వర్షాకాలం(monsoon). ఇతర సీజన్లతో పోల్చితే వర్షాకాలంలో ఆరోగ్యం(health) విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. సీజనల్ వ్యాధులతో పాటు ఎసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం తదితర జీర్ణక్రియ(digestive) సమస్యలు తరచుగా ఇప్పుడే ఎదురవుతుంటాయి. తేమతో కూడిన వాతావరణం జీర్ణక్రియ రేటును నెమ్మదించేలా చేస్తే, కలుషితమైన ఆహారం మరిన్ని జీర్ణ సంబంధ సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే ఈ సీజన్‌లో శుద్ధి చేసిన నీరు(water), సమతులాహారం తీసుకోవాలంటారు వైద్యులు సకల అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా(remedies) తీసుకునే పదార్ధాల్లో ఎక్కువ శాతం పర కడుపునే తీసుకుంటూ ఉంటాం. కానీ అదే సమయంలో ఖాళీ కడుపుతో తీసుకోకూడని పదార్ధాలు(items) కూడా ఉన్నాయి. లేకపోతే మొదటికే మోసం. అయితే జీర్ణక్రియ సమస్యలతో బాధపడే వారు ఉదయం(morning) పూట తీసుకునే ఆహారంలో శ్రద్ధ అవసరం. ఉదయం పెరుగు(curd) తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయంట. ఆ వివరాలు తెలుసుకుందాం..
కండరాల పెరుగుదలకు ప్రోటీన్లు(proteins) అధికంగా ఉండే పెరుగు చాలా తోడ్పడుతుంది, పెరుగు ఉదయాన్నే(morning) మంచి ఎనర్జీని అందిస్తుంది. ఫ్యాట్, ప్రోటీన్ లెవల్స్ ఎక్కువగా ఉండటం వలన ఎక్కువ సమయం పొట్ట నిండుగా కనిపిస్తుంది. జీర్ణశక్తిని పెంచి వ్యాధి నిరోధక శక్తి మెరుగుపరుస్తుందట. పెరుగులో కొంచెం తేనే, కొన్ని నట్స్, సీడ్స్ మిక్స్ చేసి ఉదయం పూట తినాలి. లేదంటే ఏవైనా పండ్లు కలిపి పెరుగును ఉదయం తింటే మంచి ఫలితాలు ఉంటాయట.
ఇది కూడా చదవండి: మీ చిరుతిండిలోనూ రోగనిరోధక శక్తి ఉండాలంటే.. వీటిని తినండి
కొన్ని పదార్ధాల్ని ఖాళీ కడుపు(empty stomach)తో అస్సలు తీసుకోకూడదంటున్నారు డైటిషియన్, ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా బరువు(weight) తగ్గించుకోవాలనుకునేవారు. బరువు తగ్గాలని కోరుకునేవారు అల్పాహారం మానడం అత్యంత ప్రమాదకరమని (dangerous) కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఏది పడితే అది ఉదయం తీసుకోకూడదు.
సాఫ్ట్ డ్రింక్స్‌ను మొత్తానికి మానేయడం మంచిది. ఉదయం పూట అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే సాఫ్ట్ డ్రింక్స్‌లో కార్బన్డయాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. చక్కెరస్థాయి(sugar levels) కూడా అధికమే. అందుకే బరువు తగ్గాలనుకుంటే పూర్తిగా మానేయడం మంచిది. కొంతమంది ఉదయం లేచీ లేవగానే కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఉదయం పూట ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అల్లంలో వేడినీటిని కలుపుకుని తాగితే జీర్ణ ప్రక్రి మెరుగుపడుతుంది. కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది.
అల్పాహారంతో కారంతో తయారైన పదార్ధాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయం పూట కారపు పదార్ధాలు తినడం వల్ల కడుపులో అసౌకర్యం కలుగుతుంది. వీటిలో ఆమ్ల గాఢత ఎక్కువ ఉండటం వల్ల ఇబ్బంది కల్గిస్తుంది. ఇక ముడి కూరగాయల్ని ఉడికించి లేదా పచ్చిగా తినడం కొంతమంది అలవాటు చేసుకుంటారు. ఇది మంచిదే కానీ.. పర కడుపున అస్సలు తినకూడదు. ఖాళీ కడుపున తీసుకుంటే నేరుగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అందుకే కొన్ని పదార్ధాలు ఆరోగ్యానికి మంచివైనా సరే.. ఖాళీ కడుపున (Empty stomach) మాత్రం తీసుకోకూడదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Curd, Health benefits, Health Tips