పాము కాటేసినప్పుడు టీ తాగితే ఏమవుతుంది?

మన దేశంలో పాము కాటు మరణాలు ఎక్కువే. ముఖ్యంగా పొలాల్లో రైతుల్ని పాములు ఎక్కువగా కాటేస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో రైతులు చనిపోతుండటం విషాదకరం. మరి పాము కాటేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

news18-telugu
Updated: June 29, 2020, 4:28 AM IST
పాము కాటేసినప్పుడు టీ తాగితే ఏమవుతుంది?
పాము కాటేసినప్పుడు టీ తాగితే ఏమవుతుంది?
  • Share this:
పాము కాటేసినప్పుడు అది విషపూరితమైన పాము కాకపోతే పెద్దగా ఇబ్బంది ఉండదు. అదే విషపూరితమైన పామైతే... క్షణక్షణం మృత్యువు తరుముకొస్తూ ఉంటుంది. ప్రాణాలు దక్కించుకునేందుకు గట్టిగా ప్రయత్నించాలి. అలా చెయ్యాలంటే విషపూరితమైన పాము కాటు వేస్తే... వెంటనే మనలో ఎలాంటి మార్పులు వస్తాయో మనకు తెలియాలి. కాటు వేసిన ప్రదేశాన్ని జాగ్రత్తగా గమనించాలి. అక్కడ మనకు ఇంజెక్షన్ చేసినప్పుడు ఎలాగైతే... చర్మానికి చిన్న కన్నం పడుతుందో... అలాంటి రెండు కన్నాలు... పక్కపక్కనే పడి ఉంటాయి. ఆ రెండు కన్నాలూ ఉన్నాయంటే... ఆ పాముకి కోరలు ఉన్నట్లే. అది విషపూరితమైన పామే అని తెలుసుకోవాలి. పాము కాటు వేసిన చోట నొప్పిగా ఉంటుంది. ఆ ప్రదేశంలో కొద్దిగా వాపు వస్తుంది. అలాగే... అది పాలిపోయినట్లుగా కలర్ లేకుండా తయారవుతుంది. అంతేకాదు ఊపిరి సరిగా ఆడదు. వికారంగా ఉంటుంది. హైబీపీ వస్తుంది. నరాల వీక్‌నెస్ ఉంటుంది. జ్వరంగా కూడా ఉంటుంది.

కొన్ని పాములు కాటేసినప్పుడు అంబులెన్స్ వచ్చేలోపే ప్రాణం పోతుంది. కొన్నిసార్లు బతికే ఛాన్స్ ఉంటుంది. మరి అంబులెన్స్ వచ్చే లోపు ఏం చెయ్యాలంటే... కాటేసిన చర్మ ప్రదేశాన్ని గమనించాలి. విషం బయటకు వచ్చేసేలా ఉంటే... జాగ్రత్తగా బయటకు తియ్యాలి. అంటే... లోపలి చర్మం దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. నీరు, టీ వంటివి బాగా తాగాలి. వాటికి మన బాడీలోని విష వ్యర్థాల్ని తొలగించే శక్తి ఉంటుంది. అటూ ఇటూ కదలకుండా ఉండాలి. అందువల్ల విషం మరింత విస్తరించకుండా ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోండి. గుండె కొట్టుకునే వేగం పెరిగితే... విషం విస్తరించే వేగం కూడా పెరుగుతుంది. antihistamines అనే టాబ్లెట్ వేసుకోవాలి. లేదా... కార్డియాక్ మందులు కూడా వేసుకోవచ్చు.

ఇలా మాత్రం చెయ్యవద్దు :
- కాటేసిన చోట గాయాన్ని కోసి... విషాన్ని బయటకు తియ్యవద్దు.
- విషం పాకకుండా ఉండాలనే ఉద్దేశంతో గాయం చుట్టూ... టేపు లాంటిది (tourniquet) కట్టవద్దు.
- కాటేసిన చోట క్రీముల వంటివి రాయవద్దు.
- మద్యం, కాఫీ లాంటివి తాగవద్దు.మన సినిమాల్లో పాము కాటెయ్యగానే... మరో వ్యక్తి... నోటితో ఆ భాగంలో పీల్చి... విషాన్ని ఉమ్మి వేసినట్లు చూపిస్తారు. ఇలా చేస్తే... విషం బయటకు పోతుందా అన్నదానిపై రకరకాల అభిప్రాయాలున్నాయి. కాటేసిన 15 నిమిషాలలోపు మాత్రమే ఇలా చెయ్యడం వల్ల ఫలితం ఉంటుంది. అలాగే విషం తీసే వ్యక్తికి అనుభవం కూడా ఉండాలి. అయినప్పటికీ ఇలా చెయ్యడం వల్ల 50 శాతం విషం మాత్రమే బయటకు వస్తుందంటున్నారు.

ఒకవేళ మిమ్మల్ని కాటు వేశాక పాము చనిపోతే... దాన్ని చేతులతో ముట్టుకోకుండా... జాగ్రత్తగా ఓ ప్లాస్టిక్ బ్యాగులో వేసి... పరిశోధన కోసం పంపాలి.
First published: June 29, 2020, 4:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading