హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Beauty tips: జుట్టులో తెల్ల వెంట్రుకలు ఎక్కువగా వస్తున్నాయా? అయితే ఈ పద్దతి పాటించి.. సమస్య దూరం చేసుకోండి

Beauty tips: జుట్టులో తెల్ల వెంట్రుకలు ఎక్కువగా వస్తున్నాయా? అయితే ఈ పద్దతి పాటించి.. సమస్య దూరం చేసుకోండి

రోజుకు చాలాసార్లు తల దువ్వుకోవడం ఆరోగ్యకరం: రోజుకు చాలాసార్లు తల దువ్వడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది మరియు తలకు నూనె వస్తుంది. కానీ ఇలా ఎక్కు సార్లు దువ్వడం వల్ల జుట్టు మూలాలు బలహీనపడతాయి, జుట్టు రాలడం పెరుగుతుంది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

రోజుకు చాలాసార్లు తల దువ్వుకోవడం ఆరోగ్యకరం: రోజుకు చాలాసార్లు తల దువ్వడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది మరియు తలకు నూనె వస్తుంది. కానీ ఇలా ఎక్కు సార్లు దువ్వడం వల్ల జుట్టు మూలాలు బలహీనపడతాయి, జుట్టు రాలడం పెరుగుతుంది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

చాలా మందికి చిన్న తనం నుంచే తెల్ల వెంట్రుకలు (white hairs) వచ్చేస్తున్నాయి. అయితే సాధారణంగా వయస్సు పెరిగిన తర్వాత కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల తల వెంటుకలు తెల్లగా మారతాయి.

జుట్టు (hair) ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. కాకపోతే మగవారు బట్టతల వస్తుందని తెలిసే సరికి పట్టించుకోవడం మొదలెడతారు . జుట్టు (hair) రాలిపోతుండటాన్ని (loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. మహిళల కురులు  (women hairs) మగవారికీ ఇష్టమే. కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా  (beauty) కనిపిస్తారు. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్​ స్టైల్స్​ను ఫాలో అవుతారు. అయితే. ఇక సెలెబ్రెటీలైతే సరే సరి వారి కోసం పర్సనల్ హెయిర్​ స్పెషలిస్టులను పెట్టుకుంటారు. అయితే మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది.

ఈ రోజుల్లో చాలా మందికి చిన్న తనం నుంచే తెల్ల వెంట్రుకలు (white hairs) వచ్చేస్తున్నాయి. అయితే సాధారణంగా వయస్సు పెరిగిన తర్వాత కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల తల వెంటుకలు తెల్లగా మారతాయి. కానీ, ఈ సమస్య ముందుగానే వస్తే .. ఇక చిన్న వయస్సులోనే ఈ తెల్ల వెంటుకలు వస్తాయి. అయితే, ఈ తెల్ల వెంటుకల సమస్యను మీరు ముందుగా గుర్తించినప్పుడే దానిని పరిష్కరించడం సాధ్యమవుతుంది. ఇక కొంత మందిలో ముందుగానే మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.

అందుకే వారి జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. ఇక చాలా చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఒత్తిడి, రెండోది పోషకాహార లోపం (Malnutrition) అని చెప్పాలి. సమస్యని అధిగమిస్తే మీరు తప్పకుండా తెల్ల జుట్టు సమస్య నుంచి చాలా ఈజీగా బయటపడొచ్చు. అలాగే ముఖ్యంగా ఈ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా మంచి జుట్టుకి తగిన పోషకాలను తీసుకోవాలి. అప్పుడే మన జుట్టు కుదుళ్లలో ఈ మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది

కొన్ని సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా కూడా ఈ తెల్ల జుట్టు సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. అలాగే పాంటోథెనిక్ ఆమ్లం అని కూడా పిలువబడే ఈ విటమిన్ B 5 (Vitamin B5) జుట్టు తెల్లబడే ప్రక్రియను ఆలస్యం చేసే అవకాశం చాలానే ఉంది. కాబట్టి వైద్యుల సూచన తీసుకుని.. ప్రతి రోజూ కూడా 100-200 మిల్లీగ్రాముల కాల్షియం పాంతోథెనిక్ ఆమ్లం తీసుకోవడం ద్వారా ఈ తెల్ల జుట్టు సమస్యను చాలా ఈజీగా అధిగమించవచ్చు. అయితే, ఈ సప్లిమెంట్లను ఇష్టానుసారం తీసుకోకూడదని, వైద్యులు సూచించే బ్రాండ్లు, మోతాదుల ప్రకారమే తీసుకోవాలి.

First published:

Tags: Beauty tips, Hair problem tips

ఉత్తమ కథలు