Home /News /life-style /

WHAT ARE FIVE TYPES OF CANCER TREATMENTS HOW MUCH COST FOR CANCER IN INDIA BA GH

క్యాన్సర్ వ్యాధిని నయం చేసేందుకు అందుబాటులో ఉన్న వివిధ రకాల ట్రీట్‌మెంట్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కీమోథెరపీ, రేడియేషన్ థెరపీతో పాటు కొందరికి సర్జరీ కూడా అవసరం కావచ్చు. క్యాన్సర్ రకం, ప్రమాద తీవ్రతను బట్టి బాధితులకు వివిధ రకాల చికిత్సలు చేయాల్సి ఉంటుంది. క్యాన్సర్‌కు చికిత్స అవసరమైనప్పుడు బాధితులు కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Andhra Pradesh | Telangana | Karnataka | Maharashtra
ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధికి అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. బాధితులకు ఉన్న క్యాన్సర్ రకం, అది ఏ దశలో ఉందనే వివరాల ఆధారంగా డాక్టర్లు ఈ వ్యాధికి చికిత్సను ఎంచుకుంటారు.  కొంతమంది క్యాన్సర్‌ బాధితులకు ఒకే రకమైన చికిత్స అందిస్తారు. కానీ చాలా మందికి రెండు, అంతకంటే ఎక్కువ రకాల ట్రీట్‌మెంట్స్ అవసరం కావచ్చు. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీతో పాటు కొందరికి సర్జరీ కూడా అవసరం కావచ్చు. క్యాన్సర్ రకం, ప్రమాద తీవ్రతను బట్టి బాధితులకు వివిధ రకాల చికిత్సలు చేయాల్సి ఉంటుంది. క్యాన్సర్‌కు చికిత్స అవసరమైనప్పుడు బాధితులు కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. వారు అయోమయానికి గురికావడం, ఆందోళన చెందడం సహజం. కానీ వైద్యులతో మాట్లాడటం, చికిత్స రకాల గురించి తెలుసుకోవడం వల్ల ఆందోళనలు దూరం చేసుకొని ట్రీట్‌మెంట్‌కు సిద్ధం కావచ్చు. ప్రస్తుతం క్యాన్సర్‌కు అందుబాటులో ఉన్న ప్రధాన ట్రీట్‌మెంట్స్ ఏవో తెలుసుకుందాం.

బయోమార్కర్ టెస్టింగ్

బయోమార్కర్ టెస్టింగ్ (Biomarker Testing) అనేది క్యాన్సర్ గురించి సమాచారాన్ని అందించే జన్యువులు, ప్రోటీన్లు, ఇతర పదార్ధాల (బయోమార్కర్స్ లేదా ట్యూమర్ మార్కర్స్ అని పిలుస్తారు) కోసం వెతకడానికి ఒక మార్గం. క్యాన్సర్ చికిత్సను ఎంచుకోవడంలో బాధితులకు, వైద్యులకు బయోమార్కర్ టెస్టింగ్ సహాయపడుతుంది.

Good Cholesterol: మంచి కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఇది శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది



కీమోథెరపీ (Chemotherapy)

ఈ విధానంలో క్యాన్సర్ కణాలను చంపడానికి మందులను ఉపయోగిస్తారు. క్యాన్సర్ కణాలు త్వరగా పెరుగుతూ కణ విభజన ద్వారా వృద్ధి చెందుతాయి. కీమోథెరపీ ఈ క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపుతుంది లేదా వాటి వృద్దిని మందగిస్తుంది. క్యాన్సర్‌ను నయం చేయడానికి, అది తిరిగి వచ్చే అవకాశాన్ని తగ్గించడానికి లేదా క్యాన్సర్ కణితి పెరుగుదలను ఆపడానికి లేదా మందగించడానికి ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు. నొప్పి, ఇతర సమస్యలను కలిగించే కణితులను తగ్గించడానికి కూడా కీమోథెరపీని ఎంచుకోవచ్చు.

షుగర్ ఎటాక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డయాబెటిస్‌ నివారణ పద్ధతులు ఏవి?



హార్మోన్ థెరపీ (Hormone Therapy)

కొన్ని క్యాన్సర్లు మానవ శరీరంలో వృద్ధి చెందడానికి హార్మోన్లపై ఆధారపడతాయి. దీంతో ఈ హార్మోన్లను నిరోధించేందుకు, క్యాన్సర్ల పెరుగుదలను ఆపడానికి కొన్ని ట్రీట్‌మెంట్స్ ఉపయోగిస్తారు. హార్మోన్లతో వచ్చే క్యాన్సర్‌కు చికిత్స అందించడాన్ని హార్మోన్ థెరపీ, హార్మోన్ల చికిత్స లేదా ఎండోక్రైన్ థెరపీ అంటారు. సెక్స్ హార్మోన్ల పెరుగుదలతో వచ్చే కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్‌లకు చికిత్స చేయడానికి హార్మోన్ థెరపీని ఎక్కువగా ఉపయోగిస్తారు. మరికొన్ని క్యాన్సర్లను కూడా హార్మోన్ థెరపీతో నయం చేయవచ్చు.

What is Mini Heart Attack: మినీ హార్ట్ ఎటాక్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?



హైపర్ థెర్మియా (Hyperthermia)

హైపర్ థెర్మియా అనే క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో క్యాన్సర్ కణజాలాన్ని 113 °F వరకు వేడి చేసి, కణాలను నిర్వీర్యం చేస్తారు. సాధారణ కణజాలానికి హాని కలగకుండా, క్యాన్సర్ కణాలను చంపడానికి ఈ ట్రీట్‌మెంట్‌ను ఉపయోగిస్తారు. క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన హైపర్ థెర్మియాను థర్మల్ థెరపీ, థర్మల్ అబ్లేషన్ లేదా థర్మోథెరపీ అని కూడా అంటారు. హైపర్ థెర్మియా చికిత్స కోసం వేడిని సృష్టించడానికి వివిధ రకాల టెక్నాలజీలను ఉపయోగించవచ్చు. రేడియో తరంగాలు లేదా రేడియో ఫ్రీక్వెన్సీ, లేజర్లు, అల్ట్రాసౌండ్.. వంటివి ఈ జాబితాలో ఉంటాయి. 



ఇమ్యునోథెరపీ (Immunotherapy)

ఇమ్యునోథెరపీ ద్వారా క్యాన్సర్ బాధితుల రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, క్యాన్సర్‌ కణాలను నిర్వీర్యం చేస్తారు. రోగనిరోధక వ్యవస్థ సహజంగానే మన శరీరం అంటువ్యాధులు, ఇతర ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇమ్యునోథెరపీ ద్వారా రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచి క్యాన్సర్ కణాలను నిరోధించవచ్చు. ఇది ఒక బయోలాజికల్ థెరపీ. అంటే క్యాన్సర్ చికిత్సకు జీవుల నుంచి తయారైన పదార్థాలను ఉపయోగించే ఒక రకమైన చికిత్స.

Soaked Fenugreek Water: మెంతులు నానబెట్టిన నీటిని ఇలా తాగండి.. మీ శరీరంలో ఊహించని అద్భుతాలు



ఫోటోడైనమిక్ థెరపీ (Photodynamic Therapy)

ఫోటోడైనమిక్ థెరపీ విధానంలో క్యాన్సర్, ఇతర అసాధారణ కణాలను చంపడానికి కాంతి (light) ద్వారా యాక్టివేట్ అయ్యే మెడిసిన్‌ను (drug) ఉపయోగిస్తారు. ఈ డ్రగ్‌ను ఫోటోసెన్సిటైజర్ లేదా ఫోటోసెన్సిటైజింగ్ ఏజెంట్ అంటారు. ఈ విధానంలో లైటింగ్ లేజర్ లేదా LED వంటి ఇతర సోర్స్ నుంచి రావచ్చు. ఫోటోడైనమిక్ థెరపీని PDT అని కూడా పిలుస్తారు. ఇది లోకల్ ట్రీట్‌మెంట్. శరీరంలోని నిర్దిష్ట భాగాన్ని ట్రీట్ చేయడానికి మాత్రమే ఈ విధానాన్ని పరిగణిస్తారు. 

రేడియేషన్ థెరపీ (Radiation Therapy)

రేడియేషన్ థెరపీ లేదా రేడియో థెరపీ విధానంలో క్యాన్సర్ కణాలను చంపడానికి, కణితులను కుదించడానికి ఎక్కువ మోతాదులో రేడియేషన్‌ను ఉపయోగిస్తారు. ఎక్స్-రే తీయడానికి కూడా తక్కువ మోతాదులో రేడియేషన్ ఉపయోగిస్తారు. కానీ క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కు మాత్రం చాలా పెద్ద మొత్తంలో రేడియేషన్‌ను వినియోగిస్తారు.

What is cholesterol : కొలెస్ట్రాల్ అంటే ఏంటి? అసలు ఇది ఎందుకు పెరుగుతుంది? దీన్ని ఎలా తగ్గించాలి?



స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ (Stem Cell Transplant)

కొన్ని రకాల క్యాన్సర్లకు ట్రీట్‌మెంట్‌గా అధిక మోతాదులో కీమోథెరపీ లేదా రేడియేషన్ థెరపీ చేసినప్పుడు స్టెమ్ సెల్స్ లేదా మూలకణాలు నాశనం కావచ్చు. ఇలాంటి వాటిని పునరుద్ధరించే (restore) ప్రక్రియను స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. ఈ మూలకణాలు మానవ శరీరాలకు ముఖ్యమైనవి. ఎందుకంటే అవి వివిధ రకాల రక్త కణాలుగా పెరుగుతాయి. వీటిలో తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్స్ వంటివి ఉంటాయి.

సర్జరీ (Surgery)

కొన్ని రకాల క్యాన్సర్లకు సర్జరీ చేసి రోగి శరీరం నుంచి క్యాన్సర్ కణితిని భౌతికంగా తొలగించవచ్చు. అయితే శరీరంలోని నిర్దిష్ట ప్రాంతంలో, ఒకేచోట ఏర్పడ్డ కణితిని మాత్రమే సర్జరీ ద్వారా తొలగించే వీలుంటుంది. అయితే లుకేమియా లేదా శరీరంలోని చాలా భాగాల్లో ఏర్పడే వివిధ రకాల క్యాన్సర్ కణితులను సర్జరీ ద్వారా తొలగించడం సాధ్యం కాదు. క్యాన్సర్‌కు సర్జరీ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ మార్గం ప్రామాణికంగా ఉంటుంది. 

Cancer Types: క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ ఎన్ని రకాలుగా వ్యాపిస్తుంది? 



టార్గెటెడ్ థెరపీ (Targeted Therapy)

టార్గెటెడ్ థెరపీ లేదా మాలిక్యులర్లీ టార్గెటెడ్ థెరపీ అనేది మరో రకమైన క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్. టార్గెటెడ్ థెరపీ కార్సినోజెనిసిస్, కణితి పెరుగుదలకు అవసరమైన నిర్దిష్ట మాలిక్యూల్స్ (అణువులు), ప్రోటీన్స్‌ను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ సమ్మేళనాలే క్యాన్సర్ కణాల వృద్ధిని, కణ విభజనను ప్రేరేపిస్తాయి. వీటిని టార్గెటెడ్ థెరపీ నిర్వీర్యం చేసి, మాలిక్యులర్ మెడిసిన్ రూపంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Breast cancer, Cancer, Health Tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు