Home /News /life-style /

WANT TO REMOVE PIMPLES FROM YOUR FACE THEN USE THESE NEE LEAVE FACE PACK CLICK HERE TO KNOW FULL DETAILS PRV

beauty tips: చర్మంపై మొటిమల సమస్య తగ్గించడానికి వేపాకులే పరమ ఔషధం.. ఏం చేయాలంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చర్మంపై మొటిమలను తగ్గించుకోటానికి చాలా మంది చర్మ వైద్య నిపుణులను కలవటం లేదా మార్కెట్ లో లభించే ఉత్పత్తులను వాడుతుంటారు. మొటిమల సమస్య నుంచి బయటపడటానికి మీరు వేపను ఉపయోగించవచ్చు. వేప ఒక ఔషధంగా మాత్రమే కాకుండా చర్మ సమస్యలను కూడా తొలగిస్తుంది.

ఇంకా చదవండి ...
    యుక్త వయస్సులోకి అడుగుపెట్టాకగానే ముఖంపై వచ్చే మొటిమలు తెగ ఇబ్బంది పెడుతుంటాయి. అయితే యవ్వన ప్రాయంలో మొటిమలు (Pimples) రావడం అనేది సర్వసాధారణమే. కానీ వయసుతో సంబంధం లేకుండా పెద్దవారిలో కూడా మొటిమలు వస్తే అది చర్మ (skin) సంబంధిత సమస్యేనని గుర్తించాలి. యుక్త వయసు దాటాక కూడా మొటిమలు వస్తుంటే అది ఏదో ఒక జబ్బుకి సంకేతం అయ్యుండొచ్చు. అందుకే మొటిమల సమస్య (acne problems) గురించి ఎప్పటికప్పుడు డాక్టర్లకు తెలియజేయాలి. జీవన విధానం, పేలవమైన చర్మ సంరక్షణ (skin care tips) అలవాట్లు, వాతావరణ పరిస్థితుల వల్ల మొటిమలు (pimples) వచ్చే ఆస్కారం ఉంది. పింపుల్స్ ను చేతి వేళ్లతో నొక్కటం వలన ముఖంపై మచ్చలు ఏర్పడి, భయట తిరగానికి లేదా పార్టీలకు వెళ్ళటానికి ఇబ్బందికరంగా భావిస్తుంటారు. వీటిని తగ్గించుకోటానికి చాలా మంది చర్మ వైద్య నిపుణులను కలవటం లేదా మార్కెట్ లో లభించే ఉత్పత్తులను వాడుతుంటారు.

    మొటిమల సమస్య నుంచి బయటపడటానికి మీరు వేప (Neem)ను ఉపయోగించవచ్చు. వేప ఒక ఔషధంగా మాత్రమే కాకుండా చర్మ సమస్యలను కూడా తొలగిస్తుంది. సహజమైన గ్లో విషయానికి వస్తే, వేప కంటే ఉత్తమమైనది మరొకటి లేదు. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడమే కాకుండా మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. చర్మాన్ని శుభ్రపరచడానికి మీరు వేప ఆకులను (Neem Leaves) ఉపయోగించవచ్చు. మీరు దీన్ని ఫేస్ ప్యాక్‌ (face pack)గా చేసుకొని వాడుకోవచ్చు. ఇది కాకుండా చర్మంలో పేరుకుపోయిన ధూళిని శుభ్రపరచడంలో ఇది సహాయపడుతుంది. వేప ఫేస్ ప్యా (Neem face pack)క్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

    ఓ పది వేప ఆకులు (Neem leaves), 2 స్పూన్ల తేనె (honey), చిటికెడు దాల్చిన చెక్క పొడి తీసుకోండి.  10 నుంచి 12 వేప ఆకులను రుబ్బుకుని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇందులో తేనె, దాల్చిన చెక్క పౌడర్‌ కలపాలి. మీకు మొటిమల సమస్య ఉంటే ఈ మిశ్రమాన్ని ముఖం పై 10 నిమిషాలు అప్లై చేసి ఆరిన తరువాత చల్లటి నీటితో కడగాలి. తరువాత ముఖంపై మాయిశ్చరైజర్ రాయాలి.

    2. వేప, ముల్తానీ మట్టి పేస్ట్ (Multani clay paste)​తో కూడా మీ ముఖం మెరిసిపోయేలా చేసుకోవచ్చు. కొన్ని వేప ఆకులు, 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్, 2 స్పూన్ ముల్తానీ మట్టి తీసుకోండి. మొదట మీరు వేప ఆకులను రుబ్బుకొని పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. అందులో రోజ్ వాటర్ కలపాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి వేసి మందపాటి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడపై అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగి ఆపై రోజ్‌వాటర్‌ ముఖంపై అప్లై చేయాలి.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Ayurvedic medicine, Beauty tips, Skin care

    తదుపరి వార్తలు