Health Tips : ఆ టైమ్‌లో మేకప్ వేసుకుంటే అంతే..

చాలామందికి మేకప్ వేసుకోవడం అలవాటు. అన్ని సందర్భాల్లోనూ మేకప్ వేసుకుంటారు. అయితే, ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు మేకప్ వేసుకోవడం వల్ల ఆ ప్రభావం పుట్టే పిల్లలపై పడుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి..

Amala Ravula | news18-telugu
Updated: June 26, 2019, 10:03 AM IST
Health Tips : ఆ టైమ్‌లో మేకప్ వేసుకుంటే అంతే..
మేకప్ విషయంలో జాగ్రత్త
Amala Ravula | news18-telugu
Updated: June 26, 2019, 10:03 AM IST
మేకప్ అనేది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. బయటికి వెళ్లాలంటే చాలు కొద్దిపాటి మేకప్ అయినా వేసుకుని వెళ్తుంటారు మహిళలు. దీనివల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రెగ్నెన్సీ టైమ్‌లో వేసుకుంటే ఆ ప్రభావం మనకంటే ఎక్కువగా పుట్టే పిల్లలపై పడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

సాధారణంగా గర్భం దాల్చాక డాక్టర్లు ఇచ్చే మందులు తప్పా వేరేవి వేసుకోకూడదు.. జలుబు, దగ్గు వంటి సమస్యలకు కూడా మందులు వాడితే.. కడుపులో ఉండే చిన్నారిపై ప్రభావం పడుతుందంటారు. మరి మేకప్ వేసుకోవడం చర్మానికే కదా.. ఆ ప్రభావం ఉంటుందా? అని అంటే.. ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు.


ఈ సమస్యపై ఇప్పటికే అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ కొంతమందిపై పరీక్షించింది. ఇందులో తేలిన విషయమేంటంటే.. కడుపుతో ఉన్న మహిళలు మేకప్ వేసుకోవడం వల్ల.. వారికి పుట్టిన పిల్లలు చురుగ్గా లేకపోవడం.. తమ పనులు తామే చేసుకోలేకపోవడాన్ని గుర్తించారు. అంతేకాదు.. ఆత్మన్యూనత, ఆ:దోళన వంటి అదనపు సమస్యలు అంటూ చెబుతున్నారు.

కాబట్టి.. లిప్‌స్టిక్, మాయిశ్చరైజర్లు, ఇతర మేకప్ ఐటెమ్స్‌కి ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎంత దూరముంటే అంతమంచిదని చెబుతున్నారు.



ఈ వీడియో కూడా చూడండి..
First published: June 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...