రోజులో ఒక్కసారి నిద్ర కూడా సరిగా పట్టనివారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి, నిత్యం బిజీబీజీ. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర కూడా కరువు (Sleeping problems) అవుతుంది. నిద్ర లేకపోవడం (No sleep) వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు. అయితే చాలామంది రాత్రి కాఫీ తాగి పడుకుంటారు. ఇది అస్సలు మంచిది కాదంట. ఎందుకంటే..
కాఫీ తాగితే..
మనం తాగే టీ లేదా కాఫీ (coffee)లో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. అదేవిధంగా మన శరీరంలో కేంద్ర నాడీ వ్యవస్థ(సీఎన్ఎఫ్)లో లో అడెసినోసిన్ రిసెప్టార్స్ లేదా పీ1 రిసెప్టార్స్ అని పిలిచే న్యూరోమాడ్యులేటర్ మనకు నిద్ర కలిగించడానికి కారణం అవుతుంది. పీ1 రిసెప్టార్స్ పై ఈ కెఫిన్ ప్రభావం చూపి అడెసినోసిన్ ను అడ్డుకుంటుంది. అందువల్ల కాఫీ తాగిన తర్వాత మనకు నిద్ర (sleep) రాదు. అయితే నిద్ర పోకుండా ఉండటానికి కాఫీలో కెఫిన్ ప్రతిరోజు కేవలం 400 మిల్లీ గ్రాములు మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక సమస్యలు వెంటాడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?
అనారోగ్య సమస్యలు..
కాఫీ లేదా టీ ప్రతి రోజూ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలు (health problems) తలెత్తుతాయి. ముఖ్యంగా మన కేంద్రీనాడీ వ్యవస్థ పై అధిక ప్రభావం చూపి నిద్రలేమి సమస్యకు దారి తీస్తుంది. అదేవిధంగా విపరీతమైన తలనొప్పి, అలసట, ఒత్తిడి (stress) వంటి సమస్యలు తలెత్తుతాయి.మనం కాఫీ ,టీ లను మితంగా తీసుకోవడం వల్ల ఎంతో చురుగ్గా మన పనులను మనం చేసుకోగలుగుతాము. కాబట్టి కాఫీ టీ లను పరిమితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం (health)తో పాటు మనం అనుకున్న పనులలో విజయం సాధించవచ్చు.
ఏం చేయాలి..?
సాయంత్రం పూట మద్యం, సిగరెట్లు (cigarettes), ఎక్కువ భోజనం మానుకోండి. ఆల్కహాల్ (alcohol), సిగరెట్లు మరియు కెఫిన్ నిద్ర (sleep)కు భంగం కలిగిస్తాయి. ఎక్కువ, కారంగా భోజనం చేయడం వల్ల అజీర్ణం (digest) వల్ల అసౌకర్యం కలుగుతుంది. అది నిద్రపోవటాన్ని కష్టంగా చేస్తుంది. నిద్రకు ముందు (before sleep) రెండు, మూడు గంటలు ముందు ఎక్కువ భోజనం (food) తినొద్దు (don’t eat). ఒకవేళ ఆకలి (hungry)తో ఉంటే నిద్రపోవడానికి 45 నిమిషాల ముందు తేలిక పాటి చిరుతిండి (snacks)ని ప్రయత్నించండి. అప్పుడు హాయిగా నిద్ర పడుతుంది.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
ఇవి కూడా చదవండి: తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి
ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coffee, Health Tips, Life Style, Sleep tips