Weight Loss: మీ పిల్లలు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేయండి

నేటి తరాన్ని పీడిస్తున్న సమస్యలలో ఊబకాయం ఒకటి. భారత్‌లో కూడా ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. పెద్దల్లో మాత్రమే కాకుండా పిల్లలు కూడా ఊబకాయంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి పిల్లలకు పరిష్కార మార్గం..

news18-telugu
Updated: September 18, 2020, 6:58 AM IST
Weight Loss: మీ పిల్లలు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేయండి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇప్పుడు బాల్య వయస్సులో చాలా మందిని పీడిస్తున్న సమస్య ఊబకాయం. మారిన జీవన శైలి, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుట్స్ తీసుకోవడం వంటి కారణాలతో చిన్న పిల్లలో ఊబకాయం సమస్య ఏర్పడుతోంది. ఈ సమస్యను అధిగమించడం ఎలా అన్న అంశంపై ఓ నిపుణుల బృందం పరిశోధన చేసింది.

ప్రొబయోటిక్ ఆహార పదార్థాల వల్ల కలిగే ప్రయోజానాల గురించి అందరికి తెలిసిందే. వాటిలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టిరీయాలు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా జీర్ణక్రియను, జీవక్రియను మెరుగుపరిచి మంచి ఆరోగ్యాన్ని అందించడానికి తోడ్పడుతాయి. అంతేకాకుండా అలర్జీని తగ్గించమే కాకుండా, శరీరంలో రోగ నిరోధక శక్తికి ఉపయోగకరంగా ఉంటాయి. ఈ పొషకాలు మనకు పెరుగు, బటర్ మిల్క్, పచ్చడి.. వంటి పులియబెట్టిన ఆహార పదార్థాలలో ఎక్కువగా ఉంటాయి.

ఇక తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో ప్రొబయోటిక్స్ వల్ల మరింత మేలు చేకూర్చే ప్రయోజనాలు ఉన్నట్టు స్పష్టమైంది. బాల్యం, కౌమార దశలో ఊబకాయంతో బాధపడుతున్నవారి బరువు తగ్గించడంలో ప్రొబయోటిక్స్ శక్తివంతంగా పనిచేస్తాయని వెల్లడైంది. ఈ అధ్యయనం ఫలితాలను యూరోపియన్ సొసైటీ ఆఫ్ ఎండోక్రినాలజీ-2020లో ప్రదర్శించారు. 6 నుంచి 18 సంత్సరాల మధ్య వయసు కలిగి ఊబకాయంతో బాధపడుతున్న 100 మందిపై ఈ పరిశోధన జరిపారు. దాదాపు 8 వారాల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు. క్యాలరీస్ నియంత్రిత ఆహారం ఇవ్వడంతోపాటుగా ప్రొబయోటిక్స్ అందజేశారు. ఇలా చేయడం ద్వారా జీవక్రియ శక్తివంతంగా మారి.. పిల్లలు, కౌమర దశలో ఉన్నవారు బరువు తగ్గారు. అలాగే పిల్లలో గుండెపోటు, డయాబెటిస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యల తీవ్రతను కూడా ప్రొబయోటిక్స్ తగ్గిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.

ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన పైమోంటే ఓరియంటల్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఫ్లావియా ప్రొడామ్ మాట్లాడుతూ.. పరిశోధనల తదుపరి దశలో గుర్తించబడిన కొందరు పేషెంట్లలో.. ప్రొబయోటిక్స్ ద్వారా మరింతగా బరువు తగ్గించేందుకు ప్రయత్నించనున్నట్టుతెలిపారు. జీవక్రియలో ప్రొబయోటిక్స్ పాత్రను మరింతగా అర్థం చేసుకోవాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు.
Published by: Narsimha Badhini
First published: September 18, 2020, 6:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading