Home /News /life-style /

WHAT HAPPENS IF AN ELEPHANT APPEARS IN A DREAM AND WHAT CHANGES ARE COMING IN YOUR LIFE LETS FIND OUT NOW PRV

Dreams: కలలో ఏనుగు కనిపిస్తే ఏమవుతుంది? మీ జీవితంలో వచ్చే మార్పులేంటి? ఓసారి తెలుసుకుందాం..

ఏనుగులు

ఏనుగులు

కొన్ని జంతువులు కలలో కనిపిస్తే మంచి జరుగుతుందట. మరికొన్ని కనిపిస్తే చెడుకు సంకేతమట. అందులో ఏనుగు ముఖ్యమైనది. ఈ జంతువు కనిపిస్తే జీవితంలో చాలా మార్పులు వస్తాయట.

    మనం నిద్రపోతున్నపుడు కలలు(Dreams) రావడం సహజం. పగటి పూట వచ్చిన కలలు నిజమవుతాయని అంటుంటారు చాలామంది. ఇది పక్కన పెడితే జ్యోతిష్కులు, స్వప్న శాస్త్ర నిపుణులు కలల సంజ్ఞలకు పలు రకాల అర్థాలు(meanings) ఉంటాయని చెబుతారు. స్వప్న శాస్త్రం(Dream science) ప్రకారం.. కలలో మనం చూసే కొన్ని విషయాలు జీవితంలో నిజం అవుతాయి. కలలో కొన్ని మీకు కనిపిస్తే అది అరిష్టంగా భావిస్తారు. కొందరకి కలలో తరచుగా కొన్ని జంతువులు(Animals), పక్షులు సైతం కనిపిస్తాయి. కొన్ని సార్లు భయంకరమైన వస్తువులు కలలో కనిపిస్తే మరికొన్నిసార్లు ఎంతో సానుకూలమైనవి కలలో కనిపిస్తుంటాయి. అయితే ఏదైనా చెడు సంఘటనలు జరిగినట్టు కలలో కనిపిస్తే మనం వాటిని గుర్తు చేసుకొని ఏం జరుగుతుందో అన్న గాభరా పడుతూనే ఉంటాం. అయితే కొన్ని జంతువులు కలలో కనిపిస్తే మంచి(good) జరుగుతుందట. మరికొన్ని కనిపిస్తే చెడు(bad)కు సంకేతమట. అందులో ఏనుగు(elephant) ముఖ్యమైనది. ఈ జంతువు కనిపిస్తే జీవితంలో చాలా మార్పులు వస్తాయట. మరి అవేంటో తెలుసుకుందాం..

    కొందరు తమకు కలలో వచ్చిన విషయాలు చెబితే కుటుంబసభ్యులు, స్నేహితులు ఆశ్చర్యపోతారు. కొన్నిసార్లు కొన్ని విషయాలు విని పగటికలలు కంటున్నావా ఏంటి అని మందలించే ప్రయత్నం చేస్తారు. కలలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంతకుమించిన ఆసక్తి కలలపై నెలకొంది.
    స్వప్న శాస్త్రం ప్రకారం, కలలు రావడంతో కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తాయి. కల ఆధారంగా మంచి, చెడు అంచనా వేస్తారు. కొందరికి కలలో ఏనుగు తరచుగా కనిపిస్తుంది. అయితే మీకు కలలో ఏనుగు వస్తే, మీ దశ(fate) తిరగనుందని అర్థం. అప్పటివరకు మీరు ఆర్థికంగా(financial) ఎదుర్కొన్న సమస్యలన్నీ(problems) తీరిపోతాయట. ఏదో విధంగా మీకు ధనలాభం గోచరిస్తుంది. మీరు త్వరగా ధనవంతులు(richest) కాబోతున్నారని సంకేతం. లేదా మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు.

    ప్రేమకు చిహ్నం కుందేలు..

    ఆవు(cow) రూపం కలలో కనిపించిందంటే ఆ వ్యక్తికి దేవుడి పట్ల భక్తి ఉంటుంది. ఆ వ్యక్తి దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆవు మీకు కలలో కనిపిస్తే, ఆ సమయంలో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. హాయిగా నిద్రిస్తున్నా మీకు కలలో పాము కనిపించిందంటే ఉలిక్కిపడి లేస్తారు. కలలో పాము కనిపిస్తే ఏ భయాలు, ఆందోళన అక్కర్లేదు. కలలో పాము కనిపించడాన్ని మంచి శకునమని చెబుతారు.  మీరు జీవితంలో విజయం సాధిస్తారని అర్థం. మీరు సురక్షితంగా ఉంటారని సైతం కొందరు పెద్దలు చెబుతారు. మీకు గాఢ నిద్రలో ఉండగా కుందేలు లాంటి జంతువులు చాలా తక్కువ సందర్భాల్లో కలలో వస్తాయి. అయితే అలా కుందేలు కలలో కనిపించిన వ్యక్తుల ప్రేమ జీవితం బాగుంటుంది. వారు అధికంగా ప్రేమను పొందుతారు. కొన్ని రంగాలవారికి విజయం సిద్ధిస్తుంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Elephant, Life Style, Money

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు