Home /News /life-style /

WANT TO REMOVE BLACK SPOTS AND PIMPLES ON YOUR FACE THEN FOLLOW THIS RICE PACE PACK FOR YOUR SKIN PRV

Skin care for face: ముఖంలో తేజస్సు తగ్గిపోతుందా? మొటిమలు, మచ్చలు ఎక్కువున్నాయా? అయితే ఇలా చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బియ్యం పిండి ప్యాక్​ చర్మంపై మొటిమలు, మచ్చలు, ముడతలను (Pimples, scars, wrinkles on the skin) తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. బియ్యం పిండితో చేసుకునే ఫేస్ ప్యాక్ (Face pack) ల గురించి తెలుసుకుందాం

    చాలా మంది అందం (beauty)గా లేమని బాధపడుతూ ఉంటారు కూడా. ఆత్మన్యూనతా భావంలోకి వెళతారు. అయితే వారి చర్మంలో కాంతి ఉంటే అందంగా కనిపిస్తారు. అయితే ముఖంపై నల్లటి మచ్చలు (Black spots) వారి ముఖాన్ని అందంగా కనిపించకుండా అడ్డుకుంటాయి. ఏదో క్రీములు (creams) వాడి వాటిని కనిపంచకుండా చేసినా.. అది ఆ సమయం వరకే. మళ్లీ ముఖం కడుక్కుంటే మచ్చలే (Black spots)  కనిపిస్తాయి. దాచితే దాగినవి మచ్చలు.  వీలైనంత వరకు అందంగా తయారవ్వాలని ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటుంటారు.

    అయితే చాలా మంది ఎంత అందంగా ఉన్నప్పటికీ ముఖంపై నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతుంటారు. ఆ నల్ల మచ్చలు (Black spots)  వారి ముఖంలో కాంతిని కోల్పోయేలా చేసి అంద వికారంగా కనిపిస్తుంటుంది. చాలా మందికి వయసు పైబడే కొద్ది ముఖంపై నల్ల మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి నొప్పిని, బాదని అయితే కలిగించవు. కానీ ముఖంపై ఈ నల్లటి మచ్చల వలన వారు మానసికంగా చాలా కుంగిపోతుంటారు. ఎలా ఈ నల్లమచ్చలను పోగొట్టి అందంగా కనిపించాలి అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారు ఈ చిట్కా (Skin care for face) పాటిస్తే సరిపోతుంది.

    బియ్యం పిండిని పూర్వకాలంలో సౌందర్య లేపనంగా (Cosmetic ointment) ఉపయోగించేవారు. అందుకే వారికి ఎటువంటి చర్మ సమస్యలు ఉండేవి కాదు. బియ్యం పిండి చర్మానికి అద్భుతమైన ఫలితాలను అందించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మంపై మొటిమలు, మచ్చలు, ముడతలను (Pimples, scars, wrinkles on the skin) తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇది చర్మానికి బ్లీచ్ గా, స్క్రబ్ గా సహాయపడి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. బియ్యం పిండితో చేసుకునే ఫేస్ ప్యాక్ (Face pack) ల గురించి తెలుసుకుందాం..

    మొటిమలను, మచ్చలను తగ్గిస్తుంది

    ఒక కప్పులో బియ్యం పిండి (Rice flour), కలబంద గుజ్జు (Alovera gel), తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గిపోయి చర్మానికి మంచి నిగారింపు అందుతుంది.మృతకణాలు తొలగిపోతాయి

    ఒక కప్పులో బియ్యం పిండి (Rice flour), బాగా పండిన అరటి పండు గుజ్జు (Banana pulp), ఆముదం (Castor oil) వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని కళ్ళ కింద ఏర్పడిన డార్క్ సర్కిల్స్ లపై అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ డార్క్ సర్కిల్స్ ను తగ్గించి కళ్ళకింద చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

    ఒక కప్పులో బియ్యం పిండి (Rice flour), సెనగ పిండి (Besan), తేనె (Honey), కొబ్బరి నూనె (Coconut oil), పంచదార (Sugar) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని అరగంట తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇది చర్మానికి మంచి స్క్రబ్ గా ఉపయోగపడి మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది. డార్క్ సర్కిల్స్ తొలగిస్తుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Beauty tips, Rice, Skin care

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు