Health : అరుదైన పండు కుకింగ్ పియర్ ప్రత్యేకతలేంటో తెలుసా?

Cooking Pear Health Benefits : స్విట్జర్లాండ్‌లో పండే కుకింగ్ పియర్... చిన్నగా, గుండ్రంగా... ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ప్రస్తుతం ఈ చెట్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి.


Updated: February 8, 2020, 9:29 AM IST
Health : అరుదైన పండు కుకింగ్ పియర్ ప్రత్యేకతలేంటో తెలుసా?
Health : అరుదైన పండు కుకింగ్ పియర్ ప్రత్యేకతలేంటో తెలుసా? (credit - twitter - Peter Scott )
  • Share this:
Cooking Pear Health Benefits : ఈ సృష్టిలో ఉండే జీవరాసులు, పక్షులు, పండ్లు, చెట్లు... అన్నీ వేటికవే ప్రత్యేక DNAతో ఉంటాయి. వాటిని తిరిగి సృష్టించలేం. అందువల్ల అవి అంతరించిపోకుండా చూసుకోవాల్సింది మనమే. ఇప్పటికే చాలా జంతువులు, పక్షుల వంటివి అంతరించిపోయాయి. తాజాగా స్విట్జర్లాండ్‌కి చెందిన కుకింగ్ పియర్ కూడా అంతరించిపోయే పండ్ల జాతుల్లో చేరిపోయింది. దీన్ని కాపాడే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం... దీన్ని ఈ ఏడాది పండు (Swiss fruit of the year) గా గుర్తించింది. ఇలా గుర్తించడం వల్ల ఫ్రక్టూస్‌ఎక్స్‌టెర్నల్ లింక్ అనే సంస్థ... ఈ పండ్ల జాతిని కాపాడేందుకు ప్రయత్నించనుంది.

ఈ పండు చాలా రుచిగా ఉంటుంది. కానీ దీన్ని డైరెక్టుగా తినరు. దీన్ని వేపుకొని, కాల్చి తింటారు. కొంతమంది దీన్ని కూరల్లో వండుకొని తింటారు. అలా వండేటప్పుడు దీని నుంచీ వచ్చే సువాసన చుట్టుపక్కల అంతటా వ్యాపించి పరిమళభరితంగా ఉంటుంది. అందుకే ఈ పండుకు ఎంతో ప్రాధాన్యం ఉంది.

19వ శతాబ్దంలో... లేక్ జ్యూరిచ్ ప్రాంతంలో... ఈ పండును మొదటిసారి చూశారు. ఆ తర్వాత ఈ చెట్ల పెంపకం, వాడుక బాగా పెరిగింది. మన ఇండియాలో బంగాళా దుంపల్ని ఎలా వండుకొని తింటారో... స్విట్జర్లాండ్‌లో కుకింగ్ పియర్‌ను అలా వండుకునేవారు. క్రమంగా బంగాళాదుంపల వాడకం పెరిగాక... కుకింగ్ పియర్ వాడకం తగ్గింది. అయినప్పటికీ జ్యూస్‌లు, జామ్‌లలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు.

ఈ పండ్ల సాగు తగ్గిపోవడానికి కారణం... ఇవి చాలా చిన్నగా ఉంటాయి. కేజీ పండ్లు సేకరించాలన్నా చాలా టైమ్ పడుతుంది. అందువల్ల ఎక్కువ మేన్ పవర్ అవసరం అవుతుంది. అందువల్ల వీటి సేకరణకు ఎక్కువ ఖర్చు అవుతుందని పండ్ల వ్యాపారులు చెబుతున్నారు. అందువల్ల క్రమంగా ఈ పండ్ల సాగు తగ్గిపోతోంది. ప్రస్తుతం కొన్ని చెట్లు మాత్రమే బతికి ఉన్నాయి.
First published: February 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు