#Health Tips: వామ్మో.. చిరుధాన్యాలు తింటే ఇన్ని లాభాలా...

ప్రతిఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. హెల్దీగా ఉండాలంటే ఏవీ తినాలి. ఎంత తినాలి. ఏం తినడం వల్ల ఏం ప్రయోజనం వంటి వాటిని పరీక్షిస్తూ ఆరోగ్యాన్ని పరీరక్షించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది హెల్దీ డైట్ వైపు మల్ళుతున్నారు. దీనికితోడు ఆరోగ్య నిపుణుల సలహా మేరకు చిరుధాన్యాలను తమ మెనూలో చేర్చుకుంటున్నారు. అయితే ఈ చిరుధాన్యాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

Amala Ravula | news18-telugu
Updated: January 24, 2019, 1:45 PM IST
#Health Tips: వామ్మో.. చిరుధాన్యాలు తింటే ఇన్ని లాభాలా...
ప్రతీకా్తమక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: January 24, 2019, 1:45 PM IST
జొన్నలు..
జొన్నల్లో పోషకాలు, కాల్షియం, ప్రోటీన్లు, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెజబ్బులను దూరం చేస్తాయని వైద్య పరిశోధనల్లో తేలింది. అంతేకాదు, నరాల బలహీనత, మానసిక రుగ్మత, కాళ్లు, చేతుల మంట, నోటిపుండ్లు, వార్ధక్య రుగ్మతల నుంచి కాపాడతాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
సబ్జా..

ఎక్కువగా ఎండాకాలంలో వీటిని ఉపయోగిస్తాం.. సబ్జాగింజలు నానబెట్టిని నీటిని తాగడం వల్ల దాహార్తి తీరడమే కాదు.. దగ్గు, ఆస్తమ, మంట, తలనొప్పి, జ్వరం వంటి సమస్యలు తలెత్తవు.. అదేవిధంగా.. శరీరంలోని కొవ్వుని తగ్గించడంలో ఇవి భేషుగ్గా పనిచేస్తాయి. అజీర్తిని తగ్గింస్తాయి. ఇందులో పిండి పదార్థాలతో పాటు మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఇనుము, కాల్షియం, పాస్పరస్, థయామిన్, రైబో ఫ్లేవిన్ వంటి పదార్థాలన్నీ ఉన్నాయి.
కొర్రలు..
ఊబకాయంతో బాధపడేవారు.. వీటిని అన్నంలా వండుకుని తినడం వల్ల సమస్య అదుపులోకి వస్తుంది. మంచి బలవర్దకమైన ఈ ఆహారంపై ప్రతిఒక్కరికీ అవగాహన పెరిగింది. దీనివల్ల చాలామంది కొర్రలతో వంటచేసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా.. చిన్నారులు, గర్భిణీలకు ఇది మంచి బలవర్ధకమైన ఆహారం అని చెప్పొచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల ద్వారా ఉద సంబంధ వ్యాధులు, గుండెసమస్యలు, కీళ్లవాతం, రక్తస్రావం వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.


సామలు..
Loading...
ఇందులో కూడా ఎక్కువగా ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు, ఫైబర్, మినరల్స్, కాల్షియం ఉంటాయి. వీటి వల్ల శరీరానికి అదనపు శక్తి ఖాయం. అజీర్తి సమస్యలు దూరం చేసుకోవచ్చు. అదే విధంగా మైగ్రేన్ సమస్య కూడా దూరమవుతుంది. తీయ్యగా ఉండే వీటిన తీసుకోవడం వల్ల మాంసకృత్తులు పొందినవారవుతాం.
రాగులు..
కాల్షియం అధికంగా ఉండే రాగులు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరానికి చల్లదనం ఇస్తాయి. బీ కాంప్లెక్స్ అధికంగా ఉండే వీటిని తీసుకోవడం వల్ల పెరుగుదల అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు, నరాలు బలంగా మారాయి. బాలింతలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాదు, వీటిని తీసుకోవడం వల్ల పేగు క్యాన్సర్ దూరంగా ఉండొచ్చు.
అరికెలు..
ప్రోటీన్స్, కొవ్వుపదార్థాలు, ఫైబర్, మినరల్స్ అధికంగా ఉన్న వీటిని తీసుకోవడం వల్ల శక్తి మీ సొంతమవుతుంది.
ఊదలు..
వీటిని తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఊదలు మంచి ప్రయోజనాలనిస్తాయి. కూర్చొని పనిచేసేవారికి ఇది చక్కని ఆహారం.
అవిసెలు..
పోషకాలు అధికంగా ఉండే వీటివల్ల పిల్లల్లో శారీరక ఎదుగుదల సక్రంగా ఉంటుంది. రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిలను ఇవి అదుపులో ఉంచుతాయి. అదే విధంగా.. నెలసరి సమస్యలకు ఇది చక్కని పరిష్కారం. మధుమేహ వ్యాధిగ్రస్థులు వీటిని తరచుగా తీసుకోవడం చాలా మంచిది.
మొత్తానికీ చిరుధాన్యాలను తీసుకుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది. వీటిలో ఉండే ఎన్నో పోషకాలు గుండెజబ్బులు, డయాబెటీస్‌ని దరిచేరనివ్వవు. స్త్రీలల్లో వచ్చే మోనోపాజ్, రొమ్ము క్యాన్సర్‌ వంటి సమస్యలను అదుపు చేస్తాయి.
అందుకే బహిరంగ మార్కెట్స్‌లో ఇప్పుడు చిరుధాన్యాలు ఎక్కువ గిరాకీ పెరిగింది.
First published: January 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...