శృంగారం(sex) అనే పవిత్ర కార్యంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అపోహలు, అవగాహణ లేమితో అనేక మంది ఇబ్బందులు పడుతుంటారు. దీంతో తమ భాగస్వామితో ఈ కార్యాన్ని ఆస్వాదించలేకపోతారు. అయితే, స్త్రీ, పురుషుల ఇద్దరిలోనూ ఒకేరకమైన భావాలు ఉండకపోవచ్చు. మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో కొంత మంది స్త్రీలు శృంగారానికి విముఖత చూపిస్తుంటారు. తద్వారా శృంగారాన్ని(sex) అమితంగా ఆస్వాదించలేరు. శృంగారంలో భాగస్వాము(partner)ల ఇద్దరి పాత్రా కీలకం. ఒకరినొకరు ఇష్టపడి రతి క్రీడలో మునిగినప్పుడే అసలైన అనుభూతి కలుగుతుంది. కాబట్టి, వారితో బలవంతంగా శృంగారంలో పాల్గొనకుండా, వారిని మీ దారికి తెచ్చుకునేలా ప్రయత్నించండి. ఒక వేళ మీలోనే శృంగార కోరిక(sex feelings) లు తగ్గితే ఈ క్రింది పద్దతులను అనుసరించి సంతృప్తి పొందండి.
విశ్రాంతి తీసుకోండి
మీ భాగస్వామి(partner) శృంగారం కొత్త అయితే, దూకుడుగా వ్యవహరించకండి. కాస్త విశ్రాంతి(relax) తీసుకొని వారితో చక్కగా సంభాషిస్తూ వారిని మీ దారికి తెచ్చుకోండి. శృంగారం కోసం నేరుగా మీ మంచంపైకి దూకకుండా, మొదట వారితో రొమాన్స్(romance) చేయండి. వారిలో లైంగిక కోరిక(mood) కలిగే వరకు ప్రయత్నించండి. అయినప్పటికీ, వారు శృంగారం పట్ల విముఖత చూపిస్తే సుదీర్ఘ స్నానం(long bath), పుస్తక పఠనం, కప్పు టీ(cup of tea) పట్టువంటి పనుల్లో బిజీ అవ్వండి.
కలిసి వంట చేయండి
మీ భాగస్వామి(partner) శృంగారం(sex ) పట్ల విముఖత చూపించిన సందర్భంలో వారికి దూరమవ్వకుండా, వారు చేసే పనుల్లో మీరు కూడా పాల్పంచుకోండి. మీరిద్దరూ ఇంతకు ముందెన్నడూ చేయని వంటకాల(cuisine )ను ప్రయత్నించండి. అంతేకాక, ఇద్దరూ కలిసి భోజనం చేయండి. దీంతో మీ పట్ల వారిలో ఇష్టం పెరిగి మీ మెరుగైన రాత్రికి సహాయపడుతుంది. ఈ విషయాలన్నీ మీ భాగస్వామి(partner)తో మీరు లోతైన స్థాయిలో కనెక్ట్ అవ్వడానికి నిజంగా సహాయపడతాయి. తద్వారా ఎటువంటి చింత లేకుండా గొప్ప శృంగారాన్ని ఆస్వాదించవచ్చు.
శృంగార కంటెంట్ ను చూడండి
మీ భాగస్వామి శృంగారం పట్ల విముఖత చూపించిన సందర్బంలో, వారిని ఒత్తిడికి గురిచేయకుండా లైంగికంగా ఉత్తేజపరిచే సినిమాల(romantic movies)పై దృష్టి పెట్టండి. లేదంటే, శృంగార నవలల(romance novels) ను చదవండి. ఇది మీకు కొంతమేర మానసిక ప్రశాంతతను చేకూర్చుతుంది.
సెక్స్ టాయ్స్ ను ప్రయత్నించండి
సెక్స్ టాయ్స్(sex toys) మీకు భాగస్వామి(partner)తో చేసిన ఆనందాన్ని ఇవ్వనప్పటికీ, మీకు మానసిక ఆనందాన్ని చేకూర్చడానికి ఉపయోగపడుతాయి. అందువల్ల, మీ భాగస్వామి శృంగారం(Sex ) పట్ల విముఖతగా ఉన్నప్పుడు సెక్స్ టాయ్స్ వైపు వెళ్లడం గొప్ప మార్గంగా చెప్పవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sex, Sexual Wellness