Home /News /life-style /

WANT TO SLEEP PEACEFULLY THEN FOLLOW THESE TIPS REGULARLY SUGGESTED BY EXPERTS AND TAKE SOME PRECAUTIONS PRV

Sleep problems: నిద్ర హాయిగా పట్టడం లేదా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ మధ్య కాలంలో యువత (youngsters) పెద్దలు అందరూ కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏది అంటే నిద్రలేమి. అలాంటి వరాఉ ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే.

    కరోనా అందరి జీవితాలను కకావికలం చేసింది. అలవాట్లు మారిపోయాయి. ఆర్థికంగా చితికిపోయారు జనం. దీంత ఒత్తిడితో కూడిన ఉద్యోగం..  ఉరుకుల పరుగుల జీవితం .. అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు ఎక్కువైపోయాయి. ఆరోగ్యాన్ని పాడు చేసే సరికొత్త పోకడలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల (health problems)తో నేటి రోజులలో జనాలు బాధపడుతూ ఉన్నారు.  సాధారణంగా మనిషి జీవన శైలిలో తినడానికి పడుకోవడానికి ఉదయం నిద్ర (sleep) లేవడానికి కూడా ఒక సమయం సందర్భం అంటూ ఉంటుంది . కానీ నేటి రోజుల్లో మాత్రం సమయం అంటూ ఏదీ లేదు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తినడం ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పడుకోవడం (sleeping)..  ఇక ఇష్టం వచ్చినప్పుడు లేవడం లాంటివి చేస్తున్నారు. ఎంతో మందిపై  ఆరోగ్య సమస్యలు దూసుకొచ్చి మీద పడి పోతున్నాయి.

    అయితే ఈ మధ్య కాలంలో యువత (youngsters) పెద్దలు అందరూ కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏది అంటే నిద్రలేమి (Insomnia) అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ప్రస్తుతం అధునాతన జీవనశైలిలో  ఒత్తిడితో కూడిన లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే ఎంతోమంది పడుకున్నప్పటికీ నిద్ర (sleep) పట్టక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. కారణాలు ఏమైనప్పటికీ నిద్రపట్టడానికి మాత్రం కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

    రోజుకు 7 గంటల నిద్ర..

    రాత్రి పడుకునే ముందు ఆవు నెయ్యి (Cow ghee) గోరు వెచ్చగా చేసుకుని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి. ఇలా చేస్తా కచ్చితంగా నిద్ర పట్టే అవకాశాలున్నాయి. లేదా గసగసాల్ని దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించి వాసన పీలుస్తూ ఉండాలి. రోజుకు 7-8 గంటల సేపు రాత్రి నిద్ర అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ చాలామందికి వివిధ కారణాలతో రాత్రిళ్లు త్వరగా నిద్రపట్టదు. బెడ్‌పై గంటల కొద్దీ దొర్లుతూనే ఉంటారు కానీ నిద్రపోలేరు. అందుకే ఇలా నిద్రపట్టక బాధపడేవారు ఈ టిప్స్ పాటిస్తే (sleep tips) వెంటనే నిద్రపడుతుంది.

    చేతివేళ్లతో లేదా దువ్వెన (comb)తో తల వెంట్రుకల్ని మృదువుగా దువ్వుతూ  లేదా చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేసినా నిద్ర పడుతుంది. రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె (Sesame oil) లేదా కొబ్బరి నూనెతో మర్దనా చేసుకున్నా నిద్ర పడుతుంది. అలా కాదనుకుంటే రాత్రి పూట (night Sleep) గోరు వెచ్చని పాలు..మిరియాల పౌడర్ కలుపుకుని తాగాలి.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Sleep tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు