హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Young look: నిత్య యవ్వనంగా కనిపించాలంటే రోజు ఆహారంలో ఇది తీసుకోండి.. అదేంటంటే..

Young look: నిత్య యవ్వనంగా కనిపించాలంటే రోజు ఆహారంలో ఇది తీసుకోండి.. అదేంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మీరు యవ్వనంగా ఉండాలంటే మీ ముఖం(face) మీద ఉన్న ముడతలను వదిలించుకోవాలి. ఆ తర్వాత యవ్వనం మీ సొంతమవుతుంది. దీనిని నెరవేర్చడానికి ఒక పదార్థం(item) రోజే తీసుకుంటే మీరు నిత్య యవ్వనంగా కనిపిస్తారు. ఇంతకీ ఏంటా పదార్థం అనుకుంటున్నారా?

యవ్వనాన్ని(Young look) కోల్పోకూడదని చాలా మంది భావిస్తారు. ఒక చిన్న తెల్ల వెంట్రుక కనబడితే చాలు అరవై ఏళ్లు వయస్సు ఉన్నట్లు చాలా మంది భావిస్తారు. యవ్వనం(young)గా కనబడేందుకు అనేక మార్గాలను అందిస్తున్నారు. మీరు యవ్వనంగా ఉండాలంటే మీ ముఖం(face) మీద ఉన్న ముడతలను వదిలించుకోవాలి. ఆ తర్వాత యవ్వనం మీ సొంతమవుతుంది. దీనిని నెరవేర్చడానికి ఒక పదార్థం(item) రోజే తీసుకుంటే మీరు నిత్య యవ్వనంగా కనిపిస్తారు. ఇంతకీ ఏంటా పదార్థం అనుకుంటున్నారా? అదే పెరుగు(curd).. మానవ శరీరానికి(Human body) మేలు చేసే పదార్థాలలో పెరుగుది ప్రత్యేక స్థానం. పెరుగు తినడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే ఎముకలకు మేలు చేస్తుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే అది కొలెస్ట్రాల్, అధిక బీపీ(high bp) సమస్యను తగ్గిస్తుంది. పెరుగుతో ఆరోగ్య ప్రయోజనాలు(health benefits) మాత్రమే కాకుండా, చర్మానికి, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. అంతేకాదు నిత్యం పెరుగు తినే వారికి యవ్వనం తొణిగసలాడుతుందట. యవ్వనం ముఖంలో ప్రతిబింబిస్తుందట.

పరిశోధకుల మాటా ఇదే..

పెరుగుతున్న నిత్యం తీసుకుంటే వయసు(age) కనిపించదు. ప్రొఫెసర్ ఎలిక్ మెచినికోఫ్ అనే నోబెల్ బహుమతి పొందిన రష్యన్ శాస్త్రవేత్త పెరుగుపై పరిశోధనలు చేసి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రోజూ తినే ఆహారంలో పెరుగు తీసుకుంటే వయసు కనిపించదని, శరీరంలోని కణాలకు క్షీణత కనిపించదు అని తెలిపారు. రోజూ తినే ఆహారంలో ఉండే రకరకాల రసాయనాలు, అనేక విషపదార్థాలు మన శరీర వ్యాధి నిరోధక శక్తి ఛిన్నా భిన్నం చేస్తుంటాయి. ఫలితంగా మన కణాలు తొందరగా క్షీణించి మనం వయసు పెరిగిన వారిగా కన్పిస్తుంటాం. అలాంటి సమయంలో పెరుగు మనకు ఒక సంజీవినిలా పనిచేస్తుందట.

ఈ వ్యాధులు ఉంటే మాత్రం జాగ్రత్త..

కొంతమందికి పెరుగు తీసుకోవడం కొద్దిగా హానికరం. కొన్ని వ్యాధులు(diseases) ఉన్నవారు పెరుగు తీసుకోవడం మానుకోవాలి. మరి ఎలాంటి వ్యాధులు ఉన్నవారు పెరుగు తినకూడదో తెలుసా.. పెరుగు తీసుకోవడం వలన ఎముకలు, దంతాలకు మంచిది. అయితే పెరుగు తినడం వలన కీళ్లనొప్పులు ఉన్న రోగుల(patients)కు హానికరం. అర్థరైటిస్ రోగులు పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం మానుకోవాలి. ఇది నొప్పిని మరింత తీవ్రం చేస్తుంది. లాక్టోస్ అసహనం ఎక్కువగా ఉన్నవారు.. పెరుగు తీసుకోవద్దు. అలాంటి వారికి పెరుగు తినడం వలన డయేరియా మరియు కడపులో నొప్పి సమస్య ఉండదు. అసిడిటీ సమస్య ఎక్కువగా ఉన్నవారు పెరుగును అస్సలు తినకూడదు. ముఖ్యంగా వీరు రాత్రి పూట పెరుగు అస్సలు తినవద్దు.

First published:

Tags: Curd, Face mask, Food, Health benefits, Life is beautiful, Life Style, Thee young men

ఉత్తమ కథలు