Home /News /life-style /

Sleep tips: పగలు ఎక్కువగా తిరిగితే రాత్రి నిద్ర ఎక్కువొస్తుందా? ప్రశాంతంగా నిద్ర పోవాలంటే ఏం చేయాలి?

Sleep tips: పగలు ఎక్కువగా తిరిగితే రాత్రి నిద్ర ఎక్కువొస్తుందా? ప్రశాంతంగా నిద్ర పోవాలంటే ఏం చేయాలి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు. అయితే హాయిగా నిద్ర పట్టాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

ఉరుకుల పరుగుల జీవితం. ఈ బిజీబిజీ  జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడం (Sleeping ) అనేది ఒక వరంలాంటిదే. కరోనా (corona) నేపథ్యంలో జీవితాలు తలకిందులయ్యాయి. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. వారికి ప్రశాంతత (peace) కరువైంది. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టనివారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి, నిత్యం బిజీబీజీ. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర (sleep) కూడా కరువు అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు. అయితే హాయిగా నిద్ర పట్టాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

వాతావరణంలో కలిగే మార్పులు కారణం కావచ్చు, మరేదైనా వ్యక్తిగత విషయం కావచ్చు.. చాలామంది సుఖ నిద్రను కోల్పోతున్నారు. సుఖంగా నిద్ర పోయి ఎన్నో రోజులు అయి ఉంటుంది చాలామందికి. అయితే  రోజులో ఎక్కువసేపు ప్రశాంతంగా ఉంటే హాయిగా నిద్ర పడుతుందట.

మనసు ప్రశాంతత..

మనసు ప్రశాంతం (heart peaceful)గా ఉండాలి అంటే సాధ్యమైనంతవరకూ మీకు ఇష్టమైతే, ఒంటరిగా గడపడానికి ప్రయత్నించాలి. అయితే ఇలా ఒంటరిగా గడపడం వల్ల మీరు గడిపిన ప్రతిక్షణాన్ని గుర్తు చేసుకుంటూ, ఏ విషయాన్ని మర్చిపోవాలో, ఏ విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి అనే విషయం పైన మీకంటూ ఒక అవగాహన వస్తుంది.

ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

వెలుతురులో తిరగడం..

వెలుతురు (light) ఎక్కువగా ఉండే ప్రదేశాలలో పగటిపూట తిరగడం అలవాటు చేసుకోవాలి. పర్యావరణంలో కనీసం 30 నిమిషాల పాటు గడిపేలా, మీ సమయాన్ని కేటాయించుకోవాలి. రాత్రిపూట పడుకునే ముందు సాధ్యమైనంత వరకు ఆరుబయట స్వచ్ఛమైన గాలిని (fresh air) పీల్చి, పడుకునే లాగా ప్రయత్నించాలి. ఇలాంటి పద్ధతులు పాటించడం వల్ల నిద్ర సుఖంగా వస్తుంది..

ఆహారంలో మార్పులు..

మీరు తీసుకునే ఆహారం (food)లో మసాలాలు ఎక్కువగా ఉన్నా, అది హై ప్రోటీన్ డైట్ అయినా నిద్రలేమికి దారితీస్తుంది అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు, ఆల్కహాల్, కాఫీ, కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను రాత్రి సమయంలో అసలు తినకూడదట. ఇవి మీ నిద్రను దూరం చేస్తాయని నిపుణులు అంటున్నారు.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

వర్షంలో తడిచాక మీ జుట్టు పాడైపోతుంది కదా? ఈ చిట్కాలతో మీ జుట్టును కాపాడుకోండి..




ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Health Tips, Sleep tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు