• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • WEARING TIGHT UNDERWEAR CAN CAUSE CHAFING AND IF BACTERIA AND MOISTURE BECOME TRAPPED AGAINST THE SKIN SSR

Underwear side Effects: కుర్రాళ్లు ఇలాంటి అండర్‌వేర్స్ వేసుకుంటే చివరికి జరిగేది ఇది..!

Underwear side Effects: కుర్రాళ్లు ఇలాంటి అండర్‌వేర్స్ వేసుకుంటే చివరికి జరిగేది ఇది..!

ప్రతీకాత్మక చిత్రం

మగవారిలో చాలామందికి టైట్ అండర్‌వేర్స్ ధరించే అలవాటు ఉంటుంది. దీనివల్ల ముప్పు పొంచి ఉందట. టైట్ అండర్‌వేర్స్ ధరించడం వల్ల శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోతుందట. భవిష్యత్‌లో సంతాన సామర్థ్యం తగ్గిపోతుందని తెలిసింది. దీనివల్ల మానసిక రుగ్మతలు పెరిగే...

  • Share this:
    మగవారిలో చాలామందికి టైట్ అండర్‌వేర్స్ ధరించే అలవాటు ఉంటుంది. దీనివల్ల ముప్పు పొంచి ఉందట. టైట్ అండర్‌వేర్స్ ధరించడం వల్ల శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోతుందట. భవిష్యత్‌లో సంతాన సామర్థ్యం తగ్గిపోతుందని తెలిసింది. దీనివల్ల మానసిక రుగ్మతలు పెరిగే అవకాశముందని తేలింది. అంతేకాదు, ఆఫీసుకెళ్లే ప్రతీ ఒక్కరూ హుందాగా కనిపించడం కోసం మెడకు టై కట్టుకుంటుంటారు. ఇలా టై కట్టుకుని రాకపోతే అడుగుపెట్టనివ్వని ఆఫీసులు కూడా ఉన్నాయి. అయితే మెడకు బిగుతుగా టై కట్టుకోవడం వల్ల అనేక నష్టాలున్నాయట. మెదడుకు, కళ్లకు రక్తప్రసరణ నెమ్మదిస్తుందట. దానివల్ల రాబోయే రోజుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు, ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని తేలింది.

    అంతేకాకుండా గ్లకోమాకు దారితీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాశ్చాత్య సంస్కృతి పుణ్యమా అని మన దేశంలో జీన్స్ ధరించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా టైట్ జీన్స్ ధరించడం ఫ్యాషనైపోయింది. వీటిని ధరించడం వల్ల కాళ్లకు రక్తప్రసరణ తగ్గిపోతుందట. దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయని తెలిసింది.

    టైట్ జీన్స్ ధరించడం వల్ల వృషణాలు కుచించుకుపోయి... శృంగారపరమైన సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు