Food for children: పదిహేనేళ్ల లోపు పిల్లల ఆహారంలో జాగ్రత్తలు తీసుకోకుంటే ఎదురయ్యే సమస్యలేంటి.. వారికి ఎలాంటి ఆహారం అందించాలి?

ప్రతీకాత్మక చిత్రం

నేటి బాలలే రేపటి పౌరులు. అయితే పిల్లల (children) తిండిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే వారు తినే తిండి సరిగా లేకపోతే వారికి భవిష్యత్తులో రోగాలు (diseases) దరిచేరే అవకాశం ఉందట. ముఖ్యంగా పదిహేనేళ్ల లోపు పిల్లలకు ఆహారం అందించేటపుడు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్​. పిల్లలకు ఎలాంటి ఆహారం (food for children) పెట్టాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే భవిష్యత్తు (In future)లో వారు ఇబ్బందులు పడుతారో ఒకసారి తెలుసుకుందాం

  • Share this:
    నేటి బాలలే రేపటి పౌరులు. అయితే పిల్లల (children) తిండిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే వారు తినే తిండి సరిగా లేకపోతే వారికి భవిష్యత్తులో రోగాలు (diseases) దరిచేరే అవకాశం ఉందట. ముఖ్యంగా పదిహేనేళ్ల లోపు పిల్లలకు ఆహారం అందించేటపుడు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్​. పిల్లలకు ఎలాంటి ఆహారం (food for children) పెట్టాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే భవిష్యత్తు (In future)లో వారు ఇబ్బందులు పడుతారో ఒకసారి తెలుసుకుందాం.. చాలా మంది తల్లులు పిల్లలు ఏడవగానే (crying) వారికీ చిరు తిండి పెడుతుంటారు. అంతేకాదు.. ఇక వాళ్ళు ఏది అడిగితే అది కొనిపించి తినిపిస్తూ ఉంటారు. అయితే పిల్లలకు చిన్నప్పుడు తినిపించే పదార్థాల వల్లే పెద్దయిన తరువాత వారి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం ఆధారపడి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే పిల్లలకు బలవర్ధక ఆహారం పెడితే భవిష్యత్తు బాగుంటుందని సూచిస్తున్నారు.

    అధిక బరువు సమస్యలొస్తాయి..

    ఇక పిల్లలకు చిన్నతనం నుంచి అధిక కెలోరీలు ఉన్న ఆహారం (food), నూనె పదార్థాలు, స్వీట్స్‌(sweets), జంక్‌ ఫుడ్స్ (junk foods) ని ఎక్కువగా పెడుతుంటారు. వాటిని తినడం వలన పదిహేనేళ్లలోపు పిల్లల (below 15 years children)లో అధిక బరువు (heavy weight) సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు (experts) చెబుతున్నారు. ఇక అది అలాగే కొనసాగితే యుక్త వయసు (young age)లో కూడా అధిక బరువు, ఊబకాయం సమస్యలు ఎదురవుతాయని అన్నారు.

    జంక్​ ఫుడ్​ వద్దు..

    అయితే వారికీ జంక్‌ ఫుడ్​కి బదులుగా పండ్లు (fruits), పాలు, పెరుగు, మజ్జిగ, బాదం (almonds), ఆక్రోట్‌, వేరుశెనగ, వేయించిన శనగలు, బఠాణి లాంటి గింజలు, మొలకలు, ఉడికించిన గింజలు, మొక్కజొన్నలు మొదలైనవి స్నాక్స్‌ (Snacks)గా అలవాటు చేయాలని తెలిపారు.

    సలాడ్లు బెటర్​..

    వివిధ రకాల చాట్స్‌, సలాడ్లు (salads), టిక్కీలు, కట్లెట్స్‌ చేయవచ్చు. అంతేకాక చపాతీలో గుడ్డు (egg), పనీర్‌, చికెన్‌ (chicken) లాంటివి చేర్చి రోల్స్‌ చేయాలన్నారు. ఆలా పిల్లలు ఇష్టపడేలా తయారు చేయాలని నిపుణులు చెబుతున్నారు.

    వీటి వల్ల ఆకలి తీరడమే కాకుండా పిల్లల శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు (vitamins), ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలని సంవృద్ధిగా అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇళ్లలో చేసినవైనా, బయటి నుండి తెచ్చినవైనా స్వీట్లు, నూనె (oil)లో వేయించిన పిండివంటలు, బిస్కెట్లు, చాక్ లెట్లు, బేకరీ ఫుడ్స్‌ (bakery foods) వీలైనంత తక్కువగా పిల్లలకు ఇవ్వాలని అన్నారు.

    ఈ చిరుతిళ్ళ వల్ల ఆరోగ్యానికి హానిచేసే సాచురేటెడ్‌ కొవ్వులు, ట్రాన్స్ ‌ఫ్యాట్స్‌, అధిక కెలోరీలు (heavy calories) శరీరంలో చేరుతుందని తెలిపారు. దీంతో చిన్న వయస్సులోనే అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published: