హోమ్ /వార్తలు /life-style /

Sleep tips: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

Sleep tips: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర (sleep) కూడా కరువు అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. చాలామందికి బ్రహ్మ (brahma) ముహూర్తంలో నిద్ర లేస్తే బాగుంటుందట.

ఇంకా చదవండి ...

  ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది సగటు మానవుడిది. కరోనా(corona) నేపథ్యంలో జీవితాలు తలకిందులయ్యాయి. ఉద్యోగాలు ఊడిపోయాయి. వారికి ప్రశాంతత(peace) కరువైంది. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టని వారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి.  చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర (sleep) కూడా కరువు అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. అయితే హాయిగా నిద్ర పోవాలంటే కొన్ని పద్దతులు రోజూ పాటిస్తే నిద్ర దానంతట అదే వస్తుందట.

  ప్రతి ఒక్కరు చెప్పే విషయం ఏమిటంటే, ఉదయాన్నే (Morning) లేచేటప్పుడు సూర్యోదయం కంటే.. ముందుగానే లేవాలి అని , అప్పుడే మన పనులు త్వరగా ముగించుకోవడానికి వీలు ఉంటుందని చాలామంది చెబుతుంటారు. సూర్యోదయం (before sunrise) కంటే ముందుగా నిద్రలేవడం వల్ల అదృష్టం వరిస్తుందని, అష్ట ఐశ్వర్యాలు చెంతకు  వస్తాయని పెద్ద వాళ్ళ నమ్మకం. చాలామందికి బ్రహ్మ  ముహూర్తం (Brahma Muhurat)లో నిద్ర లేస్తే బాగుంటుందట.

  ఏంటీ బ్రహ్మ ముహూర్తం..?

  ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. ప్రతి ఒక్కరు బ్రహ్మ ముహూర్తం ( Brahma Muhurat)లో నిద్ర లేవాలని (wakeup) సూచిస్తున్నారు. అంటే తెల్లవారు జామున 3 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల లోపు నిద్ర లేవాలి. ఇలా బ్రహ్మ ముహూర్తంలో  నిద్రలేవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ (positive energy) మనకు వరిస్తుందట. తద్వారా మన ఆలోచనలు కూడా పాజిటివ్ రావడం, సమాజంలో అందరితోనూ ఆనందోత్సహాలతో జీవించడానికి వీలు ఉంటుందట. శరీరానికి కావలసిన శక్తి (energy) లభించడమే కాకుండా ఆరోగ్యంగా (healthy) కూడా ఉంటారు అట.

  ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

  పెద్దలు చెబుతూనే ఉంటారు..

  చాలా మంది బారెడు పొద్దేక్కే వరకూ నిద్ర (sleep) పోతూనే వుంటారు. పని కారణంగానో లేక టీవీలు చూస్తూనో, సెల్ ఫోన్ చూస్తూనో కాలక్షేపం గడుపుతూ, రాత్రి పొద్దుపోయే వరకు మేలుకోవడం, ఉదయం ఎక్కువ సేపు నిద్రపోవడం లాంటివి ఇలా చేయడం వల్ల, ఆయుష్షు కూడా తక్కువ చేసుకుంటున్నారని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక పూర్వం మన పెద్దవాళ్లు ఉదయం నాలుగున్నర నుంచి 5 గంటల లోపే నిద్రలేవడం, చన్నీటి స్నానం చేయడం అలాగే సూర్య నమస్కారాలు చేయడం వంటివి చేశారు. వారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించారు. మీకు వీలైనంత వరకు బ్రహ్మ ముహూర్తం లోనే నిద్ర లేవడానికి ట్రై చెయ్యండి.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

  ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

  ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి

  చంకల్లో దురద ఎందుకు వస్తుందో తెలుసా? మరి ఆ దురద తగ్గాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలంటే

  First published: