WATER BOTTLES ARE FERTILE GROUNDS FOR GERMS CLICK HERE TO KNOW WHAT EXPERTS SAYS AND HOW YOU CAN CLEAN THEM PRV GH
Water Bottles: మీ ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటే జాగ్రత్త.. వాటిలోకీ చేరుతున్న క్రిములు.. వాటిని ఎలా క్లీన్ చేయాలంటే..?
(ప్రతీకాత్మక చిత్రం)
తరచుగా ఉపయోగించే బాటిల్స్‌ను పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే బాటిల్స్ లోపలి భాగం తడిగా, చీకటిగా ఉంటుంది. బ్యాక్టీరియా, పాచి పెరిగేందుకు ఇవి అనుకూలంగా ఉంటాయి.
చాలా మంది బయటకు వెళ్తే వెంట వాటర్ బాటిల్ (water bottle) తీసుకెళ్తుంటారు. ఇలా తీసుకెళ్లేందుకు వీలుగా అనేక రకాల డిజైన్లతో కూడిన వాటర్ బాటిల్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. బరువు తక్కువ, తీసుకెళ్లడం ఈజీగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఫైబర్, స్టీల్ లేదా కాపర్ బాటిల్స్ ప్రిఫర్ చేస్తుంటారు. సాధారణంగా చాలా మంది రీయూజబుల్ బాటిల్స్ (Reusable bottles) వాడుతుంటారు. ఆరోగ్యానికి (Health) ఇవి అనుకూలంగా ఉండటమే కాదు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిల్స్‌ను అరికట్టి పర్యావరణానికి (Environment) ఇవి మేలు చేస్తాయి. అయితే తరచుగా ఉపయోగించే బాటిల్స్‌ను పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే బాటిల్స్ లోపలి భాగం తడిగా, చీకటిగా ఉంటుంది. బ్యాక్టీరియా, పాచి పెరిగేందుకు ఇవి అనుకూలంగా ఉంటాయి. అందుకే వీటిని కడుగుతూ (washing) ఉండటం చాలా ముఖ్యం.
వాటర్ బాటిల్లో రోజూ నీళ్లు నింపుతుంటే, ఉపయోగించిన ప్రతిసారి లేదా కనీసం రోజుకు ఒకసారి అయినా వాటిని కడగాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని ఎకో-ఫ్రెండ్లీ డిష్ సోప్ (Eco-friendly dish soap) ఉపయోగించి బాటిల్ బ్రష్‌తో బాగా కడగాలి. బ్రష్ బాటిల్ అన్ని మూలలకు (Every angle or side) తిప్పాలి. బాగా వేడి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి గాలికి (Air) ఆరబెట్టాలి. అయితే వన్ టైమ్ యూజ్ (One time use) వాటర్ బాటిల్స్‌ను రోజువారీ అవసరాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. క్వాలిటీ ఉండే బ్రాండెడ్ (Branded), రీయూజబుల్ బాటిల్స్‌ను మాత్రమే వాడాలి.
* వాటర్ బాటిల్ ఎలా కడగాలంటే?
మీ వాటర్ బాటిల్ (water bottle) తీసుకొని దాన్ని ఎంత వీలైతే అంతా వేరు చేయండి. అంటే మూత, లోపల స్ట్రా, గ్యాస్కెట్ లాంటివి ఉంటే అన్ని బయటకు తీయండి. ఇప్పుడు ఆ బాటిల్లో వేడి నీళ్లు (Hot water) నింపి దాంట్లో కొంచెం డిష్ సోప్ వేయండి. వేరు చేసిన భాగాలు వేడి నీళ్లు, సబ్బు కలిపిన పాత్రలో నానబెట్టండి. ఇప్పుడు ఏదైనా పాత బ్రష్ తీసుకొని బాటిల్‌ను వేడి నీళ్లతో శుభ్రంగా కడగండి. బాటిల్ నుంచి తీసిన భాగాలను కూడా ఇలాగే బ్రష్ (brush)తో రాసి కడగాలి. లోపలి భాగమే కాదు బాటిల్ వెలుపలి వైపు కూడా కడగటం చాలా ముఖ్యం. చెమట చేతులు, అవి ఇవి ముట్టుకొని అదే చేతులతో మనం చాలాసార్లు వాటర్ బాటిల్స్ పట్టుకుంటూ ఉంటాము కాబట్టి వెలుపలి వైపు కడగటం (Outside cleaning) కూడా చాలా ముఖ్యం. బాటిల్ సైజ్‌తో సంబంధం లేకుండా బాటిల్స్‌ను తరచూ పరిశుభ్రంగా కడగాలని (Clean) నిపుణులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.