Father's Day 2021: Walnut | మీ తండ్రి నిండునూరేళ్ల ఆరోగ్యం కోసం...ఈ డ్రైఫ్రూట్‌ బాక్స్ గిఫ్ట్ ఇవ్వండి...

Walnuts ను డ్రైఫ్రూట్స్ లో రారాజు అంటారు. వాల్‌నట్ లో రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచే మంచి కొవ్వులు ఉంటాయి. అంతేకాదు వీటిని చాలా ప్రొటీన్లు కలిగి ఉండటమే కాకుండా శరీరానికి ఎంతో మేలును కలిగిస్తుంది.

Walnuts ను డ్రైఫ్రూట్స్ లో రారాజు అంటారు. వాల్‌నట్ లో రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచే మంచి కొవ్వులు ఉంటాయి. అంతేకాదు వీటిని చాలా ప్రొటీన్లు కలిగి ఉండటమే కాకుండా శరీరానికి ఎంతో మేలును కలిగిస్తుంది.

  • Share this:
    Walnuts ను డ్రైఫ్రూట్స్ లో రారాజు అంటారు. వాల్‌నట్ లో రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచే మంచి కొవ్వులు ఉంటాయి. అంతేకాదు వీటిని చాలా  ప్రొటీన్లు కలిగి ఉండటమే కాకుండా శరీరానికి ఎంతో మేలును కలిగిస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో వాల్‌నట్ కీలకపాత్ర పోషిస్తాయి. ఇందులో విటమిన్స్, క్యాలరీస్, ఫైబర్, ఒమేగా -3 మరియు ఇనుము, సెలీనియం, కాల్షియం, జింక్, విటమిన్ E మరియు కొన్ని B విటమిన్లు కలిగి ఉంటాయి

    walnut గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది

    బాదం పిస్తా వంటి పప్పులు తీసుకోవడం ద్వారా గుండె జబ్బు ప్రమాదం తగ్గించి ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగిస్తుంది దీనికి వాల్‌నట్ మినహాయింపు కాదు. వాల్‌నట్ తినడం వలన గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది దీనిలో ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ ను సమృద్ధిగా కలిగి ఉంది. ఇది శరీరంలోని రక్తప్రసరణ పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వార శరీరంలోని అవయవాలకు రక్తం సరఫరా బాగుగా జరుగుతుంది. రక్తపోటు కంట్రోల్ అదుపులో ఉంచుతుంది. అందువల్ల గుండె ఆరోగ్యంతో ఉంటుంది. వాల్‌నట్ శరీరంలో ఏర్పడే చెడు కొలెస్ట్రాలును తగ్గిస్తుంది.

    వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది

    సంతాన లేమితో బాధపడేవారికి వాల్‌నట్ ఒక దివ్యమైన ఔషధం అని చెప్పవచ్చు. వాల్‌నట్ మగవారిలో ఆరోగ్యకరమైన వీర్య ఉత్పత్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందువల్ల సంతాన లేమి సమస్యతో బాధపడేవారు రోజూ క్రమం తప్పకుండా వాల్‌నట్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

    మెదడు

    మెదడు రూపంలో కనిపించే వాల్‌నట్ కేవలం రూపానికే పరిమితం కావు. మెదడు కణాలను ఉత్తేజ పరచగల ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మతి మరుపు తగ్గడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి. వాల్‌నట్ అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన లక్షణాల్ని తగ్గించగలవని నిపుణులు గుర్తించారు. మెదడులో సంజ్ఞలను మెరుగు పరిచి, మెదడు కణాల నడుమ కొత్త అనుసంధాన సందేశాలను ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు.
    Published by:Krishna Adithya
    First published: