Healthy Tea : రోజూ ఈ టీ తాగితే... సీజనల్ రోగాలన్నీ పరార్... ఇలా చెయ్యండి.

గ్రీన్ టీ, బ్లాక్ టీ, పింక్ టీ, ఐస్ టీ... ఇలాంటివి టేస్ట్ చూసీ చూసీ రొటీన్ అనిపిస్తోందా... అయితే... ఈ కొత్త టీ ట్రై చెయ్యండి... ఆరోగ్యానికి చాలా మంచిది.

news18-telugu
Updated: July 5, 2020, 2:51 PM IST
Healthy Tea : రోజూ ఈ టీ తాగితే... సీజనల్ రోగాలన్నీ పరార్... ఇలా చెయ్యండి.
రోజూ ఈ టీ తాగితే... సీజనల్ రోగాలన్నీ పరార్... (credit - twitter)
  • Share this:
మన నాలిక తుంటరిది. దానికి ఎప్పుడు కొత్త రుచులు కావాలని అడుగుతూ ఉంటుంది. అందుకే కంపెనీలు రకరకాల టీలను తయారుచేస్తున్నాయి. ప్రపంచంలో మంచినీళ్ల తర్వాత ఎక్కువ మంది తాగేది టీనే. ముఖ్యంగా మన దేశంలో టీ ఏకంగా జాతీయ పానీయం అయ్యింది. రాన్రానూ ఈ టీలలో కొత్త కొత్త రకాలను తయారుచేస్తున్నారు. టేస్టుతోపాటూ... సువాసన కూడా వేర్వేరుగా ఉండేలా చేస్తున్నారు. కొందరికి తియ్యటి పాలతో చేసిన టీ నచ్చితే, మరికొందరికి స్పైసీ టీలు నచ్చుతాయి. ఇంకొందరికి పుల్లటి టీలు టేస్టీగా ఉంటాయి. చిక్కగా, కమ్మగా, స్ట్రాంగ్‌గా ఎవరికి నచ్చినట్లు వారు టీ చేసుకోవచ్చు.

కొంత మంది మేం టీ తాగం అంటారు. కానీ టీ తాగితే ఎంతో మేలు. ఎందుకంటే తేయాకులో యాంటీఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అవి మన శరీరంలో విష వ్యర్థాలను తరిమేస్తాయి. చైతన్యం తెస్తాయి. రీఫ్రెష్ కలిగిస్తాయి. గ్రీన్ టీ లాంటివి... అధిక బరువును తగ్గిస్తాయి. అదే అల్లం టీ అయితే... జబులు, గొంతులో గరగరను పోగోడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది లెమన్ గ్రాస్ టీ.

లెమన్ గ్రాస్‌ అనేది ఓ రకమైన గడ్డి మొక్క. దానికీ నిమ్మకాయకూ సంబంధం లేదు. కానీ అది నిమ్మకాయ వాసన వస్తుంది. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. ఈ లెమన్ గ్రాస్ మన దేశ మార్కెట్లలో పెద్దగా కనిపించదు. ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో మాత్రం లెమన్ గ్రాస్ టీ ప్యాకెట్లు లభిస్తాయి. అలా మనం ఈ టీ తాగొచ్చు. లెమన్ గ్రాస్ (గడ్డి మొక్క)ను ఇళ్లలో పెంచుకోవచ్చు. ఆహారంలో వేసుకోవచ్చు. టీలాగా తాగొచ్చు. మరి దీనితో ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

యాంటీ ఆక్సిడెంట్స్ : మిగతా టీల్లాగే... ఇందులోనూ బాడీలో విషవ్యర్థాల్ని తరిమేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కణాలు పాడవకుండా కాపాడతాయి. అందువల్ల వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. గుండెకు ఈ టీ ఎంతో మేలు చేస్తుంది.

దంతాలకు మేలు : లెమన్ గ్రాస్ టీలో సూక్ష్మక్రిముల అతు చూసే లక్షణం ఉంటుంది. అది మన నోటి దంతాలను కాపాడుతుంది. దుర్వాసన పోగొడుతుంది. దంతాలు కుళ్లిపోకుండా చేస్తుంది. చిగుళ్లు దెబ్బ తినకుండా కాపాడుతుంది.

కాన్సర్ రాకుండా : రకరకాల వ్యాధుల్లో ఒకటైన కాన్సర్ రాకుండా లెమన్ గ్రాస్ టీ కాపాడుతోందని పరిశోధనల్లో తేలింది. కీమోథెరపీ చేసే సమయంలో... ఈ టీ ఇస్తున్నారు.

జీర్ణశక్తికి : కొంతమందికి ఏం తిన్నా సరిగా జీర్ణం కాదు. అలాంటి వారు... ఆహారం తిన్నాక... ఈ టీ తాగితే... దెబ్బకు అరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు కూడా.చర్మానికి మేలు : చర్మంపై మొటిమలు, మచ్చలు, ఆనికాయలు, కురుపులు ఇలాంటివి ఏవి ఉన్నా... ఈ టీ తాగుతూ ఉంటే... క్రమంగా అవి తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ టీలో గుణాలు చెడు కణాల్ని తొలగించి... మంచి కణాల్ని పెంచుతాయి.
Published by: Krishna Kumar N
First published: July 5, 2020, 2:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading