిస్టులు.Diabetes : ఆహారంలో షుగర్ తగ్గిస్తే ఏమవుతుంది? షుగర్ తగ్గించేందుకు ఉన్న 5 మార్గాలు
Published by: Krishna Kumar N
First published: August 2, 2020, 6:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading