Health Tips : బీట్‌రూట్ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారట..

ప్రతీకాత్మక చిత్రం

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగండి చెబుతున్నారు నిపుణులు. ఈ జ్యూస్‌ని తాగడం వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు అవేంటో చూడండి..

  • Share this:
కోయగానే ఎరుపు కలర్‌లో ఉండి కాస్తా రుచి తక్కువగా అనిపించే బీట్‌రూట్‌ని తినేందుకు ఎక్కువమంది ఇష్టపడరు. అయితే, ఈ వెజిటేబుల్‌ని మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి, బాడీలో రక్తశాతం పెంచుకోవాలనుకునేవారికి ఇది అద్భుత ఔషధమని చెబుతున్నారు. దీనిని నేరుగా తీసుకోవడం ఇష్టంలేకపోతే జ్యూస్, లస్సీ ఇలా లిక్విడ్స్ రూపంలో తీసుకొమ్మని చెబుతున్నారు.
దుంపల్లో శక్తినిచ్చేది ఏదిఅంటే తడుముకోకుండా బీట్ రూట్ అని చెప్పొచ్చి. ఇందులో నైట్రేట్ నిల్వలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా తీసుకోవాలని చెబుతున్నారు. రక్తప్రసరణ వేగాన్ని పెంచడంలో బీట్ రూట్ ముందుంటుంది. కాబట్టి ఆటలు ఆడేవారు ఆటలకు ముందు బీట్ రూట్ తీసుకోవడం వల్ల ఉపయోగముంటుంది. బీట్ రూట్ నిత్యం తీసుకునేవారిలో శారీరక దారుఢ్యం పెరుగుతుంది.

ముఖ్యంగా బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె సమస్యలు రావు. శరీరంలోని కొవ్వుని తగ్గించడంలో బీట్ రూట్ ముందుంటుంది. ఇందులోని విటమిన్ ఎ, బి, సి కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, బీటా కెరొటిన్, ఫోలిక్ యాసిడ్, పీచుపదార్థాలు మలబద్ధకాన్ని దూరం చేసి బరువుని తగ్గిస్తుంది.


ఇన్ని లాభాలున్న బీట్ రూట్‌ని రోజూ తీసుకోవడం చాలా మంచిది.

ఈ వీడియో కూడా చూడండి..
First published: