Home /News /life-style /

skin care for face: చర్మం ముడతలు పడుతోందా? అయితే శీతాకాలంలో చర్మాన్ని ఈ పద్దతులతో కాపాడుకోండి

skin care for face: చర్మం ముడతలు పడుతోందా? అయితే శీతాకాలంలో చర్మాన్ని ఈ పద్దతులతో కాపాడుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చర్మం పగలడం లేదా చర్మం ( Skin ) పొడి బారి.. దురద రావడం, ముఖంపై ముడతలు రావడం  శీతాకాలంలో సహజంగా ఎదురయ్యే  సమస్యలు . కొన్ని పద్దతులతో ముఖంపై ముడతలను తొలగించొచ్చు

    వాతావరణం కలుషితం (pollute) అయిపోతోంది. మనిషికి మానసికంగా ఒత్తిడి పెరిగిపోతోంది. తన శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోలేని బిజీ జీవితంలో మనిషి ఉన్నాడు. అయితే మన శరీరమే మనకు ఆరోగ్యాన్ని, జీవిత కాలాన్ని పెంచుతుందనేది అక్షర సత్యం. ఇక మన చర్మం (skin) మనలోని భావుకతని, అందాన్ని ప్రతిబింబిస్తుంది. వర్షాకాలం (monsoon), చలికాలం (Winter) శరీరం మార్పులకు గురవుతూ ఉంటుంది. చర్మాన్ని, ముఖ్యంగా ఫేస్​ని (skin care for face) ఎక్కువగా రక్షించుకోవాల్సిన సమయాలు ఇవి. చాలామందికి బయటి వాతావరణం ఆహ్లాదంగా కనిపించినా వారి చర్మం (skin)లో వచ్చే మార్పులు చూసి తట్టుకోలేరు. బాహ్య చర్మ సంరక్షణ ( External skin care ) చాలా కీలకమవుతుంటుంది. ముఖ్యంగా చర్మ సంరక్షణ విషయంలో.. చర్మం సంరక్షణ ( Skin protection ) అనేది చాలా కీలకం. అంతర్గత ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. బాహ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యం.

    శీతాకాలంలో సహజంగా ఎదురయ్యే సమస్య

    చర్మం పగలడం లేదా చర్మం ( Skin ) పొడి బారి.. దురద రావడం, ముఖంపై ముడతలు రావడం  శీతాకాలంలో (Winter) సహజంగా ఎదురయ్యే  సమస్యలు . సాధారణంగా వయసు మీద పడే కొద్దీ ముఖం (face)పై ముడతలు (Wrinkles) వస్తూ ఉంటాయి. ముడతలు వచ్చిన ముఖంలో కాంతి (brightness) తగ్గుతుంది. పట్టు కోల్పోయిన చర్మం అందాన్ని కూడా కోల్పోతుంది. కొన్ని పద్దతులతో ముఖంపై ముడతలను తొలగించొచ్చు (Skin care for face). చక్కెర (sugar) అధికంగా తీసుకోవడం వలన కూడా ముఖంపై ముడతలు కారణమవుతోందని అంటున్నారు. షుగర్ కారణంగా గ్లైకేషన్ ప్రక్రియలో ప్రమాదం అయినటువంటి ఫ్రీ-రాడికల్స్‌గా మార్చబడిన, కణాలను దెబ్బతీసి ముఖం ముడుతలు (Wrinkles) ఏర్పడడానికి కారణం అవుతుందని అంటున్నారు.

    చర్మం నిర్జీవంగా మారి ముడతలు..

    చర్మంపై ముడతలు (Wrinkles on skin) రావడానికి చర్మాన్ని తేమగా ఉంచకపోవడం కూడా ఒక కారణం. దీని వల్ల చర్మం నిర్జీవంగా మారి ముడతలు ఏర్పడుతాయి. వీటిని నివారించడానికి నాణ్యత గల మాయిశ్చరైజర్‌ (Moisturizer)ని ఉపయోగించడం అవసరం. శరీరంలో నీరు లేకపోవడం వల్ల చర్మం నిర్జీవంగా మారుతుంది. నీరు శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకు పంపి చర్మానికి మెరుపును తెస్తుంది. కాబట్టి ప్రతిరోజూ కనీసం 4 లీటర్ల నీరు తాగాలి. మీ చర్మం అందంగా తయారవుతుంది.

    ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడగాలి

    సూర్యుని హానికరమైన కిరణాల (rays) కారణంగా చర్మం (skin)పై అనేక సమస్యలు ఏర్పడుతాయి. వీటిని నివారించడానికి సన్‌స్క్రీన్ క్రీమ్ (sunscreen cream) అప్లై చేయడం అవసరం. ఎండలో బయటకు వెళ్లినప్పుడు చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచాలి (cover your skin). బయట తిరిగి వచ్చిన తర్వాత చర్మాన్ని లోతుగా శుభ్రం చేయాలి. ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడగాలి (Wash face with facewash). ఎందుకంటే బయట ఉన్న దుమ్ము మన చర్మ రంధ్రాల్లో నిండిపోతుంది. లోతైన ప్రక్షాళన కోసం మంచి క్లెన్సర్‌ని ఉపయోగించండి.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Skin care

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు