Diabetes : డయాబెటిస్ అనేది ఈ రోజుల్లో కామన్‌గా కనిపిస్తున్న అంశం. డయాబెటిస్ ఉన్నవారి రక్తంలో... గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతూ, ఎక్కువగా తగ్గుతూ ఉంటాయి. డయాబెటిస్ రాకపోతే అదృష్టం. అది వచ్చిందంటే... ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో డయాబెటిస్ ఉన్నవారికి దాంతోపాటూ... హార్ట్ ఎటాక్, కిడ్నీ ఫెయిల్యూర్, నేత్ర సమస్యలు వంటి ఇతర ఎన్నో సమస్యలు కూడా వస్తున్నాయి. మరైతే... ఎవరికైనా అసలు డయాబెటిస్ ఉందో లేదో ముందే గుర్తించడం ఎలా? డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే... ఫలానా వ్యక్తికి డయాబెటిస్ సోకుతోందని ముందుగానే తెలుసుకోవడానికి ఉన్న చిట్కాలేంటి? ఇందుకు కొన్ని లక్షణాలుంటాయి. అవేంటో తెలుసుకుందాం.
- డయాబెటిస్ సోకోవారికి దాహం బాగా వేస్తూ ఉంటుంది. మాటిమాటికీ యూరిన్, టాయిలెట్‌కు వెళ్లేవారికి శరీరంలో వాటర్ లెవెల్స్ పడిపోతాయి. ఫలితంగా డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. అలా జరుగుతోందంటే... ఆ వ్యక్తికి డయాబెటిస్ ఉండే అవకాశాలు ఎక్కువ.
- డీహైడ్రేషన్ వల్ల... నోరు మాటిమాటికీ ఎండిపోతూ ఉంటుంది. నోటిలో ఉమ్మి అనేది లేకుండా పోతుంది. ఫలితంగా బ్యాక్టీరియా, క్రిముల వంటివి అక్కడే తిష్టవేస్తూ ఉంటాయి. అందువల్ల అలాంటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు నోటి నుంచీ దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్లు మౌత్ బ్రషింగ్ చేసుకున్న కొన్ని గంటల నుంచే చెడు వాసన సమస్య ఎక్కువగా ఉంటుంది.
- డయాబెటిస్ ఉన్నవారికి కెటోసిస్ అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో మన శరీరం శక్తి కోసం గ్లూకోజ్‌పై ఆధారపడకుండా... కొవ్వుపై ఆధారపడుతుంది. ఇలా జరిగేవారికి కీటోన్స్ అనే రసాయనం విడుదలవుతుంది. వాళ్లు విడిచిపెట్టే శ్వాస చెడు వాసన వస్తూ ఉంటుంది.
- ఉన్నట్టుండి బాగా బరువు తగ్గిపోతే... అది డయాబెటిస్ లక్షణం కావచ్చు. ఇలా ఎందుకంటే... బాడీకి కావాల్సినంత ఎనర్జీ లేకపోవడమే. ఎనర్జీ కోసం బాడీ... కండరాల్లో కొవ్వును వాడేసుకుంటుంది. ఫలితంగా బరువు వేగంగా తగ్గిపోతారు.
- కళ్లలో ద్రవాల సంఖ్య పెరిగితే... కంటి చూపు సరిగా కనిపించదు. షుగర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకుంటే... కళ్లు తిరిగి బాగానే కనిపిస్తాయి.
- డయాబెటిస్ ఉన్నవారికి గాయాలైతే... అవి మానడానికి చాలా టైమ్ పడుతుంది. చిత్రమేంటంటే... కొన్ని సార్లు తమకు గాయమైన ఫీలింగ్ కూడా వాళ్లకు కలగదు. నొప్పి తెలియదు. కారణం ఏంటంటే... రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. అందువల్ల త్వరగా గాయాలు నయం కావు.
- శరీరంలో పిండి పదార్థాలు గ్లూకోజ్‌లో కలిసిపోతాయి. ఫలితంగా శరీరంలో సరిపడా కార్బొహైడ్రేట్స్ ఉండవు. మన శరీర ఎనర్జీతో ఉండాలంటే కార్బోహైడ్రేట్స్ అందుబాటులో ఉండాలి. అలా లేకపోవడంతో... ఆ వ్యక్తులు నీరసంగా మారిపోతారు. ఊరికే నిస్సత్తువగా అయిపోతారు. వాళ్లు సరిపడా నిద్రపోయినా... అలసిపోయిన వాళ్లలాగే కనిపిస్తారు. ఆకలి కూడా ఎక్కువగానే ఉంటుంది.
- మెడ వెనక భాగంలో నల్లగా అవుతున్నా, చంకల్లో నల్లటి మచ్చలు ఏర్పడుతున్నా,... శరీరంలో సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి కావట్లేదని అర్థం. డయాబెటిస్ ఉన్నవారికి దురద, మంటలు, వాపులు, శరీరం కందిపోయినట్లు అవ్వడం వంటి లక్షణాలుంటాయి. ఈ లక్షణాలు కనిపించేవారు... ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ముందుగానే డయాబెటిస్‌ను గుర్తిస్తే... జరగబోయే తీవ్ర పరిణామాలను అడ్డుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diabetes, Health, Health Tips, Tips For Women, Women helath