హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health tips: అన్నం ఉడకక ముందే తింటే ఏమవుతుంది? భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం ఉంటుంది?

Health tips: అన్నం ఉడకక ముందే తింటే ఏమవుతుంది? భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం ఉంటుంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బియ్యంలో ఆర్సెనిక్ స్థాయి ఎక్కువగా ఉంటుందట. మనుషుల్లో క్యాన్సర్​ రావడానికి ఆర్సెనిక్ (arsenic) కారణం కావచ్చు.  అంతేగాక ఇది మన శరీరానికి కూడా అంత మంచిదికాదంటున్నారు. అన్నం ఉడకక ముందే దింపేసి తింటే ప్రమాదమంట. అలా చేస్తుండటం వల్ల భవిష్యత్తులో అనారోగ్యం (unhealthy) బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయంట.

ఇంకా చదవండి ...

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో వరి ప్రధాన ఆహారం (food)గా ఉంది. బియ్యం సరఫరా తగినంత ఉండటం కూడా ఆహార భద్రతకు చాలా ముఖ్యం.. మన దేశంలో ఎక్కువగా వరి పండిస్తారు. ఇందులో చాలామంది కూడా అన్నం (rcie) ఆహారంగా తీసుకుంటారు. ఇక. ఇందులో చాలా ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్స్‌ అనేవి ఉంటాయి. ఇక ఇవి శరీరానికి కావల్సిన శక్తిని బాగా అందిస్తాయి. అయితే అన్నం వండుకోవడం చాలా సులభమైన పద్ధతి అని చెప్పాలి. కానీ బియ్యాన్ని సరైన పద్దతిలో ఉడికించకపోతే క్యాన్సర్ (cancer) వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బియ్యంలో ఆర్సెనిక్ స్థాయి ఎక్కువగా ఉంటుందట. మనుషుల్లో క్యాన్సర్​ రావడానికి ఆర్సెనిక్ (arsenic) కారణం కావచ్చు.  అంతేగాక ఇది మన శరీరానికి కూడా అంత మంచిదికాదంటున్నారు. అన్నం ఉడకక ముందే దింపేసి తింటే ప్రమాదమంట. అలా చేస్తుండటం వల్ల భవిష్యత్తులో అనారోగ్యం (unhealthy) బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయంట.

వరిలో రసాయనాలు..

ఈ రోజుల్లో మనం తినే ఆహారాలు ఎక్కువగా అనేక రసాయనాల (chemicals)తో నిండి ఉంటున్నాయని అందరికి తెలుసు. మన జీవనశైలిలో మనకు తెలియకుండానే ఈ హానికరమైన రసాయనాలను మనం తీసుకుంటున్నాం. అయితే ఫ్యూచర్ లో ఇది చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే వరి కూడా..

కీటకాల నుంచి పొలంలో పండే వరిని కాపాడటం కోసం ఇంకా ఎక్కువ దిగుబడుల కోసం రైతులు విపరీతమైన రసాయనిక ఎరువులు అలాగే పురుగుమందులను కూడా బాగా ఉపయోగిస్తున్నారట. ఇక ఈ రసాయనాలు వరిపై తీవ్ర ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. ఈ ఎఫెక్ట్ వరితో తయారయ్యే బియ్యంపై కూడా ఎక్కువగా పడుతుందట. అందువల్ల ఎక్కువగా ఉడకకుండా తింటే క్యాన్సర్ (cancer) బారిన పడి చనిపోయే ప్రమాదం ఉందట. కాబట్టి అన్నాన్ని బాగా వుడికించి తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక అంతేకాక ఉత్తమమైన మార్గం ఏంటంటే అన్నం వండటానికి ముందు ఖచ్చితంగా రాత్రిపూట బియ్యాన్ని నీటిలో నానబెట్టడం చాలా మంచిదట. ఇక దీని కారణంగా బియ్యంలో ఉండే టాక్సిన్స్ అనేవి 80 శాతం తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలపడం జరిగింది.

వరి పొలాలకు నీళ్లు (water) ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆర్సెనిక్ మట్టిలో నుంచి వరి ధాన్యంలోకి చేరడం చాలా సులభం అవుతుంది. తెల్లటి పాలిష్ వరి అన్నాన్ని తింటే టైప్ -2 మధుమేహం (diabetes) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గోధుమ రంగులో ఉండే ముతక బియ్యపు అన్నం తినడం వల్ల ఈ ముప్పు తగ్గుతుంది. పాలిష్డ్ బియ్యం బదులు ముడి బియ్యం వినియోగిస్తే టైప్ -2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పీచుపదార్థం, ఖనిజాలు, విటమిన్లు, ఫైటోకెమికల్స్ వంటి అవసరమైన పోషకాలు గోధుమ రంగు బియ్యంలో ఎక్కువగా ఉంటాయి. భోజనం చేశాక .. రక్తంలో చక్కెర పరిమాణాన్ని కూడా ఎక్కువగా పెంచడం. బియ్యాన్ని పాలిష్ చేయడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, పోతాయి.

First published:

Tags: Cancer, Food, Health benefits, Health problem, Rice, Unhealthy