సరైన నిద్ర లేకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? కళ్లు, మెదడు మాత్రమే కాదు..

యువత రాత్రి సమయంలో మొబైల్స్‌ వాడుతూ ఉంటారు. ఇప్పటికి ఇది సరదాగానే ఉండవచ్చు కానీ, రానురాను దీని ప్రభావం ఆరోగ్యంపై కచ్ఛితంగా పడుతుంది.

యువత రాత్రి సమయంలో మొబైల్స్‌ వాడుతూ ఉంటారు. ఇప్పటికి ఇది సరదాగానే ఉండవచ్చు కానీ, రానురాను దీని ప్రభావం ఆరోగ్యంపై కచ్ఛితంగా పడుతుంది.

  • Share this:
నిద్ర వల్ల కొంతమంది టైం వేస్ట్‌ అవుతుంది అనుకుంటారు. కానీ, సరైన నిద్రపోకపోతే ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా? రోజు ఒక యాపిల్‌ డాక్టర్‌ నుంచి దూరం ఉండవచ్చు అంటారు. అలాగే సరైన నిద్ర కూడా వైద్యుల నుంచి దూరంగా ఉండేలా చేస్తుంది. ఒక కళ్లకో లేదా మెదడు మాత్రమే కాదు మిగతా శరీర అవయవాలపై దీని ప్రభావం పడుతుంది.

ఒకవ్యక్తి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడటం కోసం 48 గంటలపాటు నిద్రపోలేదు. అతడు గుండెపోటుతో మరణించాడు. నిద్ర లేకపోవడం వల్ల ముఖ్యంగా పాడయ్యేది బ్రెయిన్‌. మెల్లిగా అల్జీమర్స్‌కు దారితీస్తుంది. దీంతో మనుషుల పేర్లు, ముఖాలు మర్చిపోతారు. తరువాత ఎక్కువగా ఎఫెక్ట్‌ అయ్యేది హార్ట్‌. మనం నిద్ర పోతున్న సమయంలోనే గుండెకు రెస్ట్‌. బ్లడ్‌ ప్రెజర్‌ తగ్గుతుంది. కాబట్టి ఆరుగంటల కంటే తక్కువ సేపు నిద్రపోతే జీవితంలో ఎదో ఒక సమయంలో గుండెపోటు వచ్చే ప్రమాదం 4.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

గ్రోత్‌ హార్మొన్లు కూడా నిద్రపోయేటపుడే విడదలవుతాయి. ఒకరోజు మనం నిద్రపోకపోతే మన ముఖం ఎలా మారిపోతుందో తెలుసుకదా! మన బ్రెయిన్‌లోని స్ట్రెస్‌ హార్మొన్స్‌ ఎక్కువగా విడదలవ్వడమే దీనికి ప్రధాన కారణం. దీనివల్ల చర్మం సాగిపోతుంది. నిద్రపోతే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఎక్కువ సేపు నిద్రపోయేవారు 10 ఏళ్లు తక్కువగా కనిపిస్తారు. దీన్నే బ్యూటీ స్లీప్‌ అంటారు. అంతేకాదు నిద్రలేకపోవడం వల్ల మానసికంగా, శారీరకంగా వీక్‌గా కనిపిస్తారు.

ఉత్సాహాంగా ఉండరు. ముఖ్యంగా నైట్‌షిఫ్ట్‌ల్లో పనిచేసేవారికి ఈ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. భవిష్యత్తులో వారికి కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డయాబెటీస్, ఒబేసిటీ, గుండె సంబంధిత వ్యాధులు రావచ్చు. అందుకే నైట్‌షిఫ్ట్‌లు చేసేవారు సరైన ఆహారం తీసుకోవడం మంచిది. నిద్రపోయి 24 గంటలు దాటితే మన మెదడు తెలియకుండానే మైక్రోస్లీప్స్‌ తీసుకుంటుంది. ఇది ఒక సెకను నుంచి హాఫ్‌ మినట్‌ వరకు ఉంటుంది. దీనివల్ల చాలా యాక్సిడెంట్లు కూడా అయ్యాయి. అమెరికాలో ప్రతి ఏడాది నిద్ర లేకపోవడందో జరిగిన కార్‌ యాక్సిడెంట్లు 2 లక్షలకుపైగా..

విద్యార్థులు కూడా రాత్రంతా చదువుతారు. ఇది వారికి నష్టమే. బ్రెయిన్‌లో ఉండే ప్రీఫ్రంటల్‌ నరాలు వీక్‌ అవుతాయి. దీంతో పరీక్ష సమయంలో ఏమి గుర్తు రాకపోవడంతోపాటు.. అలసట, చిరాగ్గా ఉంటుంది. త్వరగా పడుకోని తెల్లవారుజాము చదువుకుంటే సరిపోతుంది. స్లీప్‌ పెరాలసిస్‌ ఇది చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది.

నిద్రలో ఎవరో మనల్ని నొక్కి పట్టుకున్నట్లు ఉంటుంది. పైకి లేచే ప్రయత్నం చేస్తాం కానీ, లేవలేని పరిస్థితి ఉంటుంది. దీన్నే కొంతమంది దయ్యం పట్టింది అంటారు. ఈ సమయంలో మనం నిద్రపోతాం కానీ, మన బ్రెయిన్‌ మెలకువగా ఉంటుంది. సరైన నిద్ర లేకపోవడం, సమయానికి నిద్రపోకపోవడం వల ఇలా జరుగుతాయి. నిద్రలో లేచి నడవటం, మాట్లాడం కూడా నిద్రలేమి వల్లే జరుగుతాయి.
నేషనల్‌ స్లీప్‌ ఫౌండేషన్‌ ప్రకారం చిన్న పిల్లలకు 9–11 గంటల నిద్ర, టీనెజర్లకు 8–10 గంటలు, పెద్దవాళ్లకు 7–9 గంటలు, ముసలివయస్సు వారికి 7–8 గంటల నిద్ర అవసరమని తేల్చింది.
Published by:Renuka Godugu
First published: