HOME » NEWS » life-style » WHAT ARE THE BENEFITS IF YOU TAKE LIQUOR IN LITTLE QUANTITIES NK

మద్యం కొద్దికొద్దిగా తాగితే ఆరోగ్యానికి మేలా?

Health Tips : నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే చాలు... బీర్ బాటిళ్లు పొంగడం ఈ రోజుల్లో కామనైపోతోంది. చాలా మంది మద్యం తాగితే మంచిదే... కొద్దికొద్దిగా తాగితే ఆరోగ్యానికి మేలు అంటున్నారు. అందులో నిజమెంత?

news18-telugu
Updated: November 6, 2020, 8:08 AM IST
మద్యం కొద్దికొద్దిగా తాగితే ఆరోగ్యానికి మేలా?
ఆంధప్రదేశ్‌లో మందుబాబులకు వైఎస్ జగన్ ప్రభుత్వం మరో ఝలక్ ఇచ్చింది.
  • Share this:
Health Tips : మద్యం ఆరోగ్యానికి హానికరం అన్నారే గానీ... చిన్న మొత్తంలో తాగితే హాయికరం అని పరిశోధనల్లో రుజువు కాలేదు. తాజాగా తేలిందేంటంటే... మద్యం పెద్దగా తాగినా... కొద్దికొద్దిగా తాగినా... ఎలా తాగినా ఆరోగ్యం అటకెక్కినట్లే. మద్యం తాగితే డేంజరని అందరికీ తెలుసు... కానీ చాలా మంది తాగడమే గొప్ప విషయం అన్నట్లుగా తాగేస్తున్నారు ఈ రోజుల్లో. మద్యం తాగితే మన బాడీ బయట పెద్దగా మార్పులేవీ కనిపించవు కానీ... బాడీ లోపల ఉండే పార్టులకు తీవ్రమైన హాని తప్పదు. గుండె, ఊపిరి తిత్తులు, కాలేయం, పేగులు ఇలా కీలకమైన అవయవాలన్నీ దెబ్బతినేస్తాయి. మద్యం తాగుతూ పైకి హీరోలా ఉండే చాలా మందికి లోపల అడ్డమైన రోగాలూ ఉన్నట్లే లెక్క. ఏదో ఒక రోజు తేడా వచ్చి డాక్టర్ దగ్గరకు వెళ్తేగానీ అసలు విషయం తెలియదు.

తాజాగా జరిపిన అధ్యయనం వివరాల్ని ది లాన్సెట్ జర్నల్‌లో రాశారు. మన దేశంలో 2010 నుంచీ 2017 వరకూ చూస్తే... ఆల్కహాల్ వాడకం 38 శాతం పెరిగిందట. 2014లో ఏడాదికి 4.3 లీటర్లు తాగేవారు... ఇప్పుడు ఏడాదికి 5.9 లీటర్లు తాగుతున్నారు. ఇది మొత్తం జనాభాతో వేసిన యావరేజ్ లెక్క. ఐతే... జనాభాలో చాలా మంది మందు తాగనివాళ్లుంటారు. వాళ్లను పక్కన పెట్టి... ఈ యావరేజ్ లెక్కలు తీస్తే... పీపాలకు పీపాలు ఖాళీ అయిపోతున్న విషయం బయటపడుతుంది.

సిటీల్లో ఉండే చాలా మంది మందు తాగడాన్ని స్టేటస్ సింబల్ అనుకుంటున్నారు. అరేయ్... కొద్ది మొత్తాల్లో తాగితే ఏం కాదురా... అని తాము తాగుతూ పక్క వాళ్లనూ చెడగొడుతున్నారు. మద్యం అనేది ఒక్క చుక్క తాగినా అది అనారోగ్యమేనని తాజాగా పరిశోధకులు తేల్చారు. ఈసారి ఎవరైనా కొద్ది కొద్దిగా తాగితే ఏం కాదు అన్నారంటే... వాళ్లకు తత్వం బోధపడేలా చెయ్యాల్సిందే. ఎంత దారుణమంటే... మద్యం వల్ల మన శరీరంలో పాడవ్వని అవయవం ఒక్కటీ లేదని పరిశోధనల్లో తెలిసింది. మద్యం తాగుతూ ఉంటే... ముందుగా నాశనమయ్యేది లివరే. మీకు తెలుసా... మన బాడీలో అన్ని అవయవాల కంటే... చివరకు గుండె కంటే కూడా ముఖ్యమైన అవయవం లివరే. ఎందుకంటే లివర్ కంటిన్యూగా 700 రకాల పనులు చేస్తుంది. ఒక్క క్షణం లివర్‌ పనిచేయడం మానేసిందంటే... మన పని అయిపోయినట్టే. అంత ముఖ్యమైన అవయవాన్ని మద్యం కోసం నాశనం చేసుకోవడం ఎంతవరకూ కరెక్టో లిక్కర్ లవర్సే ఆలోచించుకోవాలి.

ఈసారి మీముందెవరైనా మద్యం తాగుతూ స్టైల్ కొడితే... వాళ్లను చూసి జాలి పడండి. ఎందుకంటే వాళ్లకు తెలియకుండానే వాళ్ల బాడీలో చాలా పార్టులు పాడైపోయి ఉండొచ్చు. మద్యం తాగనివాళ్లే అసలైన ఆరోగ్యవంతులని గుర్తుంచుకోండి అంటున్నారు డాక్టర్లు.


Pics : సొగసుల సన్నజాజి... సుజాకుమార్ క్యూట్ ఫొటోస్ఇవి కూడా చదవండి :

యూనివర్శిటీకి సాఫ్ట్ టాయ్స్ తెస్తున్న ప్రొఫెసర్... ఎందుకో తెలిస్తే మీరే మెచ్చుకుంటారు

Bigg Boss 3 | శ్రీముఖికి ప్లస్సా, మైనస్సా?

డయాబెటిస్ బాధిస్తోందా?... మీ లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు చెయ్యండి

Diabetes Diet : డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో తినగలిగే పండ్లు


Health Tips : ఫ్యాట్‌ని తగ్గించే ఫ్రూట్స్... తింటే ఎన్నో బెనిఫిట్స్...

Published by: Krishna Kumar N
First published: November 6, 2020, 8:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading