Home /News /life-style /

Skin care for face: మీ ముఖం కాంతివంతంగా ప్రకాశించాలా? అయితే కేవలం తమలపాకులు చాలు.. ఇలా చేయండి

Skin care for face: మీ ముఖం కాంతివంతంగా ప్రకాశించాలా? అయితే కేవలం తమలపాకులు చాలు.. ఇలా చేయండి

ప్రతీకాత్మ క చిత్రం

ప్రతీకాత్మ క చిత్రం

కొన్ని పద్దతులతో (skin car for face) మన ముఖాన్ని అందంగా (beautiful), ప్రకాశవంతంగా (brighten) చేసుకోవచ్చు. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఐతే... తమలపాకులతో (Betel) మన చర్మం మెరుస్తుంది అనే విషయం చాలా మందికి తెలియదు.

    చాలా మంది అందం (beauty)గా లేమని బాధపడుతూ ఉంటారు కూడా. ఆత్మన్యూనతా భావంలోకి వెళతారు. అయితే వారి చర్మంలో కాంతి ఉంటే అందంగా కనిపిస్తారు. అయితే ముఖంపై నల్లటి మచ్చలు (Black spots) వారి ముఖాన్ని అందంగా కనిపించకుండా అడ్డుకుంటాయి. ఏదో క్రీములు (creams) వాడి వాటిని కనిపంచకుండా చేసినా.. అది ఆ సమయం వరకే. మళ్లీ ముఖం కడుక్కుంటే మచ్చలే (Black spots)  కనిపిస్తాయి. దాచితే దాగినవి మచ్చలు.  వీలైనంత వరకు అందంగా తయారవ్వాలని ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటుంటారు. కొన్ని పద్దతులతో (skin car for face) మన ముఖాన్ని అందంగా (beautiful), ప్రకాశవంతంగా (brighten) చేసుకోవచ్చు. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం..

    తమలపాకుల్లో యాంటీఆక్సిడెంట్స్..

    తమలపాకులను (Betel) కిళ్లీ కోసమే కాదు... పూజకు, శుభకార్యాలకు కూడా వాడుతారు. అందువల్ల వాటికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఐతే... తమలపాకులతో (Betel) మన చర్మం మెరుస్తుంది అనే విషయం చాలా మందికి తెలియదు. తమలపాకుల్లో యాంటీఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అవి చర్మంపై (skin) ఉండే మృత కణాలను తొలగిస్తాయి. మృతకణాలు తొలగిపోగానే... చర్మానికి స్వేచ్ఛ లభించినట్లు అవుతుంది. వెంటనే కొత్త కణాలు... మెరుస్తూ పుడతాయి. ఇలా సరికొత్త మెరిసే చర్మం (bright skin) వస్తుంది. అలా వచ్చేందుకు తమలపాకుల్లోని పోషకాలు సహకరిస్తాయి.

    ఓ టీ స్పూన్ తెనె (honey)ను తమలపాకులకు రాసి... వాటిని ముఖానికి అద్దుకోండి. ఓ పావు గంట అలా ఉండండి. తర్వాత వాటిని తొలగించి... కొద్దిగా వేడిగా ఉన్న నీటితో కడగండి. లేదంటే... తమలపాకులను జ్యూస్‌లా చేసి... ఆ రసంలో తేనె కలిపి కూడా పేస్టులా రాసుకోవచ్చు. ఎలా చేసినా మేలే జరుగుతుంది.

    ఇలా వారానికి రెండు సార్లు చెయ్యాలి. తద్వారా కొత్త చర్మం రావడమే కాదు... కాంతివంతమైన స్కిన్ వస్తుంది. పైగా ఎంతో మృదువుగా ఉంటుంది కూడా తమలపాకులను నీటిలో ఉడికించి... ఆ నీరు చల్లారిన తర్వాత ముఖాన్ని కడుక్కుంటే కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇలా ఎన్నిసార్లు చేస్తే... అంతలా ముఖం మెరుస్తుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

    ఇవి కూడా చదవండి:  మీ మోకాళ్ల అందం తగ్గిపోతుందా? నల్లగా మారుతున్నాయా? అయితే ఇలా చేసి సమస్య దూరం చేసుకోండి

     చర్మంలో మెరుపు తగ్గిపోయిందా? ఆవిరితో మీ చర్మం కాంతివంతంగా మార్చుకోవచ్చు.. ఇలా చేయండి
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Beauty tips, Skin care

    తదుపరి వార్తలు