Home /News /life-style /

WANT TO SLEEP PEACEFULLY IN NIGHT THEN FOLLOW THESE TIPS DAILY SUGGESTED BY EXPERTS PRV

sleep tips: నిద్ర తొందరగా పట్టకపోతే రోజూ రాత్రివేళల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి.. హాయిగా పడుకోవచ్చు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం అధునాతన జీవనశైలిలో  ఒత్తిడితో కూడిన లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే ఎంతోమంది పడుకున్నప్పటికీ నిద్ర (sleep) పట్టక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు .

    ఉరుకుల పరుగుల జీవితం ఒత్తిడితో కూడిన ఉద్యోగం..  అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు.. ఆరోగ్యాన్ని పాడు చేసే సరికొత్త పోకడలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల (health problems)తో నేటి రోజులలో జనాలు బాధపడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.  సాధారణంగా మనిషి జీవన శైలిలో తినడానికి పడుకోవడానికి ఉదయం నిద్ర (sleep) లేవడానికి కూడా ఒక సమయం సందర్భం అంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ నేటి రోజుల్లో మాత్రం సమయం అంటూ ఏదీ లేదు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తినడం ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పడుకోవడం (sleeping)..  ఇక ఇష్టం వచ్చినప్పుడు లేవడం లాంటివి చేస్తున్నారు ఎంతో మందిపై  ఆరోగ్య సమస్యలు దూసుకొచ్చి మీద పడి పోతున్నాయి.

    అయితే ఈ మధ్య కాలంలో యువత (youngsters) పెద్దలు అందరూ కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏది అంటే నిద్రలేమి (Insomnia) అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ప్రస్తుతం అధునాతన జీవనశైలిలో  ఒత్తిడితో కూడిన లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే ఎంతోమంది పడుకున్నప్పటికీ నిద్ర (sleep) పట్టక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  అయితే ఇలా నిద్రపట్టక పోవడానికి కారణాలు ఏమైనప్పటికీ నిద్రపట్టడానికి మాత్రం కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

    ప్రస్తుతం హడావిడి ప్రపంచంలో చాలా మంది రాత్రిళ్లు లేట్ గా పడుకోవడం (late night sleep).. మళ్లీ ఉదయాన్నే లేచి ఉద్యోగాలకు పరుగులు తీస్తుంటారు. సరైన నిద్ర లేకుండా చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోంటుంటారు. మంచి నిద్ర (good sleep) మెదడులోని మలినాలను తొలగించడమే కాకుండా.. మెదడును చురుగ్గా ఉండేలా చేయడమే కాకుండా.. నరాల వ్యాధులను నియంత్రించడంలో తొడ్పడుతుంది.

    మెదడు నుంచి మలినాల తొలగింపు మెలకువగా, నిద్రలో (sleep) ఉన్నప్పుడు కొంత స్థాయిలో జరుగుతున్నా.. మంచి , దీర్ఘమైన నిద్ర పోయినప్పుడు మాత్రం సమర్థంగా జరుగుతుంది అని అధ్యయనాల్లో వెలువడింది. మనుషులు మాత్రమే కాకుండా జంతువులు, పక్షులు, సూక్ష్మ కీటకాలలో కూడా నిద్ర (sleep) అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది.

    రాత్రిళ్లు తక్కువగా తినాలి (eat less in night). నిద్రకు రెండు, మూడు గంటల ముందు ఎక్కువగా తినకూడదు., రోజు పొద్దున్న నడక, చిన్నపాటి వ్యాయామం చేయడం వలన నిద్ర వస్తుంది. రాత్రి ల్యాప్‏టాప్‏లు (laptops), టీవీలు, మొబైల్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చూడటం తగ్గించాలి. మద్యం (alcohol), కాఫీ, టీ (tea), చాకెట్లు రాత్రి తినకూడదు. అలాగే నీలం రంగు లైట్లలో ఉండకూడదు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Coffee, Mobiles, Sleep tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు