Home /News /life-style /

WANT TO TAKE CARE OF YOUR SKIN IN WINTER TOO THEN TAKE THESE PRECAUTIONS FOR BEAUTIFUL SKIN PRV

Skin care for face: చలికాలంలో మీ చర్మం పాడవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చర్మంపై మొటిమలు, పొడిబారడం, చికాకు ఇతర సమస్యలు ఏర్పడుతుంటాయి. అంటే చలికాలంలో మనం వేసుకుంటున్న క్రీములను (creams) సరిగ్గా ఎంపిక చేసుకున్న తర్వాతే వాడాలి.

    చాలా మంది అందం (beauty)గా లేమని బాధపడుతూ ఉంటారు కూడా. ఆత్మన్యూనతా భావంలోకి వెళతారు. అయితే వారి చర్మంలో కాంతి ఉంటే అందంగా కనిపిస్తారు. అయితే శీతాకాలంలో ముఖంపై నల్లటి మచ్చలు (Black spots) వారి ముఖాన్ని అందంగా కనిపించకుండా అడ్డుకుంటాయి. ఏదో క్రీములు (creams) వాడి వాటిని కనిపంచకుండా చేసినా.. అది ఆ సమయం వరకే. మళ్లీ ముఖం కడుక్కుంటే మచ్చలే (Black spots)  కనిపిస్తాయి. దాచితే దాగినవి మచ్చలు.  వీలైనంత వరకు అందంగా (beauty) తయారవ్వాలని ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటుంటారు. అయితే శీతాకాలంలో చాలా మంది చర్మం విషయంలో జాగ్రత్తలు (precautions) తీసుకోవాలనుకుంటారు. ఆ నల్ల మచ్చలు (Black spots)  వారి ముఖంలో కాంతిని కోల్పోయేలా చేసి అంద వికారంగా కనిపిస్తుంటుంది. .

    చలికాలంలో (winter) ప్రతి ఒక్కరి చర్మం (skin) చాలా పొడిగా, నిర్జీవంగా మారడం ప్రారంభమవుతుంది. దీనిని నివారించడానికి చాలా మంది కోల్డ్ క్రీం (cold cream) రాస్తుంటారు. తమ చర్మం రకం తెలుసుకోకుండానే మార్కెట్లో లభించే ఏదో ఒక క్రీమ్ అప్లై చేయడం తరచుగా జరుగుతుంది. ఆ తర్వాత చర్మంపై మొటిమలు, పొడిబారడం, చికాకు ఇతర సమస్యలు ఏర్పడుతుంటాయి. అంటే చలికాలంలో మనం వేసుకుంటున్న క్రీములను (creams) సరిగ్గా ఎంపిక చేసుకున్న తర్వాతే వాడాలి.  కొన్ని చిట్కాలతో (skin care for face) మీ చర్మాన్ని అందంగా చేసుకోవచ్చు.

    మీ చర్మం పొడిగా ఉన్నట్లయితే.. మీ చర్మంలో ఆయిల్ (oil) తక్కువగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ కారణంగా చర్మంపై క్రీమ్ అప్లై చేసిన తర్వాత కూడా చాలా త్వరగా పొడిగా మారుతుంది. అటువంటి చర్మంపై క్రీమ్ ఎక్కువసేపు పనిచేయదు. ఇటువంటి పరిస్థితిలో చల్లని వాతావరణంలో కూడా పొడి చర్మం చాలా త్వరగా పగుళ్లు (cracks) ఏర్పడుతాయి. ఈ రకమైన చర్మం కోసం మీరు హైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉన్న అటువంటి క్రీమ్లను ఎంచుకోవాలి.

    సెన్సిటివ్ స్కిన్ (sensitive skin) ఉన్నవారికి చలికాలంలో దురద సమస్య ఉండవచ్చు. అటువంటి చర్మం ఉన్నవారు తమ కోసం క్రీమ్‌ను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ చర్మంపై చాలా క్రీమ్‌లు అలెర్జీని కలిగిస్తాయి. వీలైనంత వరకు ఈ వ్యక్తులు యాంటీఆక్సిడెంట్లు (anti accidents) సువాసనలు లేని క్రీములను ఎంచుకోవాలి.

    చలికాలం (winter)లో కూడా చాలా మందికి జిడ్డు చర్మం ఉంటుంది.  దుమ్ము, మట్టి సమస్య, మొటిమలు (pimples) జిడ్డు చర్మంపై ఎక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో జిడ్డుగల చర్మం (oily skin) ఉన్నవారు జెల్, సీరం చాలా తక్కువ హైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉన్నారన అర్థం చేసుకోవాలి. ఇలాంటివారు బాడీ లోషన్ (body lotion) ఎంచుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Skin care

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు