Home /News /life-style /

WANT TO SLEEP PEACEFULLY THEN FOLLOW THIS SIMPLE AND EASY TIPS TO GET RID OF INSOMNIA PROBLEMS PRV

Best Sleep tips: రాత్రివేళ నిద్ర తొందరగా రావడం లేదా? అయితే ఈ టిప్స్​ పాటిస్తే బెటర్​..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

నిద్ర లేకపోవడం (No sleep) వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు. ఈ చిట్కాలు (Tips for Sleep) పాటిస్తే చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది..

    కరోనా లాక్​డౌన్​ కారణంగా చాలామంది రాత్రిళ్లు మేల్కునే ఉన్నారు. దీంతో అన్​లాక్‌ అనంతరం మళ్లీ సాధారణ జీవితం గడపాలనుకున్నా.. సాధ్యం కావడం లేదని పలువురు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం. నిద్రలేమి (Insomnia). లాక్​డౌన్​ కాలంలో పనేమీ లేకపోవడంతో ఇంట్లోనే ఇష్టం వచ్చిన సమయంలో నిద్రించేవారు. కానీ. మళ్లీ రొటీన్​ జీవితంలోకి అడుగుపెట్టాక అది ఇబ్బందిగా మారుతోంది. ఉద్యోగస్తులకైతే మరీ కష్టం. రాత్రిళ్లు నిద్ర లేకపోవడం (sleeping problems), ఉదయాన్నే ఆఫీసులో నిద్ర రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి. నిద్రలేమికి ఆయుర్వేదం(Ayurveda)లో కొన్ని రకాల చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. అవేంటో చూద్దాం.. రాత్రి పడుకునే ముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె(oil), లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి. రాత్రి పూట కాసిని గోరువెచ్చని పాలు(milk) తాగాలి. నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్ చూడటం మానేయాలి.

    గసగసాలను దోరగా వేయించి..

    ఇంకా, రాత్రిళ్లు తల పక్కన మొబైల్ పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావం వల్ల కూడా సరిగా నిద్ర రాదు. కాబట్టి మొబైల్ కోసం దూరంగా పెట్టడం మంచిది. పడుకునే ముందు నాటు ఆవు నెయ్యి గోరువెచ్చగా చేసుకొని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి. గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉండాలి.

    ధ్యానం చేయాలి..

    చేతివేళ్లతో లేదా దువ్వెనతో తల వెంట్రుకలను మృదువుగా దువ్వుకుంటూ ఉండాలి. చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దన చేసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయాలి లేదా ఏవైనా సుందర దృశ్యాలను ఊహించుకోవాలి. ఓంకారం లేదా మృదువైన లలిత సంగీతాన్ని పెట్టుకొని ప్రశాంతంగా కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే తొందరగా నిద్ర పడుతుంది.

    మనిషి ఆరోగ్యకరం (healthy) గా జీవించడానికి, రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర (Sleep) అవసరం. అలాగే మనం పడుకున్న తరువాత గాఢ నిద్ర (sleep)లో ఎంతసేపు ఉన్నాం అనేది చూసుకోవాలి. ఇటువంటి గాఢ నిద్ర పట్టాలంటే మన ఆహారంలో కొన్ని పదార్ధాలు (Items) తప్పని సరిగా తీసుకోవాలి. మన అందరికి విరివిగా దొరికే పండ్ల (Fruits)లో అరటి పండ్లు (banana) కూడా ఒకటి. వీటిలో మెగ్నీషియం, పొటాషియం వంటివి మన కండరాలు రిలాక్స్ (Relax) కావడానికి ఉపయోగపడతాయి. అరటిలో ఉండే కార్బోహైడ్రేట్ రక్తంలోని గ్లూకోజ్ తగ్గకుండా చేసి నిద్ర త్వరగా రావడానికి సహాయపడతాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Sleep tips

    తదుపరి వార్తలు