మహిళల కోసం ఇక 'పీరియడ్ ఎమోజీ'..

పీరియడ్ ఎమోజీ కోసం 2017లో యూకె హ్యుమానిటేరియన్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఎమోజీ ఆకారానికి సంబంధించి నెటిజెన్స్ అభిప్రాయాలను సేకరించింది. మెజారిటీ నెటిజెన్స్ సూచన మేరకు ఈ కొత్త ఎమోజీని తీసుకొచ్చింది.

news18-telugu
Updated: February 9, 2019, 4:02 PM IST
మహిళల కోసం ఇక 'పీరియడ్ ఎమోజీ'..
పీరియడ్ ఎమోజీ
news18-telugu
Updated: February 9, 2019, 4:02 PM IST
స్త్రీల రుతుస్రావాన్ని సూచించే 'పీరియడ్ ఎమోజీ' ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. చిన్న రక్తపు చుక్క ఆకారంలో ఉన్న ఆ ఎమోజీని యూకె హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది. గత కొంతకాలంగా రుతుస్రావంపై ఈ సంస్థ సోషల్ మీడియాలో విస్తృత క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఈ కొత్త ఎమోజీ త్వరలోనే అన్ని స్మార్ట్ ఫోన్లలో అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.

యునికోడ్ కన్సార్షియం గురువారం(ఫిబ్రవరి 8) 'పీరియడ్ ఎమోజీ'కి ఆమోద ముద్ర వేసింది. దాంతో పాటు మరో 229 ఎమోజీలకు కూడా ఆమోదం లభించింది. వీటిల్లో వికలాంగులకు సంబంధించిన కొన్ని ఎమోజీలు కూడా ఉన్నాయి. కాగా, రుతుస్రావం గురించి మాట్లాడటానికి, చర్చించడానికి ఇప్పటికీ వెనుకాడే సమాజంలో మార్పు కోసమే పీరియడ్ ఎమోజీని తీసుకొస్తున్నట్టు యూకె హ్యుమానిటేరియన్ సంస్థ వెల్లడించింది. ఇలాంటి ఎమోజీల ద్వారా రుతుస్రావం చుట్టూ ఉన్న నిగూఢ భావనలు బద్దలవుతాయని.. తద్వారా దానిపై సాధారణ చర్చలకు ఆస్కారం ఏర్పడుతుందని సంస్థ తెలిపింది.

పీరియడ్ ఎమోజీ కోసం 2017లో యూకె హ్యుమానిటేరియన్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఎమోజీ ఆకారానికి సంబంధించి నెటిజెన్స్ అభిప్రాయాలను సేకరించింది. మెజారిటీ నెటిజెన్స్ సూచన మేరకు ఈ కొత్త ఎమోజీని తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 800 మిలియన్ల మహిళల భావోద్వేగానికి ఇది అద్దం పడుతుందని సంస్థ తెలిపింది.First published: February 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...