Long Hair: మీ జుట్టు పొడవుగా, దృఢంగా మారాలా..? అయితే ఈ వంటింటి చిట్కాలు మీ కోసమే...

Tips For Long Hair: అమ్మాయిలకు జుట్టే అందం. పొడవు జుట్టు ఉన్న అమ్మాయికి జడే అందం. కానీ మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం, ఆహారపు అలవాట్లు.. వంటి వివిధ కారణాలతో పొడవు జుట్టు చూద్దామంటే కూడా కనిపించడం లేదు. పొడవైన, దృఢమైన కురుల కోసం ఈ చిట్కాలు పాటించండి.

news18
Updated: November 27, 2020, 4:36 PM IST
Long Hair: మీ జుట్టు పొడవుగా, దృఢంగా మారాలా..? అయితే ఈ వంటింటి చిట్కాలు మీ కోసమే...
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 27, 2020, 4:36 PM IST
  • Share this:
ఈ మధ్య కాలంలో చాలా మంది Hair loss సమస్యతో బాధపడుతున్నారు. కాలుష్యం, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్య కనిపిస్తోంది. ఈ సమస్య నుంచి బయట పడటానికి కొందరు వేలకు వేలు పోసి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఇంకొందరు రకరకాల హెయిర్ ఆయిల్స్, షాంపులు వాడుతుంటారు. అలా కాకుండా, కొన్ని జాగ్రత్తలతో సులభంగా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఈ చిట్కాలు మీ కురులను పటిష్టంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడతాయి. అవేంటో ఓ లుక్కేద్దాం. ఈ  చిట్కాలను పాటించి అందమైన, పొడవైన జుట్టును మీ సొంతం చేసుకోండి.

1. రెగ్యులర్ గా హెడ్, స్కాల్ప్ మసాజ్ చేసుకోండి

చాలా మంది జుట్టును కాపాడుకోవడం కోసం తరచూ తలకు నూనె పెట్టుకుంటుంటారు. ఎందుకంటే తలకు కొబ్బరి నూనె పట్టించి, కొద్ది సేపు మసాజ్ చేసుకుంటే హాయిగా ఉండటమే కాకుండా వెంట్రుకలు బాగా పెరుగుతాయని నమ్ముతారు. సహజంగా శరీరంలోని ఏదైనా భాగాన్ని మసాజ్ చేయడం ద్వారా ఆ ప్రాంతానికి విశ్రాంతినివ్వడమే కాక, రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాక, ఆ ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని పెంచడానికి ఇది ఒక గొప్ప మార్గంగా పరిగణించవచ్చు. అదేవిధంగా, ఇందులేఖ హెయిర్ ఆయిల్‌తో వారానికి ఒకసారి తలపై మసాజ్ చేసుకుంటే జుట్టు కుదుళ్లు బలోపేతమవ్వడమే కాకుండా అది మీ జుట్టు పెరుగుదలను సహకరిస్తుంది. ఇందులేఖ బ్రింగా ఆయిల్ కేవలం జుట్టు రాలడాన్ని ఆపడమే కాకుండా కొత్త జుట్టును పెంచుతుందని వైద్యపరంగా నిరూపించబడింది.

ఇది కూడా చదవండి Weight Loss Tips: బరువు తగ్గడానికి వాకింగ్ చేస్తున్నారా...? అయితే ఈ చిట్కాలు పాటించండి

2. మీ ఇంటిని హెయిర్ స్పాగా చేసుకోండి

జుట్టు పొడిగా, దెబ్బతిన్నట్లుగా ఉంటే ముఖం ప్రకాశవంతంగా కన్పించదు. అంతేకాక జుట్టు మీరు కోరుకున్న విధంగా పెరగదు. అందువల్ల, జుట్టు మెరుపును తిరిగి పొందడానికి మీ ఇంట్లోనే స్వయంగా హెయిర్ మాస్క్ను ప్రయత్నించండి. దీనికి గాను మీ వంటగదిలోని కొన్ని ఉత్తమ పదార్ధాలను ఉపయోగించండి. హెయిర్ మాస్క్‌ చికిత్స కురులను బలోపేతం చేయడమే కాకుండా, మీ జుట్టుపై ఉండే తేమను పునరుద్ధరిస్తుంది. ఇది మీ జట్టు చివర్లలో ఉండే స్ప్లిట్లను కత్తిరించకుండా నిరోధిస్తుంది.

3. మీ జుట్టుకు సరైన ఆయిల్ను ఎంచుకోండి

మీ జుట్టుకు సరైన ఉత్పత్తులు వాడితే అది బలంగా, ఆరోగ్యంగా ఉంటుందని గ్రహించండి. అయితే, ఏ ఏ పదార్థాలను ఉపయోగించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాగా, జుట్టు పెరుగుదలకు మీరు తరచుగా ఉపయోగించే ఉత్పత్తులలో హానికరమైన పదార్థాలు ఉండవచ్చు. అవి మీ కురులను పొడిబారేలా, పెళుసుగా మార్చి జుట్టు కొనలను విచ్ఛిన్నం చేస్తాయి. తద్వారా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల మీ జుట్టు దృఢత్వానికి సహజ పదార్ధాలను కలిగి ఉన్న ఇందులేఖ వంటి ఉత్పత్తులను ఎన్నుకోవడం శ్రేయస్కరం. ఇందులేఖ కృత్రిమ రంగులు లేదా సుగంధాలు ఉండని సహజ ఆయుర్వేద ఉత్పత్తిగా చెప్పవచ్చు. ఇందులేఖ బ్రింగా ఆయిల్, షాంపూలో భ్రిన్‌రాజ్, ఆమ్లా, తులసి, వేప వంటి పదార్థాలు ఉంటాయి. అందువల్ల ఎటువంటి దుష్ప్రభావాలకు లోనవ్వకుండా మీ జుట్టు దృఢంగా మారుతుంది.
Published by: Srinivas Munigala
First published: November 27, 2020, 4:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading