హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Coriander health benefits: కొత్తిమీరతో 8 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Coriander health benefits: కొత్తిమీరతో 8 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

కొత్తిమీరతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

కొత్తిమీరతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Health Benefits of Coriander : కొత్తిమీరను ఫ్లేవర్ కోసం కూరల్లో వేసుకుంటారు. ఐతే... కరివేపాకులా దాన్ని తీసిపారేయరు కాబట్టి... దాన్లో పోషకాలు శరీరానికి అందుతాయి. అందువల్ల కొత్తిమీరతో ఆరోగ్య ప్రయోజనాల్ని తెలుసుకుందాం.

కొత్తిమీర చాలా సున్నితమైనది. దాన్లో పోషకాలు పూర్తిగా అందాలంటే... కూర వండిన తర్వాతే కొత్తిమీర దానిపై చల్లాలి. అంతే తప్ప... కూర వండుతున్నప్పుడు... కొత్తిమీరను అందులో వేస్తే... ఆ ఆకులు అతి వేడికి ఉడికిపోయి... వాటిలో పోషకాలు ఆవిరి రూపంలో బయటకు పోతాయి. ఈ రోజుల్లో పుదీనాను నాన్ వెజ్ కూరల్లో వేసుకుంటున్నా... కొత్తిమీర, కరివేపాకును మాత్రం దాదాపు అన్ని కూరల్లో వాడుతున్నారు. అంతర్జాతీయంగా వాడే కొత్తిమీర అనేది... కొరియాండ్రమ్ సాతివమ్ జాతికి చెందిన మొక్క. దీన్ని చైనీస్ పార్స్‌లీ మొక్క అని కూడా అంటారు. చాలా మంది కొత్తిమీరను బయట కొనుక్కుంటారు. కానీ... ఇంట్లో ఇసుక ఉంటే... దాన్ని చిన్న తొట్టిలో వేసి... అందులో ఓ 20 ధనియాల గింజలు వేస్తే చాలు... రోజూ 10 చుక్కలు నీరు పోసినా చాలు... ఆటోమేటిక్‌గా కొత్తమీర మొక్కలు వచ్చేస్తాయి. 15 రోజుల్లో చక్కటి ఫ్లేవర్ ఇచ్చే కొత్తిమీర పెరుగుతుంది.

కొత్తిమీరతో ఆరోగ్య ప్రయోజనాలు :


1. బీపీని తగ్గిస్తుంది : హైబీపీ క్రమంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చేందుకు కారణమవుతుంది. ధనియాలు, కొత్తిమీర, ధనియాల నూనె వంటివి... బీపీని తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయుల్ని తగ్గించే విషయంలో కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తోందని పరిశోధనల్లో తేలింది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో కూడా కొత్తిమీర బాగా పనిచేస్తోంది.

2. విష వ్యర్థాలకు చెక్ : కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అవి మన శరీర కణాలను కాపాడతాయి. కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతియ్యకుండా చేస్తాయి. కడుపులో మంటల వంటివి తగ్గాలంటే కొత్తిమీర వాడాలి. కాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే... కొత్తిమీర వాడాలి.

3. గుండెకు మేలు : గుండె సంబంధిత జబ్బులు రాకుండా కొత్తిమీర కాపాడుతోంది. హైబీపీని కంట్రోల్‌లో ఉంచుతూ, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని క్రమబద్ధీకరిస్తుంది. బాడీలో అధికంగా ఉండే సోడియం (ఇది గుండెకు ప్రమాదం)ను బయటకు పంపేస్తుంది.

4. బ్రెయిన్‌ని కాపాడుతుంది : మన మెదడు చాలా సున్నితమైనది. రకరకాల వ్యాధులు దాన్ని నాశనం చెయ్యడానికి ఎదురుచూస్తూ ఉంటాయి. ముఖ్యంగా మతిమరపు, పార్కిన్‌సన్స్, అల్జీమర్స్ వంటివి ఏజ్ పెరుగుతున్న దశలో మెదడుపై దాడి చేస్తాయి. సరిగ్గా ఆ టైమ్‌లో కొత్తిమీర తీసుకుంటే... ఇక ఆ వ్యాధులు మన బ్రెయిన్ దరిచేరవు. నాడీ వ్యవస్థ దెబ్బతినకుండా కొత్తిమీర కాపాడుతుంది.

5. ఒత్తిడిని జయించవచ్చు : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ టెన్షన్ కామన్. ఇంట్లో వంట చేసే మహిళలు... తమ పిల్లలను స్కూల్‌కి పంపేందుకు, వాళ్లను రెడీ చేసేందుకు ఎంతో టెన్షన్ పడతారు. ఆఫీస్‌లో ఉద్యోగాలు చేసేవాళ్లు ఆ పనులు త్వరగా అవ్వక ఎంతో టెన్షన్ పడతారు. ఇలా ప్రతి ఒక్కరూ... ఒత్తిళ్లలోనే బతుకుతున్నారు. ఈ టెన్షన్ తట్టుకోవాలంటే కొత్తిమీర తినాలి. అందులో యాంటీఆక్సిడెంట్స్... బ్రెయిన్‌ను హీట్ ఎక్కకుండా చేస్తాయి. మెమరీ పవర్ పెంచుతాయి.

6. జీర్ణక్రియ మెరుగవుతుంది : కొత్తిమీర జీర్ణవ్యవస్థను కాపాడుతుంది. పేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది. మాటిమాటికీ కడుపునొప్పి వచ్చేవాళ్లు, మలబద్ధకంతో బాధపడేవాళ్లు... రోజూ కొత్తిమీర తినాలి. ఇలా 8 వారాలు తింటే... అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. చక్కగా ఆకలి వేస్తుంది... చక్కగా అరుగుతుంది కూడా.

7. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది : సూక్ష్మక్రిములతో పోరాడే లక్షణాలు కొత్తిమీరకు ఉన్నాయి. తినే ఆహారం కల్తీ అయితే... మన ప్రాణాలకే ప్రమాదం. అలాంటి సమయంలో... కొత్తిమీర తీసుకోవడం ద్వారా చాలా వరకూ ప్రాణాలు కాపాడుతుంది. అందులోని డోడెసెనాల్ అనే పదార్థం... బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమయ్యే సాల్మొనెల్లా బ్యాక్టీరియాకి కొత్తిమీర తగిలిందంటే... ఇక అది గిలగిలా కొట్టుకొని చస్తుంది.

8. స్కిన్‌ని కాపాడుతుంది : చర్మంపై దద్దుర్లు, మచ్చలు, మొటిమలు, గాట్లు, దెబ్బలు, గాయాలు, నీరు కారడం, ఉబ్బడం ఇలా ఏం జరిగినా... కొత్తిమీర తినేయాలి. అలా కొన్ని రోజులు తింటా వుంటే... చర్మం సంగతి అది చూసుకుంటుంది. ముఖ్యంగా పిల్లల చర్మ సంరక్షణలో కొత్తిమీర అత్యంత కీలకమైనది. విపరీతమైన ఎండల వల్ల చర్మం పాడవకుండా లోలోపల నుంచీ కొత్తిమీర కాపాడుతుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనం కొత్తిమీరను కూరల్లో వాడుకోవడం మేలే. రేటు ఎక్కువైనా... ఎంతో కొంత అలా వేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

First published:

Tags: Health, Health benifits, Health Tips, HOME REMEDIES, Tips For Women