సెక్స్ సామర్ధ్యం తగ్గిపోవడమన్నది ఈ రోజుల్లో కామన్ విషయం. పని ఒత్తిళ్లు, టెన్షన్లు ఇలా ఎన్నో కారణాలు... పటుత్వాన్ని తగ్గిస్తున్నాయి. ఐతే... హిమాలయాల్లో ఓ అరుదైన మొక్క (యర్సాగుంబా) సెక్స్ సామర్ధ్యాన్ని అమాంతం పెంచుతోంది. ఇప్పుడు దానికి ఉన్న డిమాండ్ ఎంత ఎక్కువంటే... అది బంగారం కంటే రేటెక్కువ. కేజీ రూ.60 లక్షలు అంటే నమ్మగలరా. అసలా మొక్క పుట్టుకే విచిత్రం. హిమాలయాల్లో తిరిగే ఒక జాతి గొంగళిపురుగులకు ఫంగస్ వ్యాపిస్తుంది. ఆ ఫంగస్ గొంగళి పురుగును తినేస్తూ... మొక్కగా ఎదుగుతుంది. ఈ ప్రక్రియ జరిగేందుకు 9 నెలలు పడుతుంది. ఈ మొక్కల్ని సేకరించే అక్కడి ప్రజలు వాటిని ఎండబెడుతున్నారు. అలా ఎండిన యర్సాగుంబాను తిన్నా, దాన్ని పొడిచేసుకొని తిన్నా, దాన్ని వంటల్లో వేసుకొని తిన్నా సెక్స్ సామర్ధ్యం బోల్డంత పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. ఆన్లైన్లో దొరుగుతున్న ఈ యర్సాగుంబా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండకపోవడం విశేషం.
శృంగార సామర్ధ్యం తక్కువగా వున్నవారికి అదిరిపోయే ఆయుర్వేద ఔషధంగా యర్సాగుంబా పనికొస్తోంది. ఎక్కువగా నేపాల్లో దొరికే ఓ ఔషధ మూలిక శృంగార సామర్ధ్యాన్ని విశేషంగా పెంచుతుందని డాక్టర్లు చెబుతున్నారు. నిజానికి యర్సాగుంబా అంత ఈజీగా దొరకదు. దాని కోసం నేపాలీలు పర్వతాలపై ఉదయం నుంచీ సాయంత్రం వరకూ వెతుకుతారు. అలా వెతికితే... ఒక్కో వ్యక్తికీ రోజుకి ఒకటీ లేదా రెండు మాత్రమే దొరుకుతాయి. అందుకే వాటి ధర బంగారం కంటే ఎక్కువగా ఉంది.
ఈ సహజ సిద్ధ వయాగ్రా గొప్పదనాన్ని తెలుసుకున్న చైనా... యర్సాగుంబాలను తెగ వాడేస్తోంది. వంటల్లో పొడి రూపంలో వేస్తున్నారు. చైనా తర్వాత ఇండియా, అమెరికా, యూరప్ దేశాలు దీన్ని ఎక్కువగా వాడుతున్నాయి. ఇది లైంగిక కోరికలు పెంచడానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని తేలింది. అందుకే దీనికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ వుంది.
లైంగిక సామర్ధ్యం పెంచడమే కాదు శరీరంలో చాలా రకాల జబ్బులకి ఇది ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆర్డరిచ్చుకోండి... రాత్రికి రెచ్చిపోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sexual Wellness