Home /News /life-style /

WANT TO SLEEP PEACEFULLY IN NIGHT TIME THEN YOU MUST KNOW FEW THINGS AND FOLLOW THIS TIPS FOR BETTER SLEEP PRV

Sleep tips: రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా? అయితే ఈ ఆహారం లోపం కావచ్చు.. వీటిని తప్పక తీసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎంతోమంది పడుకున్నప్పటికీ నిద్ర (sleep) పట్టక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు.  నిద్రపట్టడానికి మాత్రం కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని రకాల టిప్స్ (Sleep tips)​ పాటిస్తే హాయిగా నిద్ర పడుతుందట.

    ఉరుకుల పరుగుల జీవితం ఒత్తిడితో కూడిన ఉద్యోగం..  అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు.. ఆరోగ్యాన్ని పాడు చేసే సరికొత్త పోకడలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల (health problems)తో నేటి రోజులలో జనాలు బాధపడుతూ ఉన్నారు.  సాధారణంగా మనిషి జీవన శైలిలో తినడానికి పడుకోవడానికి ఉదయం నిద్ర (sleep) లేవడానికి కూడా ఒక సమయం సందర్భం అంటూ ఉంటుంది . కానీ నేటి రోజుల్లో మాత్రం సమయం అంటూ ఏదీ లేదు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తినడం ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పడుకోవడం (sleeping)..  ఇక ఇష్టం వచ్చినప్పుడు లేవడం లాంటివి చేస్తున్నారు ఎంతో మందిపై  ఆరోగ్య సమస్యలు దూసుకొచ్చి మీద పడి పోతున్నాయి.

    అయితే ఈ మధ్య కాలంలో యువత (youngsters) పెద్దలు అందరూ కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏది అంటే నిద్రలేమి (Insomnia) అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ప్రస్తుతం అధునాతన జీవనశైలిలో  ఒత్తిడితో కూడిన లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే ఎంతోమంది పడుకున్నప్పటికీ నిద్ర (sleep) పట్టక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు . నిద్రపట్టడానికి మాత్రం కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని రకాల టిప్స్ (Sleep tips)​ పాటిస్తే హాయిగా నిద్ర పడుతుందట.

    నిద్రలేమి సమస్య ఏర్పడానికి విటమిన్ (Vitamin) సి, విటమిన్ బి6, విటమిన్ డి, విటమిన్ ఇ లోపం కూడా కారణమవుతాయి. సిట్రస్ (Citrus) పండ్లలో సమృద్ధిగా లభిస్తుంది విటమిన్ సి. ఇది యాంటీఆక్సిడెంట్ల పవర్ హౌస్. రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఇన్ ఫ్లమ్మేషన్ తో పోరాడడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో సహకరిస్తుంది. నారింజలు, బెర్రీలు, మిరియాలు, బ్రకోలీ, నిమ్మకాయ వంటి వాటివలో విటమిన్ సి లభిస్తుంది.

    ప్రశాంతంగా నిద్రపట్టాలంటే (Peaceful sleep) శరీరానికి మెలటోనన్, సెరోటోనిన్ అవసరం. విటమిన్ బి6 లోపం ఉన్న వాళ్లకి నిద్రకు అవసరమయ్యే ఆ హార్మోన్లు ఉత్పత్తి కావు. దీనివల్ల నిద్రలేమి ఏర్పడుతుంది. అరటిపండ్లు, వేరేశెనగలు, ఓట్స్, చికెన్, చేపలు వంటి ఆహారాలను మీ మెనూలో చేర్చుకోండి.

    చర్మం, జుట్టు ఆరోగ్యానికి విటమిన్ ఇ (Vitamin E) అత్యవసరం. అలాగే నిద్రకు కూడా విటమిన్ ఇ అవసరమే. నిద్రలేమి సంబంధిత జ్ఞాపకశక్తి నష్టాన్ని నివారించేందుకు ఈ విటమన్ కావాలి. బాదం, పొద్దుతిరుగుడు గింజలు, నూనె, గుమ్మడికాయ, బచ్చలికూర, పాలకూర, ఎరుపు క్యాప్సికమ్ వంటివి తింటే విటమిన్ ఇ లోపం ఏర్పడదు.

    సన్‌షైన్ విటమిన్‌గా పిలుచుకునే విటమిన్ డి ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. మానసిక స్థితిని నియంత్రించడంలో, ఇన్ ఫ్లమ్మేషన్‌ను నివారించడంలో ఇది ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ డి లోపిస్తే చాలా తక్కువ సమయం పాటూ మాత్రమే నిద్రపడుతుంది. ఎండలో కాసేపు కూర్చోవడం, పుట్టగొడుగులు, సాల్మన్ చేపలు తినడం ద్వారా విటమిన్ డి లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Fruits, Sleep tips, Vitamins

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు