Health Tips : ఈ 6 మార్పులు చేసుకుంటే చాలు.. త్వరగా బరువు తగ్గుతారు..

బరువు తగ్గేందుకు ఎండాకాలం సరైన సమయం. ఈ టైంలో సూత్రాలను రెగ్యులర్‌గా పాటించడం వల్ల త్వరగానే బరువు తగ్గుతారని చెబుతున్నారు నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

Amala Ravula | news18-telugu
Updated: July 15, 2020, 7:46 AM IST
Health Tips : ఈ 6 మార్పులు చేసుకుంటే చాలు.. త్వరగా బరువు తగ్గుతారు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వాకింగ్ :  బరువు తగ్గాలనుకుంటే ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల చక్కని ఫలితముంటుంది. రోజుకి ఒంట్లోని కేలరీలు కరిగించడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. ఇందులో ముఖ్యంగా వాకింగ్ చేయడం వల్లహెల్దీ వెయిట్ సొంతమవ్వడమే కాకుండా మనసు, శరీరం ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. వాకింగ్ చేయడం వల్ల హైబీపీ, డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు రెగ్యులర్‌గా వాకింగ్ చేయాలి.

బ్రేక్‌ఫాస్ట్.. ప్రతీరోజూ మిస్‌కాకుండా ఉదయాన్నేహెల్దీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ శరీరంలోని జీవక్రియలను మెరుగుపరిచి బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.

ప్రోటీన్స్: హై ప్రోటీన్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషింస్తుంది. ఇందులోని పోషకాలు బరువు తగ్గించేందుకు మాత్రమే కాకుండా కండరాల బలాన్ని పెంచుతుంది. అదేవిధంగా.. ప్రోటీన్ మెటబాలిజం పెంపొందిస్తుంది. దీని వల్ల తక్కుగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది.

ఫైబర్ ఫుడ్ : ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఈ కారణంగా బెల్లీ ఫ్యాట్ తగ్గి స్లిమ్‌గా మారతారు. అదే విధంగా ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల కడుపు ఖాళీగా ఉన్న ఫీలింగ్ రాదు.

నీరు తీసుకోవడం : ఈ సమయంలో ఎక్కువగా నీరు చెమట రూపంలో శరీరంనుంచి బయటికి వెళ్తుంది. కాబట్టి నీటిని ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల కేలరీస్ కరిగి బరువు తగ్గుతారు.

సరైన నిద్ర : మంచి నిద్ర ఎప్పుడూ కూడా మంచి ఆరోగ్యాన్నిస్తుంది. అదేవిధంగా.. బరువు తగ్గించడంలో ముఖ్యపాత్రపోషిస్తుంది. నిద్రలేమి అధికబరువుకి కారణమవుతుంది. కాబట్టి నిద్ర ఎప్పుడూ కూడా తగ్గకుండా చూసుకోవాలి.

బరువు తగ్గించడంలో ఈ 6 సూత్రాలు ఏకాలంలోనైనా మెరుగైన ఫలితాలనే ఇస్తాయి. అయితే.. ఎండాకాలంలో వీటి ప్రభావం మరింత ఎక్కువగా ఉండి త్వరగా బరువు తగ్గుతారు.
Published by: Amala Ravula
First published: July 15, 2020, 7:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading