హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Lung Cancer: ఇ-సిగరెట్లతో కాన్సర్ రాదా?... డాక్టర్లు ఏం చెబుతున్నారు?

Lung Cancer: ఇ-సిగరెట్లతో కాన్సర్ రాదా?... డాక్టర్లు ఏం చెబుతున్నారు?

ఇ-సిగరెట్లతో కాన్సర్ రాదా?... డాక్టర్లు ఏం చెబుతున్నారు?

ఇ-సిగరెట్లతో కాన్సర్ రాదా?... డాక్టర్లు ఏం చెబుతున్నారు?

Lung Cancer: ఊపిరితిత్తుల కాన్సర్ ఎలా వస్తుంది? దీనిపై ప్రజల్లో ఉన్న అపోహలేంటి? హైదరాబాద్... యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ బోల్లం ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

మనం ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఏ టెన్షనూ ఉండదు. దురదృష్టం కొద్దీ ఏ ప్రమాదకర వ్యాధి బారినో పడితే... కోలుకోవడం కష్టమే. ముఖ్యంగా కాన్సర్... సైలెంట్‌గా వ్యాపిస్తోంది. ఇది చాలా తేలిగ్గా సోకుతున్న వ్యాధి అని మీకు తెలుసా? జాగ్రత్త పడకపోతే ప్రమాదమే. అమెరికన్ కాన్సర్ సొసైటీ (ACS) ప్రకారం ఊపిరితిత్తుల కాన్సర్ రెండో అత్యంత సాధారణ కాన్సర్. ఈ వ్యాధిపై ప్రజల్లో చాలా అపోహలు, నమ్మకాలూ ఉన్నాయి. ఇది ఎవరికి వస్తుంది, చికిత్స ఏమిటి, దీన్ని నివారించవచ్చా, దీనితో నివసించే రోగుల్లో... వ్యాధి స్థాయిని ఎలా గుర్తిస్తారు? దీనిపై ఎలాంటి అపోహలు ఉన్నాయి? అనే వాటిపై హైదరాబాద్... యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ బోల్లం ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

అపోహ: ఊపిరితిత్తుల కాన్సర్ ధూమపానం చేసేవారికే వస్తుంది.

వాస్తవం: ఊపిరితిత్తుల కాన్సర్‌కి ధూమపానం చాలా సాధారణ కారణం. స్మోకింగ్ చెయ్యని వారికి కూడా ఇది సోకే ప్రమాదం ఉంది. ఇతరులు వదిలిన పొగ... లోపలికి వెళ్లినా కాన్సర్ రాగలదు. అలాగే... ఆర్సెనిక్, ఆస్బెస్టాస్, రాడాన్, యురేనియం, కొన్ని పెట్రోలియం ఉత్పత్తుల వల్ల ఈ వ్యాధి సోకగలదు. పర్యావరణ కాలుష్యం కూడా ఊపిరితిత్తుల కాన్సర్ వచ్చేలా చేయగలదు.

అపోహ: మహిళల్లో రొమ్ము కాన్సర్ కంటే... ఊపిరితిత్తుల కాన్సర్ సోకే అవకాశాలు తక్కువే.

వాస్తవం: ఊపిరితిత్తుల కాన్సర్ సమాన అవకాశ వ్యాధి. సగం ఊపిరితిత్తుల కాన్సర్ కేసులు మహిళల్లో కనిపిస్తాయి. ఇతర రకాల కాన్సర్లతో కంటే ఊపిరితిత్తుల కాన్సర్ నుంచి ఎక్కువ మంది మహిళలు బయటపడతారు.

అపోహ: మీరు సంవత్సరాలుగా ధూమపానం చేస్తుంటే... మానడం కష్టం

వాస్తవం: ధూమపానం మానేస్తే కాన్సర్ సోకే అవకాశాలు తగ్గుతాయి. మానాలని గట్టిగా నిర్ణయించుకుంటే మానేయవచ్చు. పదేళ్లపాటూ స్మోకింగ్ అలవాటును మానేస్తే... ధూమపానం చేసే వారితో పోలిస్తే ఊపిరితిత్తుల కాన్సర్ వచ్చే ప్రమాదం సగం తగ్గుతుంది.

అపోహ: లో-తార్ లేదా 'లైట్', ఇ-సిగరెట్లు వాడొచ్చు. వాటి వల్ల కాన్సర్ రాదు.

వాస్తవం: అలా ఏమీలేదు. అన్ని రకాలవీ, అవి పొగాకు లేదా వేడిని కలిగి ఉంటే ప్రమాదకరమే. ఈ-సిగరెట్లతోనూ కాన్సర్ రాగలదు. వాటిలో మెంథాల్ చేరిక మరింత ప్రమాదకరం.

అపోహ: ఊపిరితిత్తుల కాన్సర్‌ వచ్చాక... అప్పుడు ధూమపానం మానేయడం వల్ల ప్రయోజనం ఉండదు

వాస్తవం: కాన్సర్ సోకిందని తేలాక వెంటనే ధూమపానం ఆపేస్తే... కాన్సర్‌ను నయం చేసే అవకాశాలు పెరుగుతాయి. చికిత్స బాగా చేసేందుకు వీలవుతుంది. చికిత్స సమయంలో, ఆ తర్వాత కూడా ధూమపానం పూర్తిగా ఆపేయడం మేలు.

అపోహ: యువకులకు ఊపిరితిత్తుల కాన్సర్ రాదు

వాస్తవం: ముసలివారిలో ఊపిరితిత్తుల కాన్సర్ చాలా సాధారణం. ఈ రోజుల్లో యువత, పిల్లలు, ధూమపానం చేయనివారికి కూడా ఇది సోకుతోంది. మొదట్లోనే దీన్ని గుర్తిస్తే... త్వరగా నయం చేయడానికి వీలవుతుంది.

అపోహ: ప్రారంభ దశలో ఊపిరితిత్తుల కాన్సర్‌ను గుర్తించడం కష్టం

వాస్తవం: దీర్ఘకాలిక ధూమపానం, COPD, ఎంఫిసెమా వంటి వాటి వల్ల ఊపిరితిత్తుల కాన్సర్ లక్షణాలు ఉన్నాయో లేదో వెంటనే గుర్తించలేమన్నది నిజం. కానీ... ముందుగానే ట్రీట్‌మెంట్ ప్రారంభిస్తే... ఆపరేషన్ సక్సెస్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.


ఇది కూడా చదవండి: Weight Loss: అధిక బరువుతో బాధపడుతున్నారా? మీ వంటల్లో వీటిని తప్పక చేర్చండి

అపోహ: ఊపిరితిత్తుల కాన్సర్ చికిత్స చేయలేని దశలో కనుక్కుంటే కష్టమే.

వాస్తవం: ఊపిరితిత్తుల కాన్సర్‌కి ఇప్పుడు చాలా రకాల ట్రీట్‌మెంట్లు ఉన్నాయి. అందువల్ల కాన్సర్ ఎక్కువగా ఉన్నా... నయంచేసే అవకాశాలున్నాయి. పరిస్థితి అక్కడి దాకా తెచ్చుకోకుండా ఉండటం ఉత్తమమైన విధానం. అందుకు ధూమపానం మానేయాలి. మంచి ఆహారం తినాలి. అందులో అన్ని రకాలూ ఉండేలా చూసుకోవాలి. అలాగే కాలుష్యానికి దూరంగా ఉండాలి. మొక్కల మధ్య తిరగాలి. ఊపిరి తీసుకోవడంలో ఏమైనా సమస్యగా అనిపించినా, ఊపిరితిత్తుల్లో నొప్పి వచ్చినా వెంటనే డాక్టర్‌ని కలవడం మంచిది.

First published:

Tags: Cancer

ఉత్తమ కథలు