Weight Loss : బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేస్తే బరువు తగ్గొచ్చు..

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో.. సమయానికి సరైన తిండి లేకపోవడం అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే ప్రతి రోజు ఆహారం తీసుకునేటప్పుడు పలు జాగ్రత్తలు పాటిస్తే.. ఫిట్‌గా ఉండటంతో పాటుగా, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

news18-telugu
Updated: September 11, 2020, 10:40 AM IST
Weight Loss : బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేస్తే బరువు తగ్గొచ్చు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో.. సమయానికి సరైన తిండి లేకపోవడం అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అలా ఎప్పుడు పడితే అప్పుడు అధిక కాలరీలు ఉండే ఆహారం తీసుకోవడం, అందుకు తగ్గ వ్యాయామం చేయకపోవడం.. అధిక బరువుకు దారితీస్తుంది. ప్రతి రోజు ఆహారం తీసుకునేటప్పుడు పలు జాగ్రత్తలు పాటిస్తే.. ఫిట్‌గా ఉండటంతో పాటుగా, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రతి రోజు నిర్ణీత సమయానికి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసేలా చూసుకోవాలి. ఈ మూడింటిని ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటే.. జీవక్రియ సక్రమంగా సాగడమేకాకుండా, బరువు తగ్గేందుకు మార్గం సుగమం అవుతోందని నిపుణులు చెబుతున్నారు.

బ్రేక్‌ఫాస్ట్..

రోజులో మనం తీసుకునే మొదటి ఆహారం బ్రేక్‌ఫాస్ట్. దీనితోనే మన జీవక్రియ ప్రారంభమవుతుంది. అందుకే మన శరీరానికి తగిన శక్తి నిచ్చేలా బ్రేక్‌ఫాస్ట్ ప్లాన్ చేసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఉండేలా జాగ్రత్త వహించాలి. ముందు రోజు రాత్రి సమయంలో చేసిన డిన్నర్‌కు, బ్రేక్‌ఫాస్ట్‌కు మధ్య కనీసం 12 గంటల గ్యాప్ ఉండేలా చూడాలి. ఇది బరువు తగ్గడానికి చాలా చక్కగా ఉపయోగపడుతోంది. ఇందుకోసం రాత్రి 8.30 గంటలకు డిన్నర్ చేయడం మంచిది. అలా చేయడం ద్వారా ఉదయం 8.30 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వీలవుతుంది. ఇక ప్రతి రోజు డెటాక్స్ వాటర్‌తో రోజును ముగించడం, అలాగే బ్రేక్‌ఫాస్ట్‌కు 15 ముందు మోస్తరుగా నీటిని తాగడం చాలా ఉత్తమమైనది.

లంచ్..
మధ్యాహ్నం తీసుకునే భోజనం చాలా ప్రధానమైనది అయినప్పటికీ.. బరువు తగ్గడంపై అది చాలా తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. లంచ్ సమయంలో మీకు ఏదైనా అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని కోరిక కలిగితే.. అది తక్కువ పరిమానంలో ఉండేలా చూసుకోవాలి. ఉదయం 8 గంటల సమయంలో బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తే.. మధ్యాహ్నం 1 నుంచి 2 రెండు గంటల మధ్య భోజనం తీసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం భోజనం సరిగా జీర్ణం కావడానికి దోహదపడుతుంది.

డిన్నర్..
రాత్రి పూట భోజనం ఎంత తొందరగా వీలైతే.. అంత త్వరగా పూర్తి చేయాలని నిపుణలు చెబుతున్నారు. నిద్రపోవడానికి రెండు, మూడు గంటల ముందు డిన్నర్ పూర్తి చేయడం ఉత్తమమైన పని. ఇలా చేయడం ద్వారా నిద్రపోవడానికి ముందే శరీరంలోని కొన్ని కాలరీలు కరిగిపోవడం జరుగుతుంది. ఇక, తినగానే నిద్రకు ఉపక్రమించడం వలన జీర్ణ ప్రక్రియ మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే ప్రశాంతంగా నిద్రించడం కష్టంగా మారవచ్చు. ఇది అధిక బరువుకు దారితీస్తుంది. అందుకే రాత్రి 8 గంటల సమయంలో డిన్నర్ చేయడం ద్వారా కాలరీలు కరిగించడంతో పాటు, రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
Published by: Narsimha Badhini
First published: September 11, 2020, 10:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading